Malli Pelli Teaser Review: నరేష్, పవిత్ర, రమ్య రఘుపతి.. ఎమ్మెస్ రాజు.. ఏంటి మాకీ కర్మ?

ABN , First Publish Date - 2023-04-21T12:46:40+05:30 IST

‘మళ్ళీ పెళ్లి’ అనేది రియల్ కాదు.. రీల్ స్టోరీ అనే అంతా అనుకున్నారు కానీ.. ఇది నరేష్ రియల్ స్టోరీనే (Actor Naresh Real Story). తన జీవితంలో జరిగిన, జరుగుతున్న సంఘటనలతో ఈ సినిమాని

Malli Pelli Teaser Review: నరేష్, పవిత్ర, రమ్య రఘుపతి.. ఎమ్మెస్ రాజు.. ఏంటి మాకీ కర్మ?
Malli Pelli Movie Still

సీనియర్ నటుడు నరేష్ (Naresh), పవిత్ర లోకేష్‌ (Pavitra Lokesh)లు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు, చేసుకుంటున్నట్లుగా ఓ వీడియో ఈ మధ్య వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అది రియల్ కాదని, రీల్ కోసం అలా చేశారనేలా రివీల్ చేస్తూ.. ‘మళ్ళీ పెళ్లి’ (Malli Pelli) టైటిల్‌తో ఎమ్మెస్ రాజు (MS Raju) ఓ సినిమా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్.. సినిమా ఏమోగానీ, నరేష్‌కి కావాల్సిన అచ్చటా ముచ్చటా ఇలా తీర్చేసుకుంటున్నాడనేలా బీభీత్సమైన టాక్‌కి కారణమయ్యాయి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ వదిలారు. మేకర్స్ అంటే ఎవరో అనుకునేరు. అది కూడా నరేషే. ఈ సినిమాని ఆయనే విజయ కృష్ణ మూవీస్ (Vijaya Krishna Movies) బ్యానర్‌పై తెలుగు-కన్నడ భాషలలో నిర్మిస్తున్నారు.

Vanitha-1.jpg

టీజర్ విషయానికి వస్తే.. ‘మళ్ళీ పెళ్లి’ అనేది రియల్ కాదు.. రీల్ స్టోరీ అనే అంతా అనుకున్నారు కానీ.. ఇది నరేష్ రియల్ స్టోరీనే (Actor Naresh Real Story). తన జీవితంలో జరిగిన, జరుగుతున్న సంఘటనలతో ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా ఈ టీజర్ క్లారిటీ ఇచ్చేసింది. రియల్ లైఫ్‌లో రమ్య రఘుపతి (Ramya Raghupathi) మీడియా ముందుకు వచ్చి.. నరేష్ గురించి చెబుతున్నట్లుగానే.. ఈ టీజర్‌లో వనితా విజయ్ కుమార్‌ (Vanitha Vijay Kumar).. నరేష్ ‌గురించి ‘భార్యను ఎలా చూసుకోవాలో.. భార్యకు ఎలా విలువ ఇవ్వాలో తెలియని ఒక మృగం అతను’ అని చెబుతున్న డైలాగ్‌తో ఒక్కసారిగా టీజర్ స్వరూపమే మారిపోయింది. ఇది నరేష్ రియల్ స్టోరీ కదా.. ఓహో నరేష్ ఇలా ప్లాన్ చేశాడా? అని టీజర్ చూస్తున్న వారంతా రియలైజ్ అవుతారు. (Malli Pelli Teaser Talk)

Teaser-2.jpg

అయితే రమ్య రఘుపతిని కించపరిచేలా.. వనితా విజయ్ కుమార్‌కు అప్పులు, రోగాలు.. ఇంకా వాడకూడని పదం కూడా నరేష్ నోటి వెంట వినిపించింది. అంటే నిజజీవితంలో రమ్యపై నరేష్ అంత కసిగా ఉన్నాడనేది.. అతని డైలాగ్స్ వింటే అర్థమవుతుంది. అలాగే పవిత్రపై రమ్య మాట్లాడిన మాటల్ని, హోటల్ రూమ్‌లో నరేష్, పవిత్ర దొరికిన తర్వాత విజిల్స్ వేస్తూ నరేష్ చేసిన హంగామాని యాజీటీజ్‌గా ఇందులో దించేశారు. ‘నా కాపురంలో నిప్పులు పోయవద్దు.. నా పిల్లాడి లైఫ్‌తో ఆడుకోవద్దని వేడుకుంటున్నా’.. అంటూ వనితా విజయ్ కుమార్ మీడియా ద్వారా వెల్లడించే సన్నివేశాలు.. రియలిస్టిక్‌గా ఈ సినిమాని తెరకెక్కించారనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇక ఈ టీజర్‌లో చివరి షాట్ అయితే.. అబ్బో చెప్పలేం, చూడాల్సిందే. నరేష్, పవిత్రల (Naresh and Pavitra Romantic Scene) ఎక్స్‌ప్రెషన్స్‌కి యూత్ మాత్రమే కాదు.. మంచంలో ఉన్న ముసలోడు కూడా తన పెళ్లి తర్వాత జరిగే రాత్రులను గుర్తు చేసుకోకుండా ఉండలేరు. (Malli Pelli Teaser)

Naresh-3.jpg

ఓవరాల్‌గా అయితే మాత్రం.. బయట రాద్దాంతం జరుగుతున్న ఇలాంటి కథని సినిమాగా మలిచే డ్యూటీని ఎమ్మెస్ రాజు (Director MS Raju) ఎందుకు తీసుకున్నారో? ఇప్పటికే.. మీడియాలో వారి గురించి వచ్చే వార్తలు వినలేకపోతుంటే.. మళ్లీ ఎమ్మెస్ రాజు దానిని సినిమాగా తీయడం ఏమిటో? టీజర్ చివరిలో ఆ సరసాలు.. టీజర్ మధ్యలో ఆ బూతులు? ఏంటీ మాకీ కర్మ రాజుగారు? అనేలా ఈ టీజర్‌కు కామెంట్స్ పడుతుండటం గమనార్హం.

pavitra.jpg

మొత్తంగా మరోసారి నరేష్, పవిత్రల ప్రేమాయణాన్ని (Naresh and Pavitra Lokesh Relation) ఈ టీజర్ వార్తలలోకి తెచ్చిందనేది ఎంత వాస్తవమో..? టీజర్ తర్వాత సినిమా కోసం వెయిట్ చేసేలా చేసిందనేది కూడా అంతే వాస్తవం. డా.నరేష్ వికె పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్‌ని పూర్తి చేసుకున్న సందర్భంగా.. గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్‌గా ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతానికైతే.. ఈ టీజర్‌పై భారీ స్థాయిలో చర్చలు నడుస్తుండగా.. ఇప్పుడీ టీజర్‌పై రమ్య రఘుపతి ఎలా రియాక్ట్ అవుతుందనేది కూడా ఆశ్చర్యంగా మారింది.


ఇవి కూడా చదవండి:

************************************************

*Ramabanam Trailer Talk: ‘లక్ష్యం 2’ అనిపిస్తోంది

*Virupaksha Twitter Review: ‘విరూపాక్ష’ ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే..?

*Mrunal Thakur: ఈమె ‘సీతా రామం’ సీత అంటే ఎవరూ నమ్మరు కాక నమ్మరంతే..!

*Shamlee: 50కి పైగా చిత్రాల్లో నటించిన ‘ఓయ్’ షామ్లీ.. ప్రస్తుత టార్గెట్ ఏంటో తెలుసా?

*Pawan Kalyan: OG సెట్స్‌లో పవర్ స్టార్.. లుక్ అదిరిందిగా..!

Updated Date - 2023-04-21T12:46:40+05:30 IST