Sai Madhav Burra: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’పై ఆసక్తికర కామెంట్స్

ABN , First Publish Date - 2023-04-21T14:20:53+05:30 IST

మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా (Sai Madhav Burra) తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘గేమ్‌ ఛేంజర్’ సినిమాపై మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

Sai Madhav Burra: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’పై ఆసక్తికర కామెంట్స్
Sai Madhav Burra about Game Changer

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Star Chiranjeevi), సంచలన దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్‌లో భారీ స్థాయిలో నిర్మాత దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి.. వాటిని మించేలా సినిమా ఉంటుందని అంటున్నారు.. ఈ చిత్ర మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా (Sai Madhav Burra). తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘గేమ్‌ ఛేంజర్’ సినిమాపై మాట్లాడారు. గ్లోబల్ స్థాయిలో రామ్ చరణ్ ఇమేజ్‌ను పెంచేలానే ఈ సినిమా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ (Mega Fans) ఆయన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఈ వీడియోలో సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ (Sai Madhav Burra about Game Changer Movie).. ‘‘గేమ్ ఛేంజర్ నెక్ట్స్ లెవల్ మూవీ. ప్రేక్షకులు ఆ సినిమా ఎలా ఉండాలని కోరుకుంటున్నారో.. అంతకంటే బాగుంటుంది. ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి.. అంతకంటే గొప్పగా ఉంటుంది. సినిమా విడుదలైన తర్వాత అంతా ఇదే చెబుతారు. శంకర్‌గారు కూడా చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. డౌన్ టు ఎర్త్ పర్సన్. శంకర్‌గారి ‘జెంటిల్‌మ్యాన్’ సినిమా చూసి.. ఈ దర్శకుడితో లైఫ్‌లో ఒక్క ఫోటో దిగితే చాలు అనుకున్నాను. అలాంటి నాకు ఇప్పుడాయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. గేమ్ ఛేంజర్ షూటింగ్ బ్రహ్మాండంగా జరుగుతుంది. సినిమా చాలా గ్రాండియర్‌గా ఉంటుంది. ప్రతి షాట్ అద్భుతం అనేలా చిత్రీకరిస్తున్నారు. అది అనవసరమైన గ్రాండియర్ కాదు. అవసరమైన గ్రాండియర్.. కావాలని ఏదో ఖర్చు పెడుతున్నట్లుగా ఉండదు. ఆ షాట్‌కి అంత ఖర్చు అవసరం.. అంత మంది అవసరం. చాలా పెద్ద కథ.. స్ట్రాంగ్ కాన్సెప్ట్‌తో వస్తున్నారు..’’ అని చెబుతూ.. సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలను పెంచేశారు.

Ram-Charan.jpg

అయితే ఈ మధ్య వచ్చిన ‘శాకుంతలం’ (Shaakuntalam) విషయంలో కూడా సాయిమాధవ్ బుర్రా ఇలానే చెప్పుకొచ్చారు. గుణశేఖర్ (Gunasekhar) ఆలోచన, సమంత (Samantha) నటన అద్భుతం అనేలా ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఆ సినిమా ఫలితం ఏమిటో అందరికీ తెలిసిందే. అందుకే సినిమాకు ముందు ఏ రచయిత అయినా.. ఇలానే చెబుతారు. కానీ సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులు ఇచ్చే తీర్పే ఫైనల్. చూద్దాం.. శంకర్, చరణ్‌ల ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ వద్ద ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో..? సాయిమాధవ్ బుర్రా మాటలు ఎంత వరకు నిజమవుతాయో?. అయితే ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలకు సంబంధించి ఇప్పటి వరకు మేకర్స్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.


ఇవి కూడా చదవండి:

************************************************

*Malli Pelli Teaser Review: నరేష్, పవిత్ర, రమ్య రఘుపతి.. ఎమ్మెస్ రాజు ఏంటి మాకీ కర్మ?

*Ramabanam Trailer Talk: ‘లక్ష్యం 2’ అనిపిస్తోంది

*Virupaksha Twitter Review: ‘విరూపాక్ష’ ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే..?

*Mrunal Thakur: ఈమె ‘సీతా రామం’ సీత అంటే ఎవరూ నమ్మరు కాక నమ్మరంతే..!

*Shamlee: 50కి పైగా చిత్రాల్లో నటించిన ‘ఓయ్’ షామ్లీ.. ప్రస్తుత టార్గెట్ ఏంటో తెలుసా?

*Pawan Kalyan: OG సెట్స్‌లో పవర్ స్టార్.. లుక్ అదిరిందిగా..!

Updated Date - 2023-04-21T14:20:53+05:30 IST