Jr NTR: కిర్రాక్.. లుక్ అదిరింది.. ఏమున్నాడ్రా బాబు..!

ABN , First Publish Date - 2023-08-09T14:25:57+05:30 IST

‘దేవర’ సినిమా రావడానికి కాస్త టైమ్ పట్టే అవకాశం ఉండటంతో.. అభిమానులకు మాత్రం ఎన్టీఆర్ మధ్యమధ్యలో ట్రీట్ ఇస్తూనే ఉన్నాడు. రీసెంట్‌గా బాలీవుడ్ సినిమా ‘వార్ 2’లో ఎన్టీఆర్ చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. దీనితో పాటు ఎన్టీఆర్ చేస్తున్న యాడ్స్‌కి సంబంధించిన లుక్స్‌తో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ యాడ్ షూట్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఆ షూట్‌లో ఎన్టీఆర్ ఓ టైగర్‌లా కనిపిస్తున్నారు.

Jr NTR: కిర్రాక్.. లుక్ అదిరింది.. ఏమున్నాడ్రా బాబు..!
Young Tiger NTR

ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) సినిమా మొదలవ్వడానికి చాలా టైమ్ తీసుకుంది. ఎన్టీఆర్ నుంచి కొత్త సినిమా అప్‌డేట్ ఎప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూశారు. కొరటాల శివ (Koratala Siva)తో తారక్ చేయాల్సిన సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది. కానీ ఒక్కసారి సెట్స్‌పైకి వెళ్లిన తర్వాత ఆ సినిమా విషయంలో ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ సినిమా హీరోయిన్‌తో పాటు, సినిమాకు పెట్టిన టైటిల్, ఆ తర్వాత ఎప్పటికప్పుడు వినిపిస్తున్న వార్తలు.. ఈసారి టైగర్ వేట మాములుగా ఉండదనేలా.. ఆకాశమే అవధి అన్నట్లుగా మార్చేశాయి. ‘దేవర’ (Devera) టైటిల్‌తో పాటు వదిలిన గ్లింప్స్‌తో ఫ్యాన్స్ ఆనందానికి అవధులే లేవంటే నమ్మాలి.


‘దేవర’ సినిమా రావడానికి కాస్త టైమ్ పట్టే అవకాశం ఉండటంతో.. అభిమానులకు మాత్రం ఎన్టీఆర్ మధ్యమధ్యలో ట్రీట్ ఇస్తూనే ఉన్నాడు. రీసెంట్‌గా బాలీవుడ్ సినిమా ‘వార్ 2’ (War 2) ఎన్టీఆర్ చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. దీనితో పాటు ఎన్టీఆర్ చేస్తున్న యాడ్స్‌కి సంబంధించిన లుక్స్.. ఇలా ఏదో రకంగా ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా యంగ్ టైగర్ ఓ యాడ్ షూట్‌ (NTR In Ad Shoot)లో పాల్గొన్నారు. ఈ షూట్‌కు సంబంధించి ఎన్టీఆర్ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఓ పిక్‌ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ పిక్‌లో తారక్‌ని చూసిన వారంతా.. ‘కిర్రాక్‌గా ఉన్నాడు.. లుక్ అదిరిపోయింది. ఏమున్నాడ్రా బాబు..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (NTR New Look Creates Sensation)

Tiger.jpg

ఇంతకు ముందు తారక్ లీషియస్, యాపీ ఫిజ్, మెక్ డొనాల్డ్స్ వంటి యాడ్స్‌‌ కోసం చేసిన షూట్ ఫిక్స్ వైరల్ కాగా.. ఇప్పుడీ షూట్ ఏ బ్రాండ్ కోసం అనేది తెలియలేదు కానీ.. ఇందులో మాత్రం చాలా స్టైలిష్‌గా ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ (Aalim Hakim) ఆయనని అలా తయారు చేశారు. గుబురు గడ్డం, కళ్ళకి గ్లాసెస్‌తో ఎన్టీఆర్ కూర్చున్న తీరు చూస్తుంటే.. టైగర్ (Tiger) తీక్షణంగా చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. మొత్తంగా అయితే.. ఎన్టీఆర్ ఈ లుక్‌తో కిల్ చేశాడని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మాధ్యమాలలో వైరల్‌గా అవుతోంది.


ఇవి కూడా చదవండి:

***************************************

*Rajini and Chiru: అక్కడ రజనీకాంత్.. ఇక్కడ చిరంజీవి.. ఇలా తగులుకున్నారేంటయ్యా..

***************************************

*Malavika Mohanan: పచ్చరంగు స్విమ్‌ సూట్‌లో..

***************************************

*Pavan Sadhineni: ‘దయా’ సీజన్ 2 మాములుగా ఉండదు..

***************************************

*Meher Ramesh: ఇంకా డ్రీమ్‌లోనే వున్నా.. నేను డైరెక్టర్ అయ్యింది ఈ సినిమా చేయడానికేనేమో!

***************************************

Updated Date - 2023-08-09T14:25:57+05:30 IST