Shilpa Shetty: పబ్లిక్‌లో హాలీవుడ్ నటుడితో ముద్దు.. 15 ఏళ్ల క్రితం కేసులో నటికి రిలీఫ్

ABN , First Publish Date - 2023-04-04T18:23:38+05:30 IST

దాదాపు 15 ఏళ్ల క్రితం అంటే 2007లో రాజస్థాన్‌లో ఎయిడ్స్‌(AIDS)పై అవగాహన కార్య్రమాన్ని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Shilpa Shetty: పబ్లిక్‌లో హాలీవుడ్ నటుడితో ముద్దు.. 15 ఏళ్ల క్రితం కేసులో నటికి రిలీఫ్
Shilpa Shetty Richard Gere kissing case

దాదాపు 15 ఏళ్ల క్రితం అంటే 2007లో రాజస్థాన్‌లో ఎయిడ్స్‌(AIDS)పై అవగాహన కార్య్రమాన్ని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ఈవెంట్‌కి హాలీవుడ్ స్టార్ యాక్టర్ రిచర్డ్ గేర్ (Richard Gere), బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి (Shilpa Shetty) ముఖ్య అతిథులుగా హాజయ్యారు. అప్పుడే అనుకోని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఎయిడ్స్ గురించి మాట్లాడుతున్న రిచర్డ్ గేర్ సడెన్ శిల్పాని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. అది చూసి మొదట షాకైన శిల్ప తర్వాత నవ్వేసింది. అయితే.. పబ్లిక్‌లో అలా చేయడంతో ఈ బాలీవుడ్ నటిపై కొందరు వివిధ సెక్షన్ల కింద రాజస్థాన్‌లో కేసు నమోదు చేశారు. ఈ చర్యలు అసభ్యకరమైనవి, దేశ సంస్కృతికి అవమానకరమైని పేర్కొంటూ కేసు ఫైల్ చేశారు. చాలా ఏళ్ల పాటు విచారణ జరిగిన తర్వాత 2017లో సుప్రీంకోర్టు సూచన మేరకు ఆ కేసును ముంబైలోని మేజీస్ట్రేట్ కోర్టుకు బదిలీ చేశారు. (Shilpa Shetty Richard Gere kissing case)

Shilpa3.jpg

అయితే.. ఆ కోర్టులో విచారణ జరిగిన తర్వాత 2022లో శిల్పా శెట్టిపై కేసుని కొట్టేసింది. ఆమె రిచర్డ్ గేర్‌కి నటి బాధితురాలు మాత్రమేనని కోర్టు ఆ తీర్పులో తెలిపింది. అనంతరం మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా సెషన్స్‌ కోర్టులో రివిజన్ పిటిషన్ ఫైల్ చేశారు. అందులో.. ‘రిచర్డ్ గేర్‌ని అడ్డుకోకపోవడం నటి తప్పు’, ‘నిందితులను విడుదల చేయడంలో మేజిస్ట్రేట్ తప్పుచేశారు’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే తాజాగా ఆ పిటిషన్‌ని విచారించిన జడ్జి ఎస్.సి. జాదవ్ దాన్ని కొట్టేసింది. అయితే.. ఈ తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (Richard Gere and Shilpa Shetty controversy)

Shilpa-Shetty1.jpg

కాని.. విచారణ సమయంలో శిల్పా శెట్టి తరుఫున ఆమె లాయర్ ప్రశాంత్ పాటిల్ మాట్లాడారు. ‘సుప్రీం కోర్టు సూచన నిబంధానల మేరకు మెజిస్ట్రేట్ కోర్టు సరైన తీర్పునే వెలువరించింది. అందుకే భారీగా ఖర్చు అవతున్నందున ఈ కేసుని ఇప్పుడే కొట్టివేయాలి’ అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

Oscars95: ఏకంగా ఏనుగులని ఆస్కార్‌కి తీసుకుని వెళ్దామనుకున్నారంట.. కానీ..

RRR in Japan: ‘ఆర్ఆర్ఆర్’పై రాజమౌళి పోస్ట్.. అందులోనూ జక్కన్న మార్క్ చూపించాడుగా..

Salman Khan: బాలీవుడ్ స్టార్ మూవీలో అతిథి పాత్రలో రామ్‌చరణ్!?.. ‘ఏంటమ్మా’ అంటూ..

Balagam: అసాంఘిక శక్తుల వల్ల మాకు నష్టం వస్తోంది.. దిల్‌రాజు కంప్లైంట్

Janhvi Kapoor: తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జూనియర్ శ్రీదేవి.. తర్వాత అడుగు అటువైపేనా?

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

Updated Date - 2023-04-04T18:23:39+05:30 IST