Mama Mascheendra Teaser Talk: మహేష్ బావ.. ఆ ఇద్దర్నీ ఒకేసారి చంపేస్తాడట!

ABN , First Publish Date - 2023-04-22T18:31:48+05:30 IST

నైట్రో స్టార్ సుధీర్ బాబు (Nitro Star Sudheer Babu) త్రిపాత్రాభినయంలో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మామా మశ్చీంద్ర’ టీజర్ ఎలా ఉందంటే..

Mama Mascheendra Teaser Talk: మహేష్ బావ.. ఆ ఇద్దర్నీ ఒకేసారి చంపేస్తాడట!
Sudheer Babu In Mama Mascheendra

సూపర్ స్టార్ మహేష్ బావ, నైట్రో స్టార్ సుధీర్ బాబు (Nitro Star Sudheer Babu) త్రిపాత్రాభినయంలో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మామా మశ్చీంద్ర’ (Mama Mascheendra). యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ (Harshavardhan) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (Sree Venkateswara Cinemas LLP)పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సుధీర్ బాబు చేస్తున్న మూడు పాత్రల లుక్స్‌ని మేకర్స్ విడుదల చేయగా.. ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నాయి. దుర్గ (Durga)- స్థూలకాయుడు, పరశురాం (Parasuram)- ఓల్డ్ డాన్, డిజె (DJ) .. ఇలా మూడు భిన్నమైన పాత్రల పోస్టర్స్ సినిమాపై క్రేజ్‌ను పెంచేశాయి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) లాంచ్ చేశారు. ఇంతకు ముందు వదిలిన పోస్టర్స్ మాదిరిగానే.. ఈ టీజర్‌ కూడా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. (Mama Mascheendra Teaser)

టీజర్‌ విషయానికి వస్తే (Mama Mascheendra Teaser Talk).. సుధీర్‌బాబు (Sudheer Babu) మూడు పాత్రలు, వాటి క్యారెక్టరైజేషన్‌ని పరిచయం చేసేలా ఈ టీజర్‌ని కట్ చేశారు. దుర్గ జీవితంలో గర్ల్‌ఫ్రెండ్ కావాలని తపిస్తుంటాడు, డిజే ఏవో కారణాల వలన అమ్మాయిలను వద్దనుకుంటాడు. పరశురామ్ ఈ ఇద్దరిని చంపాలనుకునే డెడ్లీ ఓల్డ్ డాన్. టీజర్ అసాధారణంగా అదే సమయంలో వినోదాత్మకంగానూ ఉండటంతో.. సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడేలా చేస్తోంది. సుధీర్ బాబు మూడు పాత్రల మధ్య వైవిధ్యాన్ని చూపించడంతో పాటు.. డీజేగా తెలంగాణ స్లాంగ్‌లో ఆయన చెబుతున్న డైలాగ్స్ అలరిస్తున్నాయి. మిర్నాళిని రవి (Mirnalini Ravi), ఈషా రెబ్బా (Eesha Rebba) గ్లామరస్ గా కనిపించారు. హర్షవర్ధన్ యూనిక్ కథతో పాత్రలను ఆకట్టుకునేలా ప్రజంట్ చేశారు. ఓల్డ్ డాన్‌ పాత్ర చేసిన సుధీర్ బాబు.. మిగతా ఇద్దరిని ఒకే సారి చంపాలనుకోవడం ఏమిటనేది.. ఈ సినిమాపై మరింతగా ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.

మొత్తంగా అయితే మరో వైవిధ్యభరిత చిత్రం టాలీవుడ్‌లో రాబోతుందనేలా చేయడంలో ఈ టీజర్ సక్సెస్ అయింది. పిజి విందా (PG Vinda) సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj) మ్యూజిక్.. టీజర్‌ని హైలెట్ చేస్తున్నాయి. కాగా.. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్‌ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

************************************************

*OG Producer: మటన్ బిర్యానీతో పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ని సర్‌ప్రైజ్ చేసిన నిర్మాత

*Ivana: ‘సెల్ఫిష్’ చేతికి చిక్కిన ‘లవ్ టుడే’ భామ

*Young Actress: మోడల్స్‌ని వ్యభిచార ఊబిలోకి దించుతోన్న నటి అరెస్ట్

*Sai Madhav Burra: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’పై ఆసక్తికర కామెంట్స్

*Malli Pelli Teaser Review: నరేష్, పవిత్ర, రమ్య రఘుపతి.. ఎమ్మెస్ రాజు ఏంటి మాకీ కర్మ?

Updated Date - 2023-04-22T18:31:48+05:30 IST