సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

ABN, First Publish Date - 2023-03-14T21:44:51+05:30

అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన ‘యముడికి మెుగుడు’ (Yamudiki Mogudu) చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన నటి రిచా పనయ్ (Richa Panai). ఆ సినిమాలో ‘మొగుడా మొగుడా’ అంటూ అందరినీ..

Heroine Richa Panai
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన ‘యముడికి మెుగుడు’ (Yamudiki Mogudu) చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన నటి రిచా పనయ్ (Richa Panai). ఆ సినిమాలో ‘మొగుడా మొగుడా’ అంటూ అందరినీ అలరించినప్పటికీ.. ఆ తర్వాత ఈ భామకు సరైన అవకాశాలు రాలేదు. ఆ సినిమాలో యమజ (Yamaja)గా అందం, అభినయంతో ఆకట్టుకున్నప్పటికీ.. కమర్షియల్ హిట్‌ని మాత్రం అందుకోలేకపోయింది. ‘చందమామ కథలు, రక్షక భటుడు’ వంటి చిత్రాలలో నటించినా ఆమెకు పేరు రాలేదు సరికదా.. అసలు పట్టించుకునే వారే కరువయ్యారు. లాక్‌డౌన్‌కి ముందు కనిపించిన ఈ భామ.. ఈ మధ్య కాలంలో అసలెక్కడా కనిపించలేదు. తాజాగా ఆమె హైదరాబాద్‌ (Hydearabad)లో మెరిసింది. ఇప్పుడేం చేస్తున్నారని పలకరిస్తే.. ఆమె చెప్పిన ముచ్చట్లవీ..

‘‘లాక్‌డౌన్‌లో నేను రెండు సినిమాలు (Two Movies) చేశాను. అవి ఎప్పుడు విడుదల అవుతాయా అని ఎదురు చూస్తున్నాను. అందులో ఒకటి శ్రీధర్ సీపానగారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బృందావనమది అందరిది’ (Sridhar Sipana Brindhavanamidhi Andharidhi) కాగా, రెండోది నీలకంఠ (Neelakanta)గారి దర్శకత్వంలో తెరకెక్కింది. అవి విడుదలైన తర్వాత నాకు మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నాను.

నిజంగా షూటింగ్ అప్పటి రోజులను మిస్ అవుతున్నాను. ఆ రోజులు నాకు ఎంతో మొమరబుల్ డేస్. అయితే సినిమా అవకాశాలు ఎప్పుడూ ఉంటాయని భావించలేం. అందుకే ప్లాన్ బి (Plan B) కూడా రెడీ చేసుకున్నాను. క్యాట్ కాఫీ స్టూడియోని స్టార్ట్ చేశాను (cat coffee in mumbai). ప్రస్తుతం ఆ బిజినెస్ చూసుకుంటున్నాను. నా ఫోకస్ అంతా దానిపైనే ఉంది. అయితే మంచి అవకాశాలు వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాను. మంచి అవకాశాల కోసం వేచి చూస్తున్నాను.

అల్లరి నరేష్ నా మొట్టమొదటి కో స్టార్. వెరీ స్పాంటేనియస్ అండ్ ఎనర్జిటిక్. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. నాకు కామెడీ చిత్రాలంటే చాలా ఇష్టం.

సోషల్ మీడియా (Social Media) విషయానికి వస్తే.. ఒకప్పుడు చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. ఇప్పుడు ప్రస్తుతం అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. అందులో నెగిటివిటి బాగా పెరిగిపోయింది. నేను కామెంట్స్ పెద్దగా చూడను.. చదవను. ఏదైనా బ్యాడ్ కామెంట్ ఉంటే డిలీట్ అయ్యేలా సెట్టింగ్స్ ఉంటే బాగుంటుంది. కానీ మా అమ్మ మాత్రం అన్ని కామెంట్స్‌ను చదువుతుంటుంది.

నెక్ట్స్ ఈయర్ నా మ్యారేజ్ (Marriage) ఉండవచ్చు. ఈ రోజుల్లో ‘ప్రేమ’ని అందరూ చాలా క్యాజువల్‌గా తీసుకుంటున్నారు. 90ల కాలం నాటి ప్రేమల్లా.. ఇప్పుడు ప్రేమలు ఉండటం లేదు. ఈ డెకెడ్ పీపుల్ ప్రేమని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఈ విషయంలో మాత్రం నేనింకా పాతకాలం మనిషినే. అప్పటి ప్రేమలని నేను నమ్ముతున్నాను. త్వరలోనే నేను ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నాను.

కొత్తగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వారు భయపడాల్సిన అవసరం లేదు. క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch) భయాలేమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ తల్లిదండ్రులను వెంటబెట్టుకుని ట్రావెల్ చేస్తే.. ఏ ప్రాబ్లమ్ ఉండదు. మీరు మంచిగా ఉంటే.. అందరూ మంచిగానే కనిపిస్తారు..’’ అంటూ రిచా పనయ్ చెప్పుకొచ్చింది. ఇంకా అనేక విషయాలపై ఆమె తన అభిప్రాయాలను తెలిపారు. అవేంటో తెలియాలంటే కింది వీడియో చూడాల్సిందే.


ఇవి కూడా చదవండి:

*********************************

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

*Dasara Trailer: ఇదీ ట్రైలర్‌ అంటే.. ఒక్కొక్కనికి రాల్తాయ్!!

*Thammareddy Bharadwaja: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ అవార్డ్.. తమ్మారెడ్డి ఏమన్నారంటే?

*Oscar to RRR: తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి స్పందనిదే..

*Ram Charan: ఉపాసనని, ఆమె మెడలోని నగని కాపాడుకోవాలి

*Talasani: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్.. BJP ప్రభుత్వానికి ఇది గుణపాఠం

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

* Harish Shankar: పెరుగన్నం, బిర్యానీ.. దర్శకుడు మహాకు కౌంటర్

*Pavitra Naresh: బ్యాచ్‌లర్స్ ఫీల్ కాకండి.. ఈ మీమ్స్ ఏంటి సామి?

Updated Date - 2023-03-14T22:56:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!