Bholaa: సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టి.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న బాలీవుడ్ స్టార్!?

ABN , First Publish Date - 2023-04-04T16:13:11+05:30 IST

ఓ భాషలో హిట్‌ అయిన చిత్రాన్ని మరో భాషలో రిమేక్ చేయడం ఎప్పటి నుంచో వస్తున్నదే.

Bholaa: సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టి.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న బాలీవుడ్ స్టార్!?
Ajay Devgn Bholaa

ఓ భాషలో హిట్‌ అయిన చిత్రాన్ని మరో భాషలో రిమేక్ చేయడం ఎప్పటి నుంచో వస్తున్నదే. అయితే.. అలా రిమేక్ అయినా చిత్రాలు కొన్ని ఓరిజినల్‌లాగే ఆకట్టుకోగా.. కొన్నిమాత్రం డిజాస్టర్ అవుతుంటాయి. అయితే.. వరుసగా రిమేకులు చేసి స్టార్‌డమ్ సాధించిన హీరోలు కూడా కొందరు ఉన్నారు. అందులో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) కూడా ఒకరు. ఇటీవలికాలంలో వరుసగా సింగం సినిమా, దృశ్యం చిత్రాలను రిమేక్ చేసి హిట్లు కొట్టాడు. అదే ఫాలో అవుతూ ఆయన తాజాగా నటించిన మరో రిమేక్ చిత్రం ‘భోళా’ (Bholaa). తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో కార్తీ (Karthi) హీరోగా నటించిన ‘ఖైదీ’ (Kaithi) చిత్రానికి ఇది రిమేక్. టబు కీలక పాత్రలో నటించింది.

Ajay.jpg

గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌కి బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. విడుదలైన ప్రతి సినిమా దాదాపుగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ తరుణంలో వచ్చిన షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ‘పఠాన్’ (Pathaan) చిత్రంతో రాత మారిందని అందరూ అనుకున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో.. ‘భోళా’ మూవీపై అజయ్ దేవ్‌గణ్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. అయితే.. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చింది. అయితే.. వికేండ్ కావడంతో వసూళ్లు మాత్రం పర్వాలేదనిపించాయి. కాని.. సౌత్ సూపర్ హిటైన పలు చిత్రాలు ఇటీవలికాలంలో బాలీవుడ్ రిమేక్ చేయగా.. వరుసగా ఫెయిల్యూర్స్‌గా మిగులుతున్నాయి. అందులో.. కార్తీక్ ఆర్యన్ ‘షాహ్‌జాదా’, ‘సెల్ఫీ’ పలు చిత్రాలు ఉన్నాయి. ఆ జాబితాలోనే ‘భోళా’ కూడా చేరింది. (Ajay Devgn Switched Off His Phone)

KRK.jpg

దీంతో.. బాలీవుడ్‌కి ఎమోషన్ పండించడం చేత కావడం లేదంటూ పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో బాలీవుడ్‌లో సినీ విమర్శకుడినని చెప్పుకునే నటుడు కమాల్ ఆర్ ఖాన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆయన చేసిన ట్వీట్‌లో.. ‘నా విశ్వాసనీయ వర్గాల సమాచారం ప్రకారం, బోళా డిజాస్టర్ తర్వాత అజయ్ దేవ్‌గణ్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. అందుకే ఫోన్ స్విచ్చాఫ్ కూడా చేశాడు. నిజానికి ఈ చిత్రానికి వారాంతంలో రూ.100 కోట్ల వరకు వసూళ్లు వస్తాయని అజయ్ ఆశించాడు. కాని, అది జరగలేదు. అయితే.. వేరే నటుళ్ల విజయాలను చూసి అజయ్ అసూయపడతాడని బాలీవుడ్ జనాలకు బాగా తెలుసు’ అని రాసుకొచ్చాడు. అయితే.. ఇది దుబాయ్‌లో సెన్సార్ బోర్డు సభ్యుడినని చెప్పుకునే ఉమైర్ సంధు ట్వీట్‌లా ఉండడంతో కేఆర్‌కే విమర్శిస్తూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘నీ విశ్వాసనీయ వర్గం ఉమైర్ సంధునా’ అంటూ రాసుకొస్తున్నారు. (Ajay Devgn Expected 100 Crores)


ఇవి కూడా చదవండి:

Salman Khan: బాలీవుడ్ స్టార్ మూవీలో అతిథి పాత్రలో రామ్‌చరణ్!?.. ‘ఏంటమ్మా’ అంటూ..

Balagam: అసాంఘిక శక్తుల వల్ల మాకు నష్టం వస్తోంది.. దిల్‌రాజు కంప్లైంట్

Janhvi Kapoor: తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జూనియర్ శ్రీదేవి.. తర్వాత అడుగు అటువైపేనా?

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

Updated Date - 2023-04-04T16:24:35+05:30 IST