OG Producer: మటన్ బిర్యానీతో పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ని సర్‌ప్రైజ్ చేసిన నిర్మాత

ABN , First Publish Date - 2023-04-22T17:25:09+05:30 IST

నిర్మాత డీవీవీ దానయ్య OG సినిమాపై పెడుతున్న ఇంట్రస్ట్ చూస్తుంటే.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ (Pawan Kalyan Fans) ఆయనకి గుడికట్టేలా ఉన్నారు. అదెలా అనుకుంటున్నారా?

OG Producer: మటన్ బిర్యానీతో పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ని సర్‌ప్రైజ్ చేసిన నిర్మాత
Producer DVV Danayya

‘ఆర్ఆర్ఆర్’ (RRR) వంటి ఆస్కార్ విన్నింగ్ చిత్రం తర్వాత డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (DVV Entertainment) బ్యానర్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘OG’ (వర్కింగ్ టైటిల్). డీవీవీ దానయ్య (DVV Danayya) నిర్మాణంలో ఒక భారీ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ‘సాహో’ (Saaho) చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో సంచలనం సృష్టించిన సుజీత్ (Sujeeth) ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 15న ముంబైలో ప్రారంభమైన విషయం తెలిసిందే. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) కూడా ఈ సెట్స్‌లోకి అడుగుపెట్టినట్లుగా మేకర్స్ కొన్ని ఫొటోలను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏదో ఒక కారణంగా ప్రతి రోజూ ట్రెండ్ అవుతూనే ఉంది. నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాపై పెడుతున్న ఇంట్రస్ట్ చూస్తుంటే.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ (Pawan Kalyan Fans) ఆయనకి గుడికట్టేలా ఉన్నారు.

ఎందుకని అనుకుంటారేమో?. ‘ఆర్ఆర్ఆర్’ టైమ్‌లో కూడా దానయ్య ఇంత యాక్టివ్‌గా కనిపించలేదు. కానీ పవన్ కల్యాణ్ ఓజీ విషయంలో మాత్రం.. అస్సలు తగ్గేదే లే అన్నట్లుగా.. అప్‌డేట్స్‌ని వదులుతున్నారు. పవన్ కల్యాణ్ సెట్స్‌లో ఉన్న పిక్‌ని, షూటింగ్ అప్‌డేట్‌ని, హీరోయిన్‌ని.. ఇలా వరుసగా ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ.. దానయ్య ఫ్యాన్స్‌ని ఖుష్ చేస్తున్నారు. తాజాగా దానయ్య (Producer DVV Danayya) చేసిన పనికి.. ఆయన ట్విట్టర్ మోత మోగిపోతుంది. ఇంతకీ దానయ్య ఏం చేశారంటే.. పవన్ కల్యాణ్ అభిమాని కోరగానే.. ఆయనకు మెరిడియన్ నుంచి మటన్ బిర్యానీని పార్శిల్ పంపించారు. ఇంతకు ముందెన్నడూ.. ఏ నిర్మాత చేయని పనిని చేసి.. ఫ్యాన్స్ చేత గ్రేట్ అనిపించుకుంటున్నారు.

PSPK.jpg

విషయంలోకి వస్తే.. రంజాన్‌ను పురస్కరించుకుని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ట్విట్టర్ వేదికగా ఈద్ ముబారక్ (Eid Mubarak) అంటూ శుభాకాంక్షలు తెలియజేసింది. దీనికి ఓ నెటిజన్.. ‘ఓజీ నుండి బిర్యానీ ప్లాన్ చెయ్’ అని కామెంట్ చేయగా.. ‘నీ అడ్రస్ మెసేజ్ చెయ్.. హ్యాపీ ఈద్ టు యు’ అని డీవీవీ సంస్థ రిప్లయ్ ఇచ్చింది. కాసేపటికే ఆ నెటిజన్ డీవీవీ సంస్థ నుంచి మెరిడియన్ బిర్యానీని అందుకున్నట్లుగా ఫొటో పోస్ట్ చేశారు. దీంతో సదరు ఫ్యాన్ సర్‌ప్రైజ్ అవడమే కాకుండా.. ‘మెరిడియన్ మటన్ బిర్యానీ (Meridian Mutton Biryani) అందుకున్నాను బ్రదర్.. థ్యాంక్యూ యూ. కల్యాణ్ అన్నని జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ బిర్యానీ ప్యాకెట్‌ ఫొటోని షేర్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మటన్ బిర్యానీనే కాదు.. ‘డబుల్ కా మీఠా’ కూడా పంపాడు అంటూ పోస్ట్ చేశాడు. ఇక ఇదంతా చూసిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. నిజంగానే పంపించారా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి నిర్మాత కదా మా అన్నకి కావాల్సింది. మళ్లీ ఇంకో సినిమా ప్లాన్ చెయ్ అన్న అని కొందరు.. ఇప్పటి నుంచే ఇలా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే.. విడుదల నాటికి పీక్స్‌లోకి అంచనాలు చేరుకుంటాయి.. సూపర్ మావా నువ్వు అంటూ మరికొందరు అభిమానులు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Ivana: ‘సెల్ఫిష్’ చేతికి చిక్కిన ‘లవ్ టుడే’ భామ

*Young Actress: మోడల్స్‌ని వ్యభిచార ఊబిలోకి దించుతోన్న నటి అరెస్ట్

*Sai Madhav Burra: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’పై ఆసక్తికర కామెంట్స్

*Malli Pelli Teaser Review: నరేష్, పవిత్ర, రమ్య రఘుపతి.. ఎమ్మెస్ రాజు ఏంటి మాకీ కర్మ?

Updated Date - 2023-04-22T17:36:47+05:30 IST