Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-04-02T12:55:18+05:30 IST

బాలీవుడ్‌లోని స్టార్‌ హీరోల జాబితా తీస్తే అందులో కచ్చితంగా సల్మాన్ ఖాన్ (Salman Khan) పేరు ఉంటుంది.

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..
Salman Khan Kissed Jacqueline Fernandez

బాలీవుడ్‌లోని స్టార్‌ హీరోల జాబితా తీస్తే అందులో కచ్చితంగా సల్మాన్ ఖాన్ (Salman Khan) పేరు ఉంటుంది. ఇక ఆయనకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నటుడి సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆయన అభిమానులు ఎదురు చూస్తుంటారు. అలాగే.. సల్మాన్ ఎంతోమంది హీరోయిన్లని సినీ పరిశ్రమకి తన సినిమాల ద్వారా పరిచయం చేశాడు. జరీన్ ఖాన్, స్నేహా ఉల్లాల్ వంటి పలువురు నటీమణులు ఉన్నారు.

వారిలో.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (jacqueline fernandez) కూడా ఒకరు. శ్రీలంకకి చెందిన ఈ బ్యూటీని 2014లో సల్మాన్ హీరోగా నటించిన ‘కిక్’ (Kick) సినిమాతో పరిచయం చేశాడు. రవితేజ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘కిక్’కి ఇది అధికారిక రిమేక్. తెలుగులోలాగానే ఈ మూవీ కూడా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ తర్వాత కూడా ఈ నటీనటులిద్దరూ కలిసి రేస్ 3, రాధే చిత్రాల్లో జంటగా నటించారు. అయితే.. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. (salman khan kissed heroine jacqueline fernandez)

Salman-khan-1.jpg

అందులో.. మూవీ సెట్‌లో ఉన్న సల్మాన్ సడెన్‌గా వెళ్లి జాక్వెలిన్‌కి రెండు సార్లు ముద్దులు పెట్టాడు. అది చూసి మొదట షాకైన జాక్వెలిన్ తర్వాత సరదాగా నవ్వేసింది. అయితే.. అక్కడి నుంచి పక్కకి వెళ్లి సల్మాన్ చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట చర్చకు దారి తీస్తోంది. జాక్వెలిన్‌ని ముద్దు పెట్టుకున్న తర్వాత పక్కకి వెళ్లిన సల్మాన్ తన టీ షర్టుతో పెదవులను తుడుచుకున్నాడు. కిస్ ఇచ్చిన సమయంలో పెదవులకి మేకప్ అంటుకోవడం వల్లే తుడుచుకున్నట్లు (Salman Khan Wiped his mouth) వీడియో చూస్తే అర్థం అవుతోంది. దీంతో.. పలువురు నెటిజన్లు కూడా అదే విషయం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరికొందరూ ఏమైంది భాయ్ అలా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చావు అంటూ రాసుకొస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోని ఒకరు.. ఇన్‌స్టాగ్రామ్‌ అప్‌లోడ్ చేయగా.. ఇప్పటికే 13 లక్షలకి పైగా వ్యూస్ రావడం విశేషం. కాగా.. సల్మాన్, జాక్వెలిన్ గతంలో డేటింగ్‌లో చేస్తున్నారని.. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇద్దరూ ఆయన ఫామ్‌హౌజ్‌లో కలిసే ఉన్నారని రూమర్లు వచ్చాయి. వీటికి సంబందించిన ఫోటోలు కూడా అప్పట్లో నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి:

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

IPS Sajjanar: దయచేసి అలా చేయకండి.. అమితాబ్‌కి టీఎస్‌ఆర్టీసీ ఎండీ రిక్వెస్ట్

Adipurush: మరోసారి ప్రభాస్ మూవీ పోస్టర్‌పై ట్రోలింగ్.. ఈసారి హనుమంతుడి గెటప్‌పై..

Dasara Twitter Review: నాని మొదటి పాన్ ఇండియా మూవీ ఎలా ఉందంటే..

Sridevi Shoban Babu OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బావామరదళ్లు.. ఎక్కడ చూడొచ్చంటే..

Taapsee Pannu: తాప్సీపై కేసు.. ఆ సమయంలో లక్ష్మీదేవి లాకెట్ ధరించడంతో..

Shah Rukh Khan Vs Virat Kohli: సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

Updated Date - 2023-04-02T13:23:04+05:30 IST