Jailer Twitter Review: టాక్ బాగానే ఉంది కానీ.. విజయ్ ఫ్యాన్సే!

ABN , First Publish Date - 2023-08-10T10:04:50+05:30 IST

సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైలర్’. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. ఆ అంచనాలకు తగ్గట్టే నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ట్విట్టర్ టాక్ మాత్రం సినిమా బ్లాక్‌బస్టర్ అనేలా ఉంది.

Jailer Twitter Review: టాక్ బాగానే ఉంది కానీ.. విజయ్ ఫ్యాన్సే!
Jailer Movie Still

సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Super Star Rajinikanth) హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైలర్’ (Jailer). కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు.. కారణం ఆయనకి హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి పాజిటివ్ వైబ్రేషన్సే వస్తుండటంతో.. ‘జైలర్’పై ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు జరిగిన ఈవెంట్‌లో రజనీకాంత్ సుధీర్ఘ ఉపన్యాసం.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఇది కదా.. తలైవా అనేలా రజనీకాంత్ స్పీచ్ నడిచింది. తనని విమర్శించిన ప్రతి ఒక్కరికీ సమాధానం అన్నట్లుగా.. ఆ వేదికపై ఎంటర్‌టైన్ చేస్తూనే రజనీకాంత్ క్లాస్ ఇచ్చేశారు. ఆయన స్పీచ్‌తో పాటు కావాలయ్యా పాట.. సినిమాపై ఓ రేంజ్‌లో క్రేజ్ పెంచేశాయి. మరి ఆ క్రేజ్‌కి తగ్గట్లుగా సినిమా ఉందేమో తెలియాలంటే.. ఇప్పటికే సినిమా చూసిన వారెలా రియాక్ట్ అవుతున్నారో తెలుసుకోవాల్సిందే.


చాలా చోట్ల ‘జైలర్’ సినిమా ఎర్లీ షో‌తోనే ప్రారంభమైంది. ఇప్పటికే సినిమా చూసేసిన వారంతా ట్విట్టర్ వేదికగా సినిమాపై వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వినిపిస్తున్న ట్విట్టర్ టాక్ ప్రకారం ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అనే టాకే వినబడుతోంది. ఒకరిద్దరు మినహా.. మిగతా అంతా రజనీకాంత్‌కి హిట్టొచ్చిందనేలా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. (Jailer Twitter Talk)

‘బ్లాక్‌బస్టర్.. రజనీకాంత్ కోసమే ఈ సినిమా రెడీ చేశారనేలా సినిమా ఉంది. అద్భుతంగా నటించారు. వినాయకన్, యోగిబాబు, రమ్యకృష్ణ పాత్రలు అద్భుతంగా కుదిరాయి. అనిరుధ్ బిజీఎమ్ అరిపించేశాడు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ అదిరిపోయింది. మ్యాథ్యూ మరియు నరసింహ మధ్య వచ్చే సీన్లకు క్లాప్స్ పడతాయి. నెల్సన్ చాలా బాగా ఈ సినిమాని తెరకెక్కించాడు..’ అని చెబుతూ ఓ నెటిజన్ ఈ సినిమాకు 3.5 రేటింగ్ ఇచ్చారు. (Jailer Twitter Report)


సూపర్ ఫస్టాప్.. బ్లాక్‌బస్టర్ సెకండాప్.. ఓవరాల్‌గా బ్లాక్‌బస్టర్ చిత్రమిది. అనిరుధ్ బిజీఎమ్ వేరే లెవల్.. ముఖ్యంగా హుకుమ్ సాంగ్ అరుపులే. మాసివ్ కలెక్షన్స్ లోడింగ్.. అంటూ మరో నెటిజన్ పేర్కొన్నారు.

ఇప్పుడే సినిమా చూశా.. తలైవా వన్ మ్యాన్ షో.. అనిరుధ్ అన్నా.. టైగర్ కా హుకుమ్ సాంగ్ మంట పుట్టించావ్. ఇంటర్వెల్ మరియు అంతకు ముందు వచ్చే సీన్లు, జైల్ సీక్వెన్స్ సన్నివేశాలకు గూజ్‌బంప్స్ రావడం పక్కా. ఫస్టాఫ్ కంటే కూడా సెకండాఫ్ అదిరిపోయింది. అర్థమైందా రాజా.. ఇండస్ట్రీ హిట్ కన్ఫర్మ్ అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చారు. (Jailer Twitter Review)


ఇప్పుడే ‘జైలర్’ సినిమా చూశా.. ఫస్టాఫ్ అదిరిపోయింది. ముఖ్యంగా రజనీకాంత్‌లోని కోణాలు ఈ సినిమాలో ఆశ్చర్యపరుస్తున్నాయి. చాలా కాలం తర్వాత రజనీ, యోగిబాబు కాంబినేషన్ పండింది. థియేటర్‌లో వారిద్దరూ నవ్విస్తూనే ఉంటారు. ఇంటర్వెల్ అదిరిపోయింది. రజనీకాంత్, వినాయకన్ పాత్రలు ఫుల్ కిక్ ఇస్తాయి. థియేటర్లలో మోత మోగిపోవడం ఖాయం.. అని ఓ నెటిజన్ రియాక్ట్ అయ్యారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా చూసిన విజయ్ ఫ్యాన్స్ మాత్రం.. సినిమా అస్సలు బాగోలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా చూశాం.. ఫస్టాఫ్ వరస్ట్.. సెకండాఫ్ అంతకంటే దారుణం.. డబ్బుల్ వేస్ట్ చేసుకోకండి.. అంటూ ట్వీట్స్ కురిపిస్తున్నారు.


ఓవరాల్‌గా అయితే.. ఈ సినిమా ఇప్పటి వరకు పాజిటివ్ టాక్‌నే సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత రజనీకాంత్‌కి మంచి హిట్ పడిందనే టాక్‌తో పాటు.. అనిరుధ్ మ్యూజిక్, నెల్సన్ దర్శకత్వ ప్రతిభను అందరూ కొనియాడుతున్నారు. మరి ‘జైలర్’ అసలు టాక్ ఏంటనేది కాసేపట్లో వచ్చే రివ్యూలో తెలుసుకుందాం. మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, రమ్య కృష్ణన్, తమన్నా తో పాటు వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు అత్యధిక థియేటర్లలో విడుదలైంది. (Super Star Rajinikanth Jailer Movie)


ఇవి కూడా చదవండి:

***************************************

*Jailer: ‘జైలర్‌’ సందడి మొదలైంది.. ఒక్కో టిక్కెట్‌ ధర ఎంతో తెలుసా?

***************************************

*Vijay Deverakonda: పెళ్లి మీద ఇష్టం పెరిగింది.. త్వరలోనే ఆ ఛాప్టర్‌లోకి..

***************************************

*Guntur Kaaram: ఫస్ట్ పోస్టర్‌పై వచ్చిన విమర్శలతో.. మహేష్ బాబు ఫ్యాన్స్‌కి మరో మాస్ పోస్టర్

***************************************

*Nagababu: మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన లేదు కానీ.. నిజం మాట్లాడిన వ్యక్తిపై విషం కక్కుతారా?

***************************************

*Anil Sunkara: ‘భోళా శంకర్’ చేసేటప్పుడు.. మహేష్ బాబు ఏం చెప్పారంటే..

***************************************

*Jr NTR: కిర్రాక్.. లుక్ అదిరింది.. ఏమున్నాడ్రా బాబు..!

***************************************

Updated Date - 2023-08-10T10:08:26+05:30 IST