Game Changer: బాబాయ్ ఛాన్స్‌ని కొట్టేసిన అబ్బాయ్.. రామ్‌చరణ్‌కి ఎవరి వల్ల సెట్ అయ్యిందంటే..

ABN , First Publish Date - 2023-04-06T12:03:29+05:30 IST

‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో రామ్‌చరణ్ (Ram Charan) రేంజే మారిపోయింది.

Game Changer: బాబాయ్ ఛాన్స్‌ని కొట్టేసిన అబ్బాయ్.. రామ్‌చరణ్‌కి ఎవరి వల్ల సెట్ అయ్యిందంటే..
Ram Charan in Game Changer

‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో రామ్‌చరణ్ (Ram Charan) రేంజే మారిపోయింది. ఈ చిత్రంలో రామ్‌గా ఆయన చేసిన యాక్టింగ్‌కి హాలీవుడ్‌కి చెందిన మహామహులే ఫిదా అయిపోయారు. దీంతో చెర్రీ గ్లోబల్ స్టార్‌(Global Star Ram Charan)గా మారిపోయాడు. దీంతో ఆయన తదుపరి చిత్రాలపై భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ తరుణంలోనే ఆయన నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ క్రేజీ చిత్రానికి శంకర్ (Shankar) దర్శకత్వం చేస్తుండగా.. దిల్ రాజు (Dil Raju) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో చరణ్ డిఫరెంట్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. కాగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. అది కూడా టాలీవుడ్ టాప్ నిర్మాత అయిన దిల్ రాజు చెప్పడంతో ఫ్యాన్స్ ఈ మూవీ గురించి చర్చ మొదలైంది.

అసలు విషయం ఏంటంటే.. ‘గేమ్‌ ఛేంజర్’ని మొదట పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో తీయాలని శంకర్ భావించాడట. దీని గురించి దిల్ రాజు తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అందులో ఆయన మాట్లాడుతూ.. ‘శంకర్ మేనేజర్ ద్వారా ఆయన దగ్గర కథ ఉన్నట్లు నాకు తెలిసింది. దాదాపు 45 నిమిషాలు శంకర్ నాకు కథ చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. హీరో ఎవరని అనుకుంటున్నారు అని అడిగా. ఆయన వెంటనే పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)తో అయితే బావుంటుందని చెప్పారు. అది విని నేను వెంటనే ఈ కథ కల్యాణ్‌కి కాదు సర్.. చరణ్ అయితే బావుంటుందని చెప్పాను’ అని చెప్పారు.

Pawan-Kalyan.jpg

దిల్ రాజు ఇంకా మాట్లాడుతూ.. ‘వెంటనే రామ్‌చరణ్ దగ్గరకి వెళ్లి శంకర్ కథ గురించి మాట్లాడాను. ఆ సమయంలో చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఉన్నారు. అనంతరం ప్యాండమిక్ రావడంతో శంకర్ గారు ఫొన్‌లోనే చరణ్‌కి కథ చెప్పారు. తర్వాత నేను, చరణ్‌తో డిస్కస్ చేసి.. కథ నచ్చిందని శంకర్‌కి చెప్పాను. ప్రాజెక్ట్ లాక్ అయిపోయింది’ అని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవ్వడంతో.. ‘పవన్ నుంచి చరణ్ లాగేసుకున్నారా’ అంటూ మెగా ఫ్యాన్స్ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో జనవరి 2024న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

Adipurush: మరోసారి చిక్కుల్లో ప్రభాస్ మూవీ.. మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ..

Bholaa: సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టి.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న బాలీవుడ్ స్టార్!?

Shilpa Shetty: పబ్లిక్‌లో హాలీవుడ్ నటుడితో ముద్దు.. 15 ఏళ్ల క్రితం కేసులో నటికి రిలీఫ్

RRR in Japan: ‘ఆర్ఆర్ఆర్’పై రాజమౌళి పోస్ట్.. అందులోనూ జక్కన్న మార్క్ చూపించాడుగా..

Janhvi Kapoor: తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జూనియర్ శ్రీదేవి.. తర్వాత అడుగు అటువైపేనా?

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

Updated Date - 2023-04-06T12:10:14+05:30 IST