RRR in Japan: ‘ఆర్ఆర్ఆర్’పై రాజమౌళి పోస్ట్.. అందులోనూ జక్కన్న మార్క్ చూపించాడు..

ABN , First Publish Date - 2023-04-04T14:53:09+05:30 IST

ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

RRR in Japan: ‘ఆర్ఆర్ఆర్’పై రాజమౌళి పోస్ట్.. అందులోనూ జక్కన్న మార్క్ చూపించాడు..
RRR

ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ (NTR), రామ్‌చరణ్ (Ram Charan) హీరోలుగా నటించిన ఈ చిత్రం సృష్టించిన రికార్డులు అన్ని ఇన్నీ కావు. గతేడాది మార్చి 25న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.1200 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. అలాగే.. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. ‘నాటు నాటు’ పాటకి గాను ‘ఉత్తమ ఓరిజినల్ సాంగ్’ విభాంగంలో ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’‌తో పాటు సినీ ప్రపంచం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు (Oscars 95)ని సైతం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ విభాగంలో ఆస్కార్ అందుకున్న ఆసియాలోని మొదటి పాటగా నిలిచింది.

అయితే.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ విడుదలై ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. అయినా ప్రపంచంలోని ఏదో ఓ మూల ఈ చిత్రం ఇంకా థియేటర్స్‌లో విజయవంతంగా రన్ అవుతోంది. అయితే.. చాలా రోజుల క్రితమే ఈ చిత్రం జపాన్‌ (Japan)లో విడుదలైన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాజమౌళితో పాటు తారక్, చరణ్ అక్కడికి వెళ్లి మరి ప్రమోషన్స్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ థియేటర్స్‌లో ప్రదర్శితమవుతూనే ఉంది. 164 రోజుల్లో ఈ మూవీని జపాన్‌లో 1 మిలియన్ (అంటే పది లక్షల) సినీ ప్రేక్షకుల ఈ చిత్రాన్ని చూశారు. అంతేకాకుండా.. జపాన్‌లో అంతమంది చూసిన మొదటి భారతీయ చిత్రంగా ఈ మూవీ రికార్డు కూడా క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ రాజమౌళి ఓ ట్వీట్ చేశాడు. (#RRRinJapan)

Japan.jpg

ఆ ట్వీట్‌ని జపనీస్‌లో చేయడం విశేషం. అందులో.. ‘జపాన్‌లో ఓ మిలియన్ ప్రేక్షకుల సినిమా చూసి ప్రేమని కురిపించారు. అందరికీ ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు. అయితే.. ఈ ట్వీట్‌ జపనీస్‌లో కూడా రాయడం అందరినీ ఆకర్షిస్తోంది. అందులో ధన్యవాదాలు కూడా జపనీస్‌లోనే చెప్పడం నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీంతో పలువురు జపనీస్‌లోనే రాజమౌళికి కంగ్రాట్స్ చెబుతున్నారు.అలాగే.. థ్యాంక్స్ చెప్పడంలోనూ జక్కన్న తన మార్క్ చూపించాడంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరేమో ‘రాజమౌళి అనే బ్రాండ్‌తో తరువాతి సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది’ అని రాసుకొస్తున్నారు. అలాగే.. పలువురు మహేశ్ ఫ్యాన్స్ #SSMB29 గురించి అప్‌డేట్ ఇవ్వమని జక్కన్నని రిక్వెస్ట్ చేస్తున్నారు. (1 million footfalls for RRR in Japan)



ఇవి కూడా చదవండి:

Salman Khan: బాలీవుడ్ స్టార్ మూవీలో అతిథి పాత్రలో రామ్‌చరణ్!?.. ‘ఏంటమ్మా’ అంటూ..

Balagam: అసాంఘిక శక్తుల వల్ల మాకు నష్టం వస్తోంది.. దిల్‌రాజు కంప్లైంట్

Janhvi Kapoor: తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జూనియర్ శ్రీదేవి.. తర్వాత అడుగు అటువైపేనా?

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

Updated Date - 2023-04-04T15:04:54+05:30 IST