War 2: బాలీవుడ్ మూవీలో విలన్‌గా ఎన్టీఆర్!?

ABN , First Publish Date - 2023-04-05T16:23:12+05:30 IST

కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్‌కే) అంటే టాలీవుడ్ ప్రేక్షకులకి అంతగా తెలియకపోవచ్చు. కానీ, బాలీవుడ్ ప్రేక్షకులకి బాలీవుడ్ సినిమాలను ఫాలో అయ్యేవారికి అతనేవరో కచ్చితంగా తెలిసే ఉంటుంది.

War 2: బాలీవుడ్ మూవీలో విలన్‌గా ఎన్టీఆర్!?
NTR In War 2

కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్‌కే) అంటే టాలీవుడ్ ప్రేక్షకులకి అంతగా తెలియకపోవచ్చు. కానీ, బాలీవుడ్ ప్రేక్షకులకి బాలీవుడ్ సినిమాలను ఫాలో అయ్యేవారికి అతనేవరో కచ్చితంగా తెలిసే ఉంటుంది. తనని తానే సినీ విమర్శకుడినని చెప్పుకుంటూ బాలీవుడ్ సినిమాలకి రివ్యూలు చెబుతుంటాడు. అయితే.. ఆ సినిమా రివ్యూల కంటే బీ టౌన్ స్టార్లపై చేసే ట్విట్ల ద్వారానే కేఆర్‌కే (KRK)ఎక్కువ గుర్తింపు సాధించుకున్నాడు. అలాగే ఆ ట్విట్ల వల్ల పలుమార్లు వివాదాల్లో ఇరుక్కుని, జైలుకి కూడా వెళ్లొచ్చాడు. అయినా అతని ధోరణిలో ఎటువంటి మార్పు రాలేదు. తాజాగా పాన్ ఇండియా స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌‌పై చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films) వరుసగా స్పై కథలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాని కోసం వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ (YRF Spy Universe) అనే ఓ యూనివర్స్‌ని క్రియేట్ చేసింది. అందులో.. ‘టైగర్’ సినిమాలతో సల్మాన్ ఖాన్, ‘వార్’ సినిమాతో హృతిక్ రోషన్, ‘పఠాన్’ మూవీతో షారుఖ్ ఖాన్ ఇప్పటికే ఆ యూనివర్స్‌లో భాగమై పోయారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR)తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ఎన్టీఆర్ (NTR) కూడా భాగమైపోయాడు. హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటించిన ‘వార్’ సీక్వెల్ అయినా ‘వార్ 2’ (War2) లో ఎన్టీఆర్ నటిస్తున్నట్లు వైఆర్‌ఎఫ్ తాజాగా ప్రకటించింది. దీంతో ఆ యూనివర్స్‌కి మరింత క్రేజ్ వచ్చినట్లైంది. (KRK Tweet on War 2 Casting)

krk.jpg

కాగా.. ‘వార్ 2’ లో ఎన్టీఆర్ నటించడంపై కేఆర్‌కే తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. అతను ట్విట్టర్‌లో షేర్ చేసిన పోస్టులో.. ‘‘వార్ 2’ తారగణం ఎంపిక సరిగ్గా సరిపోయింది. హీరోగా హృతిక్ రోషన్, విలన్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా.. కొంచెం పర్సనల్‌గా కూడా వెళ్లి ఎన్టీఆర్ నిజ జీవితంలో కూడా విలన్‌గా ఉంటాడనే పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే.. ఎన్టీఆర్‌ని విలన్ అనడం చాలామందికి నచ్చలేదు. దాంతో కేఆర్‌కే తిడుతూ కామెంట్లు చేస్తున్నారు. (KRK Tweet on War 2 about NTR)

NTR.jpg

‘ఎన్టీఆర్ గురించి అలా మాట్లాడతావా. ఇంకోసారి ఆయన గురించి తప్పుగా ట్వీట్ చేస్తే బావుండదు’.. ‘ఎన్టీఆర్ ఉత్తమ హీరో… ‘ఎన్టీఆర్ కాదు.. నువ్వు విలన్‌లా ఉన్నావు’.. ‘కేఆర్‌కే ఎప్పుడైనా నీ ముఖం చూసుకున్నావా’.. ‘ఆర్ఆర్ఆర్‌తో ఆస్కార్ కొట్టిన తారక్ విలన్‌గా చేయడు’ అని వరుసగా కేఆర్‌కేపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అందులో తెలుగుతో పాటు బాలీవుడ్ అభిమానులు కూడా కేఆర్‌కే‌పై విమర్శలు చేయడం విశేషం.


ఇవి కూడా చదవండి:

Adipurush: మరోసారి చిక్కుల్లో ప్రభాస్ మూవీ.. మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ..

Bholaa: సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టి.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న బాలీవుడ్ స్టార్!?

Shilpa Shetty: పబ్లిక్‌లో హాలీవుడ్ నటుడితో ముద్దు.. 15 ఏళ్ల క్రితం కేసులో నటికి రిలీఫ్

RRR in Japan: ‘ఆర్ఆర్ఆర్’పై రాజమౌళి పోస్ట్.. అందులోనూ జక్కన్న మార్క్ చూపించాడుగా..

Janhvi Kapoor: తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జూనియర్ శ్రీదేవి.. తర్వాత అడుగు అటువైపేనా?

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

Updated Date - 2023-04-05T16:34:07+05:30 IST