Malvika Nair: ‘స్కూల్ రోజుల్లోనే ఓ అబ్బాయిని ఇష్టపడ్డాను.. అందరూ విజయ్ దేవరకొండ గురించే అడిగేవారు’

ABN , First Publish Date - 2023-03-12T09:08:25+05:30 IST

‘ఎవడే సుబ్రమణ్యం’తో పరిచయమై... ‘కళ్యాణ వైభోగమే’, ‘టాక్సీవాలా’తో యువతరాన్ని కట్టిపడేసిన మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా నాయర్‌..

Malvika Nair: ‘స్కూల్ రోజుల్లోనే ఓ అబ్బాయిని ఇష్టపడ్డాను.. అందరూ విజయ్ దేవరకొండ గురించే అడిగేవారు’
Malvika Nair

‘ఎవడే సుబ్రమణ్యం’తో పరిచయమై... ‘కళ్యాణ వైభోగమే’, ‘టాక్సీవాలా’తో యువతరాన్ని కట్టిపడేసిన మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా నాయర్‌ (Malvika Nair). తాజాగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ (Palana Abbayi Palana Ammayi)తో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సందర్భంగా ఆమె చెబుతున్న విశేషాలివి..

విజయ్‌ గురించే అడిగేవారు..

ఇంటర్‌ వరకు ఢిల్లీలోనే చదువుకున్నా. మొదటి ఏడాది వేసవి సెలవుల్లో ‘ఎవడే సుబ్రమణ్యం’ (Yevade Subramanyam) షూటింగ్‌లో పాల్గొన్నా. పైలెట్‌ కావాలని కలలు కనేదాన్ని. కానీ తరువాత వరుస సినిమాల వల్ల నా కలను పక్కన పెట్టేయాల్సి వచ్చింది. ఆ తరువాత హైదరాబాద్‌లోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజీలో డిగ్రీ చదివా. ఆ సమయంలో నా స్నేహితులంతా విజయ్‌ దేవరకొండ గురించే అడిగేవారు. వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చచ్చిపోయేదాన్ని. అలా ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే డిగ్రీ పూర్తి చేశాను.’’

malavika3.jpg

ఫస్ట్‌ క్రష్‌ (First Crush)..

‘‘నాకు ఊహ తెలియనప్పుడే... అంటే ఎల్‌కేజీలోనే ఒకబ్బాయిని ఇష్టపడ్డాను. అదే నా ఫస్ట్‌ క్రష్‌ అని చెప్పొచ్చు. రోజూ తనని చూస్తూ ఉండేదాన్ని. క్లాస్‌మేట్స్‌ అందరం కలిసి తీసుకున్న గ్రూప్‌ ఫొటోని దాచుకుని, ఆ అబ్బాయి ఫొటో ఉన్న చోట స్కెచ్‌తో రౌండప్‌ చేసి, అప్పుడప్పుడు చూస్తూ మురిసిపోయేదాన్ని. ఆరో తరగతి తర్వాత నేను వేరే స్కూల్‌కు మారిపోవడంతో ఆ కథ అంతటితో ముగిసిపోయింది. ఇప్పుడు ఆ విషయం గుర్తుకొస్తే నవ్వొస్తుంది.’’

పాత్ర నచ్చితే ఓకే..

‘మహానటి’లో నేను పోషించిన అలిమేలు పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అందులో నేను జెమిని గణేశన్‌కు మొదటి భార్యగా, సావిత్రికి సవతిగా, నలుగురు పిల్లల తల్లిగా నటించాను. ఆ సినిమా విడుదలయ్యాక చాలామంది తల్లి పాత్రల్ని ఆఫర్‌ చేశారు. అప్పటికి నాకు కేవలం ఇరవై ఏళ్లే కాబట్టి వాటిని సున్నితంగా తిరస్కరించాను. అలాంటి పాత్రలు నా కెరీర్‌కు రిస్కే కానీ.. చిన్న పాత్ర అయినా ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోయేలా ఉండాలనుకుంటాను. అలా చేసినవే... ‘టాక్సీవాలా’లో శిశిర, ‘మహానటి’లో అలిమేలు పాత్రలు. నటనకు ఆస్కారం ఉన్న ఏ పాత్ర చేయడానికైనా నేను సిద్ధమే.

పాటలు చూసి అవకాశం..

‘‘పదమూడేళ్లకే సినిమాల్లోకి అడుగుపెట్టాను. మొదట్లో మలయాళంలో చిన్న చిన్న పాత్రలు చేసేదాన్ని. హీరోయిన్‌గా నా మొదటి సినిమా ‘బ్లాక్‌ బటర్‌ ఫ్లై’. తమిళ్‌లో నా మొదటి సినిమా ‘కుకూ’. అది బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఆ సినిమాలోని పాటలు చూసి డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ ‘ఎవడే సుబ్రమణ్యం’ కోసం మా నాన్నగారిని అడిగారు. నేనప్పుడు ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో ఉన్నా. నాకు చదువుకోవాలని ఉండేది. అందుకే చేయనని చెప్పా. కొన్నిరోజుల తర్వాత నాన్నను బాధపెట్టడం ఎందుకని... ‘సరే ఈ ఒక్క సినిమా మాత్రమే చేస్తాను. తరువాత చేయమన్నా చేయన’ని అనేక షరతులు పెట్టి ఒప్పుకున్నా. అలా భాష తెలియకపోయినా తెలుగు ఇండస్ట్రీలోకి నా తొలి అడుగులు పడ్డాయి.’’

నాన్న ఏడుస్తూనే ఉన్నారు..

‘కుకూ’ సినిమాలో నేను అంధురాలిగా కనిపించా. ఆ క్యారెక్టర్‌ నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఆ పాత్రకు న్యాయం చేయగలనో, లేదో అని మొదట్లో చాలా భయపడ్డాను. సినిమా షూటింగ్‌కు ముందు అంధులతో ఇంటరాక్ట్‌ అయ్యాను. సినిమా విడుదలైన తర్వాత నాన్నతో కలసి థియేటర్‌లో సినిమా చూశా. సినిమా చూస్తున్నంతసేపూ నాన్న ఏడుస్తూనే ఉన్నారు. సినిమా పూర్తయ్యాక ఆనందంతో నన్ను కౌగిలించుకున్నారు. నా గురించి న్యూస్‌ పేపర్‌లో వచ్చిన ప్రతీ క్లిప్పింగ్‌ను నాన్న కత్తిరించి జాగ్రత్త చేసి, ఇంటికి వచ్చిన వారికి చూపించి మురిసిపోతుంటారు.

ఇవి కూడా చదవండి:

Writer Padmabhushan OTT Streaming: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Updated Date - 2023-03-12T09:29:26+05:30 IST