Bedurulanka 2012: ఆగస్ట్ రిలీజ్ లిస్ట్‌లోకి మరో సినిమా..

ABN , First Publish Date - 2023-07-07T20:34:19+05:30 IST

హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్న చిత్ర ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకుడు. కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాని ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లగా చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది.

Bedurulanka 2012: ఆగస్ట్ రిలీజ్ లిస్ట్‌లోకి మరో సినిమా..
Bedurulanka 2012 Movie Still

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘భోళాశంకర్’ (Bholaa Shankar) సినిమా ఆగస్ట్ 11న విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే. చిరంజీవి సినిమా కంటే ఒక రోజు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ (Jailer) రూపంలో ప్రేక్షకులని పలకరించనున్నారు. ఇంకా వరుణ్ తేజ్ ‘గాంఢీవధారి అర్జున’ (Gandheevadhari Arjuna) ఆగస్ట్ 28న, వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ (Aadikeshava) ఆగస్ట్ 18న విడుదలకు సిద్ధమైనట్లుగా ఇప్పటికే విడుదల తేదీలతో సహా అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఆగస్ట్‌లోకి మరో సినిమా వచ్చి చేరింది. ‘ఆర్ఎక్స్ 100’ (RX100) హీరో కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) హీరోగా లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్న చిత్ర ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకుడు. ఇందులో కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి (Neha Sshetty) హీరోయిన్‌గా నటించింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాని ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లగా చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది.

ఇప్పటికే ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012)కు సంబంధించి విడుదలైన ‘ద వరల్డ్ ఆఫ్ బెదురులంక’ గ్లింప్స్, ‘వెన్నెల్లో ఆడపిల్ల’ సాంగ్, పోస్టర్స్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. గోదావరి ఒడ్డున ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా దర్శకుడు క్లాక్స్ (Director Clax) తెలుపుతున్నారు. దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ.. ‘‘సామాజిక మాధ్యమాల్లో మా చిత్రానికి సంబంధించిన కంటెంట్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. కార్తికేయ, నేహా శెట్టి జోడీ మధ్య కెమిస్ట్రీ, ‘ద వరల్డ్ ఆఫ్ బెదురులంక’, మిగతా క్యారెక్టర్లు, పాటలు మరియు గోదావరి ఒడ్డున లొకేషన్లు అన్నీ ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతాయి. ఒక కొత్త తరహా చిత్రాన్ని చూసిన అనుభూతి‌తో పాటు సినిమా అంతటా నవ్వుతూనే ఉంటారు’’ అని తెలిపారు. (Bedurulanka 2012 Release Date)

Neha-Shetty.jpg

చిత్ర విడుదల గురించి చిత్రనిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని ( Ravindra Benerjee Muppaneni) మాట్లాడుతూ.. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ఫుల్ స్వింగులో అన్ని వర్క్స్ జరుగుతున్నాయి. ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించే కొత్త తరహా డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Aadikeshava: ఆగస్ట్ ‌లిస్ట్‌లోకి మరో మెగా హీరో మూవీ.. చిరు, వరుణ్‌ల మధ్యలో స్లాట్ దొరికేసింది

**************************************

*Tamannaah: బాబోయ్.. ఆ వెబ్ సిరీస్‌లలో ఏముంది.. ఈ పాటలో తమన్నాని చూస్తే అస్సలు తట్టుకోలేరు

**************************************

*Vijayashanthi: నా దూకుడు, పోరాటం వెనుక ఉండేది ఎప్పుడూ వారే..

**************************************

*Jagapathi Babu: అప్పుడు ‘లెజెండ్’.. ఇప్పుడు ‘రుద్రంగి’.. వైల్డ్ క్యారెక్టర్‌తో వస్తున్నా..

**************************************

*Mrunal Thakur: ఫస్ట్ క్రష్, డిప్రెషన్.. మృణాల్‌ ఠాకూర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

**************************************

Updated Date - 2023-07-07T20:34:19+05:30 IST