Vishwak Sen: అర్జున్‌తో వివాదంలో ఆయనకు డబ్బులు చెల్లించారా.. రిప్లై ఇచ్చిన హీరో..

ABN , First Publish Date - 2023-03-18T20:14:10+05:30 IST

టాలీవుడ్ స్టార్ విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki). ఈ చిత్రం పాన్ ఇండియాగా తెరకెక్కింది. మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడటంతో విష్వక్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.

Vishwak Sen: అర్జున్‌తో వివాదంలో ఆయనకు డబ్బులు చెల్లించారా.. రిప్లై ఇచ్చిన హీరో..

టాలీవుడ్ స్టార్ విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki). ఈ చిత్రం పాన్ ఇండియాగా తెరకెక్కింది. మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడటంతో విష్వక్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ‌లు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో హీరో అర్జున్ (Arjun) తో వివాదంపై ఆయన స్పందించారు. ‘‘అర్జున్‌తో వివాదం తర్వాత మీరు పెద్ద మొత్తంలో ఆయనకు డబ్బులు చెల్లించారని విన్నాను. ఈ విషయంలో మీరెంతో బాధపడ్డారని వార్తలు వచ్చాయి. అది ఎంతవరకూ నిజం?’’ అని విలేకరి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బదులిచ్చేందుకు విష్వక్ ఆసక్తి చూపించలేదు. ‘‘ఆ వివాదం గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. ఆ వ్యవహారానికి ‘దాస్ కా ధమ్కీ’ సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఎంతోమందిపై ఉన్న గౌరవంతో దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు’’ అని విష్వక్ తెలిపారు.

విష్వక్ సేన్ నటించిన ‘పాగల్’ సినిమాకు నరేశ్ కొప్పిలి దర్శకత్వం వహించారు. ఆయనే ‘దాస్‌ కా ధమ్కీ’ కి దర్శకత్వం వహించాలి. అయితే, ఏమైందో తెలియదు కానీ అనంతరం హీరోనే మెగా ఫోన్‌ పట్టుకున్నారు. దర్శకుడి మార్పుపై కూడా విష్వక్ సమాధానమిచ్చారు. ‘‘నేను, నరేశ్‌ కొప్పిలి కలసి ‘పాగల్‌’ సినిమా చేశాం. ‘దాస్‌ కా ధమ్కీ’ అనుకున్నప్పుడు.. ఈ సినిమాకు అతడైతే న్యాయం చేస్తాడనుకున్నా. అందుకే ఈ చిత్రానికి డైరెక్టర్‌గా మొదట ఆయననే తీసుకున్నాం. కథ గురించి చర్చలు జరిగినప్పుడు అతడి ఆలోచనా విధానానికి, స్టోరీకి పొంతన కుదరలేదు. అందుకే నేనే మెగా ఫోన్‌ పట్టాను. అతడితో మరో సినిమా చేస్తానని చెప్పాను. గొడవపడటం లేదా వాదనలు జరగడం లాంటివి ఏమీ జరగలేదు’’ అని విష్వక్ సేన్ తెలిపారు.

అర్జున్‌, విష్వక్ సేన్ వివాదం అప్పట్లో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. యాక్షన్ కింగ్ ఓ ప్రెస్ మీట్ పెట్టి మరి విష్వక్‌పై విరుచుకుపడ్డారు. అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య‌ను టాలీవుడ్‌లో లాంచ్ చేయాలనుకున్నారు. విష్వక్ సేన్‌ని హీరోగా అనుకున్నారు. పూజా కార్యక్రమాలు కూడా జరిగ్గాయి. అయితే, విష్వక్‌ ఏదో ఒక కారణం చెప్పి షూటింగ్‌ రద్దు చేస్తున్నాడని.. వర్క్‌ పట్ల అతడికి కమిట్‌మెంట్ లేదని అర్జున్‌ ఆరోపించారు. కథ విషయంలో తనకి కాస్త ఇబ్బంది ఉందని, అది చెప్పినా అర్జున్‌ వినడం లేదని అప్పట్లో విష్వక్ కూడా వివరణ ఇచ్చారు.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Oscars 2023: షాక్.. ఆస్కార్ వేడుకకు ఫ్రీ పాస్‌లు లేకపోవడంతో.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ భారీ ఖర్చు..

NTR 30: తుఫాను హెచ్చరిక.. పండగ లాంటి వార్త వచ్చేసింది..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!

Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Updated Date - 2023-10-27T14:51:19+05:30 IST