Jailer: ‘జైలర్‌’ సందడి మొదలైంది.. ఒక్కో టిక్కెట్‌ ధర ఎంతో తెలుసా?

ABN , First Publish Date - 2023-08-10T08:58:49+05:30 IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా యంగ్‌ డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ రూపొందించిన ‘జైలర్‌’ చిత్రం నేడు (ఆగస్ట్ 10, గురువారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోకి అనువాదం చేసి విడుదల చేశారు. ఈ సినిమాని చూసేందుకు ప్రేక్షకులకు ఎగబడుతుండటంతో టిక్కెట్ ధరలను అమాంతం పెంచేసినట్లుగా తెలుస్తోంది.

Jailer: ‘జైలర్‌’ సందడి మొదలైంది.. ఒక్కో టిక్కెట్‌ ధర ఎంతో తెలుసా?
Rajinikanth in Jailer

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Super Star Rajinikanth) హీరోగా యంగ్‌ డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ రూపొందించిన ‘జైలర్‌’ (Jailer) చిత్రం నేడు (ఆగస్ట్ 10, గురువారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోకి అనువాదం చేసి విడుదల చేశారు. ఇందులో రమ్యకృష్ణన్‌, తమన్నా, జాకీష్రాఫ్‌, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, సునీల్‌, యోగిబాబు తదితరులు నటించారు. ‘అన్నాత్తా’ వంటి ఫ్లాప్‌ చిత్రం తర్వాత రజనీకాంత్‌ ‘జైలర్‌’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. (Jailer Hungama)


ఈ నేపథ్యంలో గురువారం విడుదలైన ఈ చిత్రాన్ని వేకువ జామున స్పెషల్‌ షోలు‌గా కాకుండా రెగ్యులర్‌ షోలుగానే మూవీని స్టార్ట్ చేశారు. అంటే ఉదయం 9 గంటల నుంచి తొలి ఆట మొదలైంది. టిక్కెట్లను భారీ ధరకు దక్కించుకునేందుకు తమిళనాట అభిమానులు పోటీ పడుతున్నారు. దీంతో ఒక్కో టిక్కెట్‌ ధర రూ.300 నుంచి రూ.1000 వరకు పలుకుతోంది. మాల్స్‌, మల్టీప్లెక్స్‌ థియేటర్లలో టిక్కెట్స్‌ రేట్లలో ఎలాంటి మార్పులు లేవు. రెండు రోజుల కిత్రమే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభం కాగా, దేశవ్యాప్తంగా 6 లక్షలకు పైగా టిక్కెట్లు విక్రయమయ్యాయి. దీంతో ‘జైలర్’ హవా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనంలా మోతమోగిపోతోంది.

Jailer.jpg

హిమాలయాలకు వెళ్లిన రజనీ

మరోవైపు హీరో రజనీకాంత్‌ (Rajinikanth) ఆధ్యాత్మిక పర్యటన కోసం హిమాలయాల పర్యటనకు వెళ్లారు. ఆయన నాలుగేళ్ల తర్వాత బుధవారం ఉదయం బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘జైలర్‌’ను చూసి ఎలా ఉన్నాడో చెప్పాలని కోరారు. ఈ సినిమా ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయదని, కచ్చితంగా మంచి సినిమాగా నిలబడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Vijay Deverakonda: పెళ్లి మీద ఇష్టం పెరిగింది.. త్వరలోనే ఆ ఛాప్టర్‌లోకి..

***************************************

*Guntur Kaaram: ఫస్ట్ పోస్టర్‌పై వచ్చిన విమర్శలతో.. మహేష్ బాబు ఫ్యాన్స్‌కి మరో మాస్ పోస్టర్

***************************************

*Nagababu: మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన లేదు కానీ.. నిజం మాట్లాడిన వ్యక్తిపై విషం కక్కుతారా?

***************************************

*Anil Sunkara: ‘భోళా శంకర్’ చేసేటప్పుడు.. మహేష్ బాబు ఏం చెప్పారంటే..

***************************************

*Jr NTR: కిర్రాక్.. లుక్ అదిరింది.. ఏమున్నాడ్రా బాబు..!

***************************************

Updated Date - 2023-08-10T08:58:49+05:30 IST