Aadikeshava: ఆగస్ట్ ‌లిస్ట్‌లోకి మరో మెగా హీరో మూవీ.. చిరు, వరుణ్‌ల మధ్యలో స్లాట్ దొరికేసింది

ABN , First Publish Date - 2023-07-07T16:42:48+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ ఆగస్ట్ 11న, వరుణ్ తేజ్ ‘గాంఢీవధారి అర్జున’ ఆగస్ట్ 28న వస్తుండగా.. ఈ రెండు సినిమాల మధ్యలో ఆగస్ట్ 18న పంజా వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే కూడా ఆగస్ట్‌లోనే ఉండటంతో.. ఆగస్ట్ మంత్‌ని మెగా మంత్ అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు.

Aadikeshava: ఆగస్ట్ ‌లిస్ట్‌లోకి మరో మెగా హీరో మూవీ.. చిరు, వరుణ్‌ల మధ్యలో స్లాట్ దొరికేసింది
Bholaa Shankar and Gandheevadhari Arjuna Movies Stills

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు ఆగస్ట్ 22. మెగాస్టార్ పుట్టినరోజంటే మెగాభిమానులకు (Mega Fans) పండగరోజే. ఆగస్ట్‌లో మెగాభిమానులకు ఇంతకంటే పెద్ద పండుగ ఉండదు. అయితే ఈసారి ఆగస్ట్‌కి ఒకటి కాదు, రెండు కాదు.. మొత్తంగా మూడు మెగా హీరోల సినిమాలో సందడి చేయబోతున్నాయి. చిరంజీవి, మెహర్ రమేష్ (Meher Ramesh) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘భోళాశంకర్’ (Bholaa Shankar) సినిమా ఆగస్ట్ 11న విడుదల కాబోతుండగా.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ప్ర‌వీణ్ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘గాంఢీవధారి అర్జున’ (Gandheevadhari Arjuna) ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల విడుదలకు సంబంధించి ఇప్పటికే మేకర్స్ అధికారికంగా విడుదల తేదీలను ప్రకటించారు. అందుకు అనుగుణంగా సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు మరో మెగా హీరో ఈ మధ్యలో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ హీరో మరెవరో కాదు పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej).

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఆదికేశవ’ (Aadikeshava). యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన టాలీవుడ్ క్రష్ శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యాక్షన్ సినిమా ప్రేమికులను అలరించేలా ఆయన చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆదికేశవ యాక్షన్ టీజర్‌ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన కూల్ టీజర్ కూడా యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమాకు కూడా ఆగస్ట్‌లోనే స్లాట్ దొరికేసింది.

Aadikeshava.jpg

మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ ఆగస్ట్ 11న, వరుణ్ తేజ్ ‘గాంఢీవధారి అర్జున’ ఆగస్ట్ 28న వస్తుండగా.. ఈ రెండు సినిమాల మధ్యలో ఆగస్ట్ 18న (Aadikeshava to release on 18th August) వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత మలయాళ స్టార్ యాక్టర్ జోజు జార్జ్ ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. అలనాటి తార రాధిక, అపర్ణా దాస్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, ‘సార్’ ఫేమ్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ మూడు సినిమాల విడుదల తేదీల ప్రకటనతో.. ఆగస్ట్ మొత్తం మెగా ఫ్యాన్స్‌దే (Mega Month) అన్నట్లుగా సోషల్ మీడియాలో వాతావరణం మారిపోయింది.

ఇవి కూడా చదవండి:

**************************************

*Tamannaah: బాబోయ్.. ఆ వెబ్ సిరీస్‌లలో ఏముంది.. ఈ పాటలో తమన్నాని చూస్తే అస్సలు తట్టుకోలేరు

**************************************

*Vijayashanthi: నా దూకుడు, పోరాటం వెనుక ఉండేది ఎప్పుడూ వారే..

**************************************

*Jagapathi Babu: అప్పుడు ‘లెజెండ్’.. ఇప్పుడు ‘రుద్రంగి’.. వైల్డ్ క్యారెక్టర్‌తో వస్తున్నా..

**************************************

*Mrunal Thakur: ఫస్ట్ క్రష్, డిప్రెషన్.. మృణాల్‌ ఠాకూర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

**************************************

Updated Date - 2023-07-07T16:42:48+05:30 IST