Nayakudu: ‘నాయకుడు’కి రాజమౌళి, మహేష్ బాబు సపోర్ట్

ABN , First Publish Date - 2023-07-07T22:07:59+05:30 IST

తమిళంలో తాజాగా విడుదలై సంచలనం సృష్టించిన ‘మామన్నన్’ తెలుగులో ‘నాయకుడు’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌కి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. శుక్రవారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Nayakudu: ‘నాయకుడు’కి రాజమౌళి, మహేష్ బాబు సపోర్ట్
SS Rajamouli and Mahesh Babu

తమిళంలో తాజాగా విడుదలై సంచలనం సృష్టించిన ‘మామన్నన్’ తెలుగులో ‘నాయకుడు’ (Nayakudu)గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌కి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. కోలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ‘మామన్నన్’ (Maamannan) చిత్ర తెలుగు వెర్షన్‌ని మేకర్స్ విడుదలకు సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ట్రైలర్ విషయానికి వస్తే.. ‘‘నేను పాడుతున్న పాట ఒకే పాట అయ్యిండాలి. ఆ పాట నేను జీవితాంతం పాడుతూ వుండాలి. నా పొట్ట నుంచి పేగులు తీసి దానితో వీణ చేసి దాన్ని వీధి వీధిన మీటుతున్నాను. నిజాన్ని వినే చెవుల్ని నేను వెదుకుతున్నాను’’ అనే ఇంటెన్స్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం హార్డ్ హిట్టింగ్‌గా సాగింది. వడివేలు, ఉదయనిధి స్టాలిన్ కొండపై నిలబడి నగరాన్ని చూస్తుండగా, తుపాకీ పేల్చి ఫహద్ ఫాసిల్ పాత్ర పరిచయం అవుతుంది. వడివేలు, ఉదయనిధి ఒకవైపు.. ఫహద్‌ మరోవైపు.. వీరి మధ్య పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండబోతుందని ట్రైలర్ ఎస్టాబ్లిష్ చేసింది. వడివేలు, ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాసిల్‌ల ఫెర్ ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలెట్ అనేలా ఉంది. ‘దసరా’ తర్వాత కీర్తి సురేష్ మరోసారి అలాంటి తరహా పాత్రలో కనిపిస్తున్నట్లుగా ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. (Nayakudu Movie Trailer Out)

Nayakudu.jpg

ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ అందించిన నేపధ్య సంగీతం ఇంటెన్సిటీ మరింత ఎలివేట్ చేసింది. కెమెరా పనితనం, నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. మారి సెల్వరాజ్ ‘నాయకుడు’తో మరో టెర్రిఫిక్ సినిమా అందించారనేలా ట్రైలర్ భరోసా ఇస్తోంది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం జూలై 14న తెలుగు రాష్ట్రాల థియేటర్లలో విడుదల కానుంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Ticket Prices Hike: సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై రచ్చ రచ్చ

**************************************

*Bedurulanka 2012: ఆగస్ట్ రిలీజ్ లిస్ట్‌లోకి మరో సినిమా..

**************************************

*Aadikeshava: ఆగస్ట్ ‌లిస్ట్‌లోకి మరో మెగా హీరో మూవీ.. చిరు, వరుణ్‌ల మధ్యలో స్లాట్ దొరికేసింది

**************************************

*Tamannaah: బాబోయ్.. ఆ వెబ్ సిరీస్‌లలో ఏముంది.. ఈ పాటలో తమన్నాని చూస్తే అస్సలు తట్టుకోలేరు

**************************************

*Vijayashanthi: నా దూకుడు, పోరాటం వెనుక ఉండేది ఎప్పుడూ వారే..

**************************************

Updated Date - 2023-07-07T22:07:59+05:30 IST