NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..

ABN , First Publish Date - 2023-03-12T10:30:50+05:30 IST

రాజ్యం పిక్చర్స్‌ ‘నర్తనశాల’ (NarthanaShala) (11-10-1963) చిత్రంలోనిది ఈ స్టిల్‌.

NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..
NTR

రాజ్యం పిక్చర్స్‌ ‘నర్తనశాల’ (NarthanaShala) (11-10-1963) చిత్రంలోనిది ఈ స్టిల్‌. ఈ చిత్రానికి కథావేదిక విరాటరాజు కొలువు. సంవత్సరకాలం అజ్ఞాతంగా ఉంటూ పాండవులు ఎవరికి వారు తలదాచుకుని, ఆ తరువాతనే వెలుగులోకి రావాలన్న ప్రయత్నమే ‘నర్తనశాల’ కథాంశం. నటులందరూ కాకలుదీరిన యోధులే అయినా వారందరి మధ్య బృహన్నల పాత్రలో ఎన్‌.టి.ఆర్‌. (NTR) ప్రత్యేకంగా నిలిచి, ఈ చిత్రం అజరామరం కావడానికి తోడ్పడ్డారు. తొలి వరుసలో అగ్రతాంబూలం అందుకున్నారు. ఈ పాత్ర వేయడానికి ఏ నటుడూ సాధారణంగా అంగీకరించడు.

కానీ ఎన్.టి.ఆర్‌ది ఏటికి ఎదురీదే మనస్తత్త్వం. ఎవ్వరూ, ఎప్పుడూ చేయని పాత్రల మీద మోజు. అందుకే నిర్మాతలు అడగగానే అంగీకరించారు. ఎన్‌.టి.ఆర్‌. స్థాయిని పెంచిన బృహన్నల పాత్ర చిత్ర విజయానికి చాలా దోహదపడింది. ఈ పాత్ర స్త్రీ, పురుష సమ్మిళితం కాబట్టి హావభావాల విషయంలో ఏమాత్రం పొరబాటు జరిగినా ఆ పాత్ర అభాసుపాలవుతుంది. ఎన్‌.టి.ఆర్‌కు రిస్కు తీసుకోవడం ఇష్టం గనుక తన అభినయ చాతుర్యంతో విజృంభించి నటించారు. ఇటు స్త్రీ సహజమైన సుమకోమల వయ్యారంతో నర్తనశాలలోనూ, అటు ఉరకలెసే మగటిమితో ఉత్తర గోగ్రహణంలో అపూర్వంగా నటించారు. 1963 సంవత్సరంలో జాతీయస్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా ‘నర్తనశాల’కు రాష్ట్రపతి పురస్కారం లభించింది.

ఇవి కూడా చదవండి:

Writer Padmabhushan OTT Streaming: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Updated Date - 2023-03-12T10:30:51+05:30 IST