Bubblegum Teaser: ఆ కిస్సులేంటి? ఆ డైలాగ్స్ ఏంటి? రోషన్ కనకాల రొమాన్స్ అరాచకం అంతే..

ABN , First Publish Date - 2023-10-10T16:50:02+05:30 IST

సుమ, రాజీవ్‌ల తనయుడు రోషన్ కనకాల హీరోగా మానస చౌదరి హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తూ.. ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రాల దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘బబుల్‌గమ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తోన్న ఈ జెన్జీ లవ్ స్టోరీ టీజర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Bubblegum Teaser: ఆ కిస్సులేంటి? ఆ డైలాగ్స్ ఏంటి? రోషన్ కనకాల రొమాన్స్ అరాచకం అంతే..
Bubblegum Movie Still

సుమ, రాజీవ్‌ల తనయుడు రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా మానస చౌదరి (Maanasa Choudhary) హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తూ.. ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రాల దర్శకుడు రవికాంత్ పేరెపు (Ravikanth Perepu) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘బబుల్‌గమ్’ (Bubblegum). పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తోన్న ఈ జెన్జీ లవ్ స్టోరీ టీజర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌లో ఉన్న డైలాగ్స్, రొమాంటిక్ సీన్స్‌తో టీజర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

టీజర్ విషయానికి వస్తే.. ప్రేమని బబుల్‌గమ్‌తో పోల్చుతూ టీజర్ మొదలైంది. స్టార్టింగ్‌లో తియ్యగుంటది. తర్వాత అంటుకుంటది.. షూస్ కింద.. థియేటర్లలో సీట్ల కింద.. అంత ఈజీ కాదు రరేయ్.. పండబెట్టేస్తది.. అనే డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్ అన్ని రకాల ఎమోషన్స్‌తో.. ముఖ్యంగా యూత్‌ని టార్గెట్ చేసేలా ఈ టీజర్‌ని కట్ చేశారు. పీస్‌ఫుల్‌గా ఉంది కదా అని తినడానికి వచ్చినా.. కాస్త నెమ్మదిగా తింటా.. అనే డైలాగ్‌తో రోషన్ కనకాలను ఇందులో పరిచయం చేశారు. జాన్వీ, ఆదిత్య అని హీరోహీరోయిన్లు ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఇద్దరు ప్రేమలో పడినట్లుగా చూపించారు. పికప్ చేస్తా, డ్రాప్ చేస్తా.. పళ్లు తోముకోకపోయినా వచ్చి ముద్దు పెడతా.. అంటూ రోషన్ చెప్పిన డైలాగ్ హైలెట్ అసలు. (Bubblegum Teaser Talk)


Roshan-Kanakala.jpg

ఆ డైలాగ్ తర్వాత ఒక్కసారిగా టీజర్‌లో సీరియస్‌నెస్ పెరిగింది. నచ్చినట్టు మార్చుకుంటా.. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా.. అది ఏదైనా సరే అంటూ సీరియస్‌గా హీరో చెప్పే డైలాగ్ అనంతరం టీజర్ స్వరూపమే మారిపోయింది. హీరోహీరోయిన్ల మధ్య డీప్ లిప్‌లాక్‌ సీన్ చూపించిన వెంటనే.. విలన్‌ని ఓ బూతు తిట్టించి.. ‘నేను జనరల్‌గా ఇంత గలీజ్‌గా బిహేవ్ చేయను.. మాట్లాడను.. ఇంకెప్పుడూ అట్లా చేయను.. ఐ యామ్ రియల్లీ సారీ’ అని.. ప్రేక్షకులకు హీరో సారీ చెప్పినట్లుగా ఉండే సీన్‌తో టీజర్ ముగిసింది. ఓవరాల్‌గా అయితే మాత్రం.. మంచి కంటెంట్‌తో పాటు ప్రస్తుత జనరేషన్‌కు బాగా కనెక్ట్ అయ్యే సినిమాలానే ఈ ‘బబుల్‌గమ్’ తెరకెక్కినట్లుగా అనిపిస్తుంది. ఆదిత్య పాత్రని చాలా యీజ్‌తో చేసేశాడు రోషన్. తన స్క్రీన్‌ప్రజెన్స్ చాలా ఎట్రాక్టివ్‌గా వుంది. యాక్షన్, డైలాగ్.. ఇలా అన్నిట్లోనూ చాలా అనుభవం వున్న నటుడిలానే కనిపించాడు రోషన్. మానస స్క్రీన్‌ప్రజెన్స్ బ్యూటీఫుల్‌గా వుంది. వీరిద్దరి కెమిస్ట్రీ ఈ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరా.. అన్నీ రిచ్‌గా ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించేలానే ఉంటుందనేది ఈ టీజర్‌తో తెలిసిపోతుంది. (Bubblegum Teaser)


ఇవి కూడా చదవండి:

============================

*Suhas: గృహప్రవేశం టైమ్‌లో కొత్త ఇంటి గోడకు వేసే అచ్చులాంటి సినిమా ఇది నాకు..

************************************

*Fatima Vijay Antony: నీ జ్ఞాపకాలతో చచ్చిపోతున్నా!.. కుమార్తె మృతిపై భావోద్వేగ పోస్ట్

**********************************

*Priyamani: ఓటీటీలో దసరా స్పెషల్‌‌గా ప్రియమణి నటించిన పవర్‌ఫుల్ వెబ్ సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

**********************************

*Raghava Lawrence: ఆడియో ఫంక్షన్లకు అభిమానులు రావొద్దు.. లారెన్స్ సంచలన వ్యాఖ్యలు

*******************************

*Lokesh Kanagaraj: ఆ డైలాగ్‌ వివాదానికి పూర్తి బాధ్యత నాదే!

*******************************

Updated Date - 2023-10-11T16:20:40+05:30 IST