Salman Khan: ఓటీటీలపై సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-06T15:46:15+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). యూత్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

Salman Khan: ఓటీటీలపై సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). యూత్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. బీ టౌన్‌లో అత్యధికంగా వంద కోట్ల వసూళ్లను సాధించిన సినిమాల రికార్డు ఇప్పటికి సల్మాన్ పేరిటే ఉంది. సల్మాన్ తాజాగా ఓ ఈవెంట్‌లో మాట్లాడారు. ఓటీటీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓటీటీలకు సెన్సార్ షిప్ ఉండటం మంచిదేనని సల్మాన్ ఖాన్ తెలిపారు. ‘‘అన్ని మాధ్యమాలకు సెన్సార్ షిప్ ఉండాలి. అసభ్యత, అశ్లీలత, దూషణలు ఆగిపోవాలి. 15ఏళ్ల నుంచి 16ఏళ్ల పిల్లలు కూడా ఫోన్‌లో ఓటీటీ కంటెంట్‌ను చూస్తున్నారు. మీ కుమార్తె చదువుకోకుండా.. ఇటుంటి కంటెంట్‌ను ఫోన్‌లో చూస్తుంటే మీకు మంచిగా అనిపిస్తుందా. ఓటీటీలో వచ్చే కంటెంట్ అశ్లీలత లేకుండా ఉండాలి. కంటెంట్ బాగా ఉంటే వీక్షణలు పెరుగుతాయి. ప్రేమ, కిస్సింగ్, ఎక్స్ పోజింగ్ అన్ని రకాల సీన్స్‌ను సినిమాల్లో చూపించాం. మీరు ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మీ వాచ్‌మెన్ ఆ కంటెంట్‌ను చూస్తున్నారు. భద్రతా కారణాల రీత్యా అటువంటి కంటెంట్ మంచిది కాదని నేను భావిస్తున్నాను. మనం ఇండియాలో నివసిస్తున్నాం. సరిహద్దులను క్రాస్ చేయకూడదు’’ అని సల్మాన్ చెప్పారు.

Kisi-Ka-Bhai-Kisi-Ki-Jaan.jpg

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ‘కిసీ కా భాయ్, కిసీ కి జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) లో నటించారు. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో వెంకటేశ్, జగపతి బాబు, షెహనాజ్ గిల్, భూమిక, విజేందర్ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రామ్ చరణ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

MM. Keeravani: బాలీవుడ్ సినిమాకు సంగీతం.. హీరో ఎవరంటే..?

Nani-Balakrishna: నానికి 35.. బాలకృష్ణకు 36

Dasara: సీన్‌ను తొలగించాలని డిమాండ్.. థియేటర్స్ వద్ద ధర్నా..

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Updated Date - 2023-04-06T15:52:02+05:30 IST