NTR 30: యాక్షన్ సీన్‌తో షూటింగ్ మొదలుపెట్టిన తారక్

ABN , First Publish Date - 2023-04-01T20:27:26+05:30 IST

‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చాలా సమయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో నటిస్తున్నారు.

NTR 30: యాక్షన్ సీన్‌తో షూటింగ్ మొదలుపెట్టిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చాలా సమయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఎన్‌టీఆర్ 30’ (NTR 30) అని వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మార్చి 31న ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఓ ప్యాలెస్‌లో నైట్ ఎఫెక్ట్‌లో యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ మొదలుపెట్టిన విషయాన్ని తారక్ చెప్పారు. సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నారు. ‘‘కొరటాల శివతో మరోసారి సినిమా సెట్స్‌లో ఉండటం అద్భుతంగా ఉంది’’ అని ఎన్టీఆర్ తెలిపారు. వస్తున్నా, షూట్ బిగిన్స్ అని వీడియో చివరన కూడా రాశారు.

‘ఎన్‌టీఆర్ 30’ ని యువ సుధా ఆర్ట్స్, నందమూరి తారక రామరావు ఆర్ట్స్ కలసి నిర్మిస్తున్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సముద్ర తీర ప్రాంతాల నేపథ్యంలో రూపొందిస్తున్నాయి. ఈ మూవీ కోసం మేకర్స్ భారీస్థాయిలో సెట్స్ వేస్తున్నారు. సెట్స్‌లో గ్రీన్ మ్యాట్‌లో యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాలను హాలీవుడ్ నిపుణుల ఆధ్వర్యంలో షూట్ చేయనున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ (Kenny Bates) ఈ ఫైట్స్‌ను కంపోజ్ చేయనున్నారు. షూట్ చేసిన సన్నివేశాలకు విజువల్ ఎఫెక్ట్స్‌తో మరింత మెరుగులు దిద్దనున్నారు.

Koratala-Siva.jpg

‘ఎన్‌టీఆర్ 30’ పాన్ ఇండియాగా రూపొందుతుంది. పలు భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ పాత్రను చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) విలన్ పాత్రను పోషిస్తున్నారు. ‘ఎన్‌టీఆర్ 30’ కి ప్రొడక్షన్ డిజైనర్‌గా సాబు సిరిల్ వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌గా యుగంధర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Pushpa: The Rule: డిజిటల్ రైట్స్ కోసం పోటీపడుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్!

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Updated Date - 2023-04-01T20:30:03+05:30 IST