Bholaa Shankar: భారీ కటౌట్, ర్యాలీ.. సినిమా ప్రచారానికి కాదు బాబాయ్..!

ABN , First Publish Date - 2023-08-10T11:48:44+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల కాబోతోన్న సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌ను వినూత్న రీతిలో నిర్వహిస్తున్నారు. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి.. సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేసిన మేకర్స్.. ఇప్పుడు ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో జీపీఎస్‌తో ర్యాలీ చేపట్టారు.

Bholaa Shankar: భారీ కటౌట్, ర్యాలీ.. సినిమా ప్రచారానికి కాదు బాబాయ్..!
GPS tho Bholaa Shankar Event Photo

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) హీరోగా మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భోళా శంకర్’ (Bholaa Shankar). ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల కాబోతోన్న సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌ను వినూత్న రీతిలో నిర్వహిస్తున్నారు. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి భారీ కటౌట్‌ (Cut-Out)ను ఏర్పాటు చేసి.. సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేసిన మేకర్స్.. ఇప్పుడు ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో, ప్రపంచ సినిమాలో ఏ కథానాయకుడికి జరిగిన దాఖలాలు లేని విధంగా, మెగాస్టార్‌ చిరంజీవి అసంఖ్యాక అభిమానులు పాల్గొని, భాగ్యనగర వీధులలో దాదాపు 600 కిలోమీటర్ల మేరకు జిపిఎస్‌ ట్రాకింగ్‌ సంవిధానంతో (Bhola shankar In GPS) మెగాస్టార్‌ ముఖకవళికలే దారులుగా ఒక భారీ ర్యాలీ‌ని చేపట్టారు. దీంతో భోళా మానియా విడుదలకు ముందే మొదలైంది అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Bholaa-Shankar-1.jpg

‘భోళా శంకర్’ సినిమా విడుదలను పురస్కరించుకుని సూర్యాపేట, విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న రాజుగారి తోట వద్ద టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఏ హీరోకి లేని విధంగా 126 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చేపట్టిన ర్యాలీ కూడా అటువంటిదే అని అంటున్నారు మేకర్స్. ఈ ర్యాలీ గురించి చిత్ర నిర్మాత తెలియజేస్తూ.. ‘‘గడచిన అర్ధశతాబ్దంలో ఎన్నో ఘనవిజయాలను సొంతం చేసుకుని, మైలురాళ్ళను తనదైన ప్రతిభాపాటవాలతో సృష్టించి, తెలుగు సినిమా చరిత్రలోనే తనవైన సరికొత్త అధ్యాయాలను రాసుకుని, కోటానుకోట్ల అభిమానుల గుండెలలో గుడికట్టుకున్న ఒక మహా కథానాయకుడు.. కమర్షియల్‌ చిత్రానికి సంచలన నిర్వచనాలను చెప్పిన ఒక నిరుపమాన కథానాయకుడు....బాక్సాఫీసు ఎన్నడూ ఊహించని వసూళ్ళ పెనుతుఫానులను ప్రేరేపించిన ఒక అగ్రకథానాయకుడు.. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్‌’ ఆగస్ట్ 11వ తేదీన విడుదల కాబోతున్న శుభసందర్భంలో ఒక అద్భుతమైన ఘట్టానికి తెరతీయబోతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం.


Bholaa-Shankar-3.jpg

ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో, ప్రపంచసినిమాలో ఏ కథానాయకుడికి జరిగిన దాఖలాలు లేని విధంగా, మెగాస్టార్‌ చిరంజీవి అసంఖ్యాక అభిమానులు పాల్గొని, భాగ్యనగర వీధులలో దాదాపు 600 కిలోమీటర్ల మేరకు జిపిఎస్‌ ట్రాకింగ్‌ సంవిధానంతో మెగాస్టార్‌ ముఖకవళికలే దారులుగా ఒక భారీ ర్యాలీ జరుపుతున్నాం. ఈ సందర్భంగా సవినయంగా మనవి చేసుకునే విషయం ఏమిటంటే.. ఈ కార్యక్రమం కేవలం ‘భోళా శంకర్‌’ ప్రచారం నిమిత్తం చేస్తున్నది కాదని చెప్పాలన్నది మా ప్రయత్నం. ఆగస్ట్ 11న సినిమా రిలీజ్ కాబోతోంది కాబట్టి.. ఈ భారీ ర్యాలీ అందుకేనేమో అనే ఆలోచన సహజంగా కలుగుతుంది. కానీ ఇది కేవలం యాధృచ్ఛికం. కానీ, ఆ మహా చిత్రకథానాయకుడి అంతులేని, అలుపులేని చిరకీర్తిని, స్థిరఖ్యాతిని పురస్కరించుకుని ఆయన అభిమానగణం పూనుకున్న ఆత్మీయమైన పండగ ఇది అని చెప్పాలని ఉవ్విళ్ళూరుతున్నాం. గురువారం ఉదయం 8 గంటలకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ (Chiranjeevi Blood Bank) నుంచి ఈ మహా సంబరం ప్రారంభం అవుతుంది..’’ అని చెప్పుకొచ్చారు.

Bholaa-Shankar-2.jpg


ఇవి కూడా చదవండి:

***************************************

*Jailer Twitter Review: టాక్ బాగానే ఉంది కానీ.. విజయ్ ఫ్యాన్సే!

***************************************

*Jailer: ‘జైలర్‌’ సందడి మొదలైంది.. ఒక్కో టిక్కెట్‌ ధర ఎంతో తెలుసా?

***************************************

*Vijay Deverakonda: పెళ్లి మీద ఇష్టం పెరిగింది.. త్వరలోనే ఆ ఛాప్టర్‌లోకి..

***************************************

*Guntur Kaaram: ఫస్ట్ పోస్టర్‌పై వచ్చిన విమర్శలతో.. మహేష్ బాబు ఫ్యాన్స్‌కి మరో మాస్ పోస్టర్

***************************************

*Nagababu: మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన లేదు కానీ.. నిజం మాట్లాడిన వ్యక్తిపై విషం కక్కుతారా?

***************************************

*Anil Sunkara: ‘భోళా శంకర్’ చేసేటప్పుడు.. మహేష్ బాబు ఏం చెప్పారంటే..

***************************************

*Jr NTR: కిర్రాక్.. లుక్ అదిరింది.. ఏమున్నాడ్రా బాబు..!

***************************************

Updated Date - 2023-08-10T11:48:44+05:30 IST