Kalki2898AD: బర్త్‌డే స్పెషల్‌గా అమితాబ్ లుక్ విడుదల.. ట్రెండ్ బద్దలవుతోంది

ABN , First Publish Date - 2023-10-11T16:03:18+05:30 IST

రెబల్ స్టార్ ప్రభాస్, ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898AD’. బిగ్ బి ‘కల్కి 2898AD’‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని.. చిత్రయూనిట్ బుధవారం చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు.

Kalki2898AD: బర్త్‌డే స్పెషల్‌గా అమితాబ్ లుక్ విడుదల.. ట్రెండ్ బద్దలవుతోంది
Big B in Kalki

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898AD’ (Kalki 2898 AD). ప్రస్తుతం అంతా ‘సలార్’ (Salaar) మోజులో ఉండటంతో.. ఈ సినిమా గురించి వినబడటం లేదు కానీ.. ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ కళ్లన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. అందుకు కారణం ఆ మధ్య విడుదల చేసిన వీడియోనే. హాలీవుడ్ రేంజ్‌లో.. ఇంకా చెప్పాలంటే అంతకుమించిన రేంజ్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోందనే హింట్‌ని ‘Kalki 2898 AD’ టీజర్ ఇచ్చేసింది. దీంతో ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే కొన్ని రోజులుగా వార్తలలో లేని ఈ ఈ సినిమా.. తాజాగా ట్రెండ్ బద్దలు కొడుతోంది. కారణం ఏమిటో తెలుసా? బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ బర్త్‌డే (Amitabh Bachchan Birthday Special).

బిగ్ బి ‘కల్కి 2898AD’‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని.. చిత్రయూనిట్ చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతూ.. సినిమా పేరును టాప్‌లో ట్రెండ్ అయ్యేలా చేస్తోంది. ఈ లుక్‌లో అమితాబ్‌ను చూసిన వారంతా ఆశ్యర్యపోతున్నారు. ఇందులో ఆయన గురూజీ తరహా పాత్రను పోషిస్తున్నట్లుగా.. ఓ సాధువు లుక్‌ (Big B Look in Kalki 2898 AD)లో కనిపిస్తున్నారు. ఫేస్ అంత క్లియర్‌గా చూపించలేదు కానీ.. ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందనే విషయం ఈ లుక్ తెలియజేస్తోంది.


Kalki.jpg

వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) విలన్‌గా చేస్తున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆయన పాత్ర కూడా ఈ సినిమాలో వైవిధ్యంగా ఉండబోతుందని సమాచారం. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే (Deepika Padukone) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో పశుపతి, దిశా పటానీ వంటి వారు నటిస్తున్నారు. అలాగే దుల్కర్ సల్మాన్ కూడా ఓ పాత్రలో నటించినట్లుగా ఈ మధ్య వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ప్రభాస్ కూడా తన ఇన్‌స్టాగ్రమ్ వేడుకగా.. ఈ పోస్టర్‌ను పోస్ట్ చేసి.. అమితాబ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*Bubblegum Teaser: ఆ కిస్సులేంటి? ఆ డైలాగ్స్ ఏంటి? రోషన్ కనకాల రొమాన్స్ అరాచకం అంతే..

***********************************

*Suhas: గృహప్రవేశం టైమ్‌లో కొత్త ఇంటి గోడకు వేసే అచ్చులాంటి సినిమా ఇది నాకు..

************************************

*Fatima Vijay Antony: నీ జ్ఞాపకాలతో చచ్చిపోతున్నా!.. కుమార్తె మృతిపై భావోద్వేగ పోస్ట్

**********************************

*Priyamani: ఓటీటీలో దసరా స్పెషల్‌‌గా ప్రియమణి నటించిన పవర్‌ఫుల్ వెబ్ సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

**********************************

Updated Date - 2023-10-11T16:03:18+05:30 IST