Ramadan: మెగాస్టార్‌ని కలిసిన అలీ అండ్ ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్

ABN , First Publish Date - 2023-04-22T19:06:21+05:30 IST

రంజాన్‌ను పురస్కరించుకుని ముస్లిం సోదరులందరికి మెగాస్టార్.. తన ట్విట్టర్ (Megastar Ramjan Wishes) ద్వారా శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. అనంతరం తను ఎంతో ఇష్టపడే

Ramadan: మెగాస్టార్‌ని కలిసిన అలీ అండ్ ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
Ali Brothers with Megastar Chiranjeevi

ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (Ramjan) (ఈద్ ఉల్ ఫితర్ Eid al-Fitr) సందర్భంగా నటుడు అలీ (Ali) మరియు అతని కుటుంబ సభ్యులకు మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్‌ను పురస్కరించుకుని ముస్లిం సోదరులందరికి మెగాస్టార్.. తన ట్విట్టర్ (Megastar Ramjan Wishes) ద్వారా శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. అనంతరం తను ఎంతో ఇష్టపడే అలీని, అతని ఫ్యామిలీని ప్రేమపూర్వకంగా పలకరించి శుభాకాంక్షలు తెలియజేయడంతో.. ఆ ఫ్యామిలీ అంతా ఆనందంలో మునిగిపోయారు.

Ali-2.jpg

ఈ సందర్భంగా అలీ (Ali) మాట్లాడుతూ.. తనకు ఎంతో ముఖ్యమైన రంజాన్ పర్వదినాన్ని మెగాస్టార్‌తో పంచుకోవడం ఎంతో అందంగా, ఆనందంగా వుందని అన్నారు. రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని తెలిపారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని పేర్కొన్నారు.

Ali-1.jpg

అలీ, అతని ఫ్యామిలీ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని మెగాస్టార్ (Megastar) ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవితో అలీ మరియు ఆయన కుటుంబ సభ్యులు కలిసి ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, నటుడు అలీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh Government) రీసెంట్‌గా ఎలక్ట్రానిక్‌ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే.

Ali-3.jpg

ఇవి కూడా చదవండి:

************************************************

*Mama Mascheendra Teaser Talk: మహేష్ బావ.. ఆ ఇద్దర్నీ ఒకేసారి చంపేస్తాడట!

*OG Producer: మటన్ బిర్యానీతో పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ని సర్‌ప్రైజ్ చేసిన నిర్మాత

*Ivana: ‘సెల్ఫిష్’ చేతికి చిక్కిన ‘లవ్ టుడే’ భామ

*Young Actress: మోడల్స్‌ని వ్యభిచార ఊబిలోకి దించుతోన్న నటి అరెస్ట్

*Sai Madhav Burra: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’పై ఆసక్తికర కామెంట్స్

*Malli Pelli Teaser Review: నరేష్, పవిత్ర, రమ్య రఘుపతి.. ఎమ్మెస్ రాజు ఏంటి మాకీ కర్మ?

Updated Date - 2023-04-22T19:06:21+05:30 IST