Mani Sai Teja: ‘మెకానిక్’తో మరో మెట్టు పక్కా.. అదే నా ముందున్న లక్ష్యం

ABN , Publish Date - Dec 30 , 2023 | 04:10 PM

‘‘ఒక్కసారి హీరో ఛాన్స్ వస్తే.. లైఫ్ లాంగ్ కాలు మీద కాలు వేసుకుని కాల్షీట్స్ ఇస్తూ పోవచ్చనుకున్నాను. కానీ హీరోలు పడే కష్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రాక్టికల్‌గా తెలుసుకుంటున్నాను’’ అని అంటున్నాడు యువ హీరో మణి సాయి తేజ. ఆయన హీరోగా రూపొందిన ‘మెకానిక్’ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.

Mani Sai Teja: ‘మెకానిక్’తో మరో మెట్టు పక్కా.. అదే నా ముందున్న లక్ష్యం
Hero Mani Sai Teja

‘‘ఒక్కసారి హీరో ఛాన్స్ వస్తే.. లైఫ్ లాంగ్ కాలు మీద కాలు వేసుకుని కాల్షీట్స్ ఇస్తూ పోవచ్చనుకున్నాను. కానీ హీరోలు పడే కష్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రాక్టికల్‌గా తెలుసుకుంటున్నాను’’ అని అంటున్నాడు యువ హీరో మణి సాయి తేజ (Mani Sai Teja). ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Icon Star Allu Arjun)కు వీరాభిమానిని అని చెప్పే మణి సాయి తేజ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) బాటలో రెండు పదుల వయసు నిండకుండానే.. నూనుగు మీసాల వయసులో ‘బ్యాట్ లవర్స్’ (Bat Lovers) చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశారు. తొలి చిత్రంతోనే ‘ఎవడీ బుడ్డోడు?’ అనిపించుకుని.. వెంటనే ‘రుద్రాక్షాపురం’ (Rudhrakshapuram) చిత్రంలో హీరోగా నటించే అవకాశం సొంతం చేసుకుని మరింతగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చిత్రం ఇంకా విడుదల కాకుండానే ముచ్చటగా మూడో చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేసే గోల్డెన్ ఛాన్స్ మణి సాయి తేజని వరించింది.

కృష్ణవంశీ శిష్యుడు ముని సహేకర్ దర్శకత్వంలో మణి సాయి తేజ టైటిల్ పాత్ర పోషించిన ‘మెకానిక్’ (Mechanic) త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం కోసం వినోద్ యాజమాన్య సంగీత సారధ్యంలో సిద్ శ్రీరామ్ పాడిన ‘నచ్చేశావే పిల్ల నచ్చేశావే’ పాట మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి మణి సాయి తేజను లక్షలాది మందికి సుపరిచితం చేసింది. క్రేజీ కుర్ర హీరోల జాబితాలో తన పేరు కూడా చేరేందుకు అవసరమైన లుక్స్, హార్డ్ వర్కింగ్ నేచర్ పుష్కలంగా కలిగిన మణి... పోరాటాలు, నృత్యాలు వంటి విభాగాల్లో తనను తాను మరింతగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు.


Mechanic.jpg

తను నటించే ప్రతి సినిమా.. తనకొక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ అని... అందులో నటించే సీనియర్స్ అందరూ తనకు ప్రొఫెసర్లు అని అంటున్నారు సాయితేజ. తన మూడవ చిత్రం ‘మెకానిక్’ తనను నటుడిగా మరో మెట్టు ఎక్కిస్తుందనే కాన్ఫిడెన్స్‌ను వ్యక్తం చేస్తున్నారు. హీరో కావడం కోసం.. తనను ఎంతగానో ప్రోత్సహిస్తూ, ఎన్నో త్యాగాలు చేస్తున్న తన తల్లిదండ్రులు తనను చూసి గర్వపడేలా చేయడమే తన ముందున్న లక్ష్యమని భావోద్వేగానికి లోనవుతున్నాడీ కుర్ర హీరో. (Young Hero Mani Sai Teja)


ఇవి కూడా చదవండి:

====================

*Hi Nanna in OTT: ‘హాయ్ నాన్న’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

**************************

*Nagababu: కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి

**************************

*Rashmika Mandanna: ఎలా, ఎప్పుడు, ఎందుకు.. ఇదంతా జరిగింది? రష్మిక పోస్ట్ వైరల్

****************************

*King Nagarjuna: సతీసమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కింగ్ నాగ్

****************************

*Aamir Khan: ఆమిర్‌ఖాన్‌ కుమార్తె పెళ్లికి అంతా సిద్ధం.. గ్రాండ్ రిసెప్షన్ ఎక్కడంటే?

***************************

Updated Date - Dec 30 , 2023 | 04:38 PM