Allu Arjun: ‘మేడమ్ టుస్సాడ్స్’లో మైనపు విగ్రహాం.. తొలి తెలుగు నటుడిగా రికార్డ్.. అదెలా?

ABN , First Publish Date - 2023-10-05T20:51:26+05:30 IST

‘పుష్ప’ చిత్రంలోని నటనకు గానూ ఇటీవలే నేషనల్ అవార్డును పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మరో అరుదైన ఘనతను సాధించారు. ‘మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌’లో మైనపు విగ్రహం ఉన్న మొదటి తెలుగు నటుడిగా ఐకాన్ స్టార్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు. తాజాగా ‘మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌’ వారు అల్లు అర్జున్ కొలతలు తీసుకుంటున్న వీడియో ఒకటి వైరల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Allu Arjun: ‘మేడమ్ టుస్సాడ్స్’లో మైనపు విగ్రహాం.. తొలి తెలుగు నటుడిగా రికార్డ్.. అదెలా?
Icon Star Allu Arjun

‘పుష్ప’ చిత్రంలోని నటనకు గానూ ఇటీవలే నేషనల్ అవార్డును పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ఇప్పుడు మరో అరుదైన ఘనతను సాధించారు. ‘మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌’ (Madame Tussauds Dubai)లో మైనపు విగ్రహం ఉన్న మొదటి తెలుగు నటుడిగా ఐకాన్ స్టార్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు. తాజాగా ‘మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌’ వారు అల్లు అర్జున్ కొలతలు తీసుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ వీడియోలో అల్లు అర్జున్ నల్లటి సూట్ ధరించి కనిపిస్తున్నారు. అయితే ఆయన తొలి తెలుగు హీరో ఎలా అవుతారు? ఇంతకు ముందు మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారి విగ్రహాలను పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి కదా అని అంతా అనుకుంటూ ఉండవచ్చు. అయితే వారి విగ్రహాలను ‘మేడమ్ టుస్సాడ్స్’కు చెందిన సింగపూర్, బాంకాక్ వంటి చోట్ల ఏర్పాటు చేశారు. దుబాయ్‌లో మాత్రం అల్లు అర్జున్ విగ్రహమే ఫస్ట్. అలా తొలి తెలుగు నటుడుగా బన్నీ రికార్డ్ క్రియేట్ చేశారు.

ఈ సంవత్సర ప్రారంభంలో దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రముఖుల మరియు కళాకారుల మధ్య ఒక సిట్టింగ్ జరిగింది. ఇందులో ఒక్కొక్కరి నుంచి 200కి పైగా కొలతలను వారు సేకరించినట్లుగా తెలుస్తోంది. అద్భుతమైన మైనపు విగ్రహాలను రూపొందించడానికి డిటైల్డ్‌గా కొలతలు తీసుకునే ప్రక్రియ ఎప్పటి నుంచో ఉంది. ఈ కొలతలతో వారు రూపొందించే విగ్రహాల పక్కన ఒరిజనల్ వ్యక్తులు నిలబడినా.. ఎవరు నార్మల్ పర్సనో కనిపెట్టడం కష్టమయ్యేంత అద్భుతంగా ఈ మైనపు విగ్రహాలను రూపొందిస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ విగ్రహాన్ని అలా అంతా చూడబోతున్నారు.


Icon-star.jpg

అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అతని రేంజే వేరు. తన విలక్షణమైన నటనతో గ్లోబల్ రేంజ్ గుర్తింపును సొంతం చేసుకున్నారు. నేషనల్ అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించడమే కాకుండా.. ప్రాంతీయ సరిహద్దులను సైతం అధిగమించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారినే కాకుండా.. ఇతర భాషల వారిని సైతం తన అసాధారణమైన నటనా పటిమతో ఫ్యాన్స్ అయ్యేలా చేసుకున్నారు. మున్ముందు ఐకానిక్ పెర్ఫార్మెన్స్‌లతో భారతీయ సినిమాని శాసించడానికి సిద్ధంగా ఉన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్.. రాబోయే రోజుల్లో సినీ రంగంలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడోనని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ పార్ట్ 2 అయిన ‘పుష్ప ది రూల్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 15 ఆగస్ట్, 2024న భారీస్థాయిలో విడుదల కానుంది.


ఇవి కూడా చదవండి:

============================

*Gopichand32: గోపీచంద్, శ్రీను వైట్ల సినిమా షూటింగ్ మొదలైంది.. భారీగానే ప్లాన్ చేశారు

*********************************

*Bhagavanth Kesari: వరుస అప్‌డేట్స్‌తో ఊపుమీదున్న బాలయ్య.. ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!

*********************************

*NTRNEEL: ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ మూవీ మొదలయ్యేది ఎప్పుడంటే..

**********************************

*Kiran Abbavaram: బిగ్‌ బాస్ రతికతో పెళ్లి అనగానే.. కిరణ్ అబ్బవరం రియాక్షన్ చూశారా..

*********************************

*Lethakulu: ఎస్తర్ కీలకపాత్రలో నటిస్తోన్న సినిమా టైటిల్ ఇదే..

******************************

Updated Date - 2023-10-05T20:51:26+05:30 IST