OTT: ఓటీటీలో అమ్మకానికి మాయాబజార్.. ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-06-27T19:45:50+05:30 IST

వైవిధ్య‌మైన ఒరిజినల్ కంటెంట్‌‌తో త‌నదైన మార్క్ క్రియేట్ చేస్తూ.. దూసుకెళ్తోన్న జీ5 ఓటీటీ త్వరలో మాయాబజార్‌ని అమ్మకానికి పెట్టబోతోంది. అర్థం కాలేదా.. ‘మాయాబజార్ ఫర్ సేల్’ అనే స‌రికొత్త మ‌ల్టీస్టార‌ర్ తెలుగు వెబ్ ఒరిజిన‌ల్‌ను అందించబోతోంది. రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్‌ మీడియా భాగస్వామ్యంతో జీ 5 నిర్మించిన ఈ వెబ్ సిరీస్ జూలై 14 నుంచి స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ తెలియజేశారు.

OTT: ఓటీటీలో అమ్మకానికి మాయాబజార్.. ఎప్పుడంటే?
Maya Bazaar For Sale Poster

వైవిధ్య‌మైన ఒరిజినల్ కంటెంట్‌‌తో త‌నదైన మార్క్ క్రియేట్ చేస్తూ.. దూసుకెళ్తోన్న జీ5 ఓటీటీ త్వరలో మాయాబజార్‌ని అమ్మకానికి పెట్టబోతోంది. అర్థం కాలేదా.. ‘మాయాబజార్ ఫర్ సేల్’ (Maya Bazaar For Sale) అనే స‌రికొత్త మ‌ల్టీస్టార‌ర్ తెలుగు వెబ్ ఒరిజిన‌ల్‌ను అందించబోతోంది. వివిధ కథ, కథనాల ద్వారా సెటైరికల్ డ్రామాగా రూపొందుతోన్న ‘మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్’ గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌తో రూపొందినట్లుగా జీ5 యూనిట్ తెలుపుతోంది. జీ 5తో కలిసి రానా ద‌గ్గుబాటి (Rana Daggubati)కి సంబంధించిన స్పిరిట్ మీడియా (Spirit Media) బ్యాన‌ర్‌పై హృద్య‌మైన డ్రామాగా మాయాబ‌జార్ ఫ‌ర్ సేల్‌ రూపొందుతోంది. ఈ సిరీస్‌ జూలై 14 నుంచి జీ 5 (Zee5)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌కు రైట‌ర్‌, డైరెక్ట‌ర్‌గా గౌత‌మి చ‌ల్ల‌గుల్ల వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాజీవ్ రంజ‌న్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. (Maya Bazaar For Sale Streaming Date)

పాస్ట్రీ, గాంధీ, హిప్పీ, బ్యాచిల‌ర్స్‌, ప్రేమికుల జంట ఇలా ప‌లు ర‌కాలైన కుటుంబాల‌న్నీ క‌లిసి ఓ గేటెడ్ క‌మ్యూనిటీలో ఉంటాయి. అలాంటి గేటెడ్ కమ్యూనిటీలో ఉండే విలక్ష‌ణ‌మై కుటుంబాల మ‌ధ్య ఉండే నాట‌కీయ‌త‌ను ‘మాయాబజార్ ఫ‌ర్ సేల్‌’ సిరీస్‌లో ఆవిష్క‌రించ‌బోతున్నారు. ఈ గేటెడ్ క‌మ్యూనిటీలో ఉండే వారంద‌రూ ప్ర‌శాంత‌మైన జీవ‌నాన్ని గ‌డ‌పాల‌ని అనుకుంటుంటారు. ఆ స‌మ‌యంలో వారి గేటెడ్ క‌మ్యూనిటీ అన‌ధికారికమైన క‌ట్ట‌డ‌మంటూ ప్ర‌భుత్వం నుంచి ప్రక‌ట‌న వెలువ‌డుతుంది. వాటిని కూల‌గొట్ట‌డానికి బుల్డోజ‌ర్స్ వ‌స్తాయి. వ్య‌క్తిగ‌త జీవితాల‌తో పాటు సామాజిక జీవితాల‌ను కూడా ఈ ఒరిజిన‌ల్‌లో ఆవిష్క‌రించినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. నేటి అధునిక స‌మాజంలో కుటుంబాలు ఎలా ఉన్నాయ‌నే వాటితో పాటు సామాజిక జీవన విధానం ఎలా ఉంద‌నే విష‌యాల‌ను మాయాజ‌బార్ ఫ‌ర్ సేల్ ఒరిజిన‌ల్‌లో వ్యంగంగా, హాస్యాన్ని క‌ల‌బోసి చూపించ‌బోతున్నారు. ఇందులో న‌వ‌దీప్, ఈషా రెబ్బా, న‌రేష్, విజ‌య్ కుమార్‌, హ‌రితేజ‌, ఝాన్సీ ల‌క్ష్మీ, మియాంగ్ చంగ్‌, సునైన‌, కోట శ్రీనివాస‌రావు త‌దిత‌రులు త‌మ‌దైన న‌ట‌న‌కు ప్రాణం పోశారని వారు చెబుతున్నారు.

Zee-5.jpg

ఈ సందర్భంగా జీ 5 చీఫ్ బిజినెస్ ఆఫీస‌ర్ మ‌నీష్ క‌ల్రా (Manish Kalra) మాట్లాడుతూ.. మాయాబజార్ ఫర్ సేల్ వంటి మరో ఆస‌క్తిక‌ర‌మైన వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాం. అంద‌రికీ న‌చ్చేలా సునిశిత‌మైన కామెడీతో రూపొందిన ఈ ఒరిజిన‌ల్ త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉందని తెలపగా.. నిర్మాత రాజీవ్ రంజ‌న్ (Rajeev Ranjan) మాట్లాడుతూ.. జీవితంలో ఆనందం అంటే ఎలా ఉంటుంది. దాన్ని స‌మాజం ఎలా అంచ‌నావేస్తుంది అనే అంశాల‌ను మాయాబ‌జార్ ఫ‌ర్ సేల్ సిరీస్‌లో చూపిస్తున్నామన్నారు.

డైరెక్టర్ గౌతమి చిల్లగుల్ల (Gautami Challagulla) మాట్లాడుతూ.. ప్రేక్షకులందరూ ఈ మాయబజార్ ఫర్ సేల్ సిరీస్ చూసే సమయంలో తమని తాము అద్దంలో చూసుకున్నట్లు ఫీల్ అవుతారు. వారి జీవితాల్లో సంతోషాలు, బాధలు అన్ని ఉంటాయి. నాకు నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి అద్భుతమైన సపోర్ట్ అందింది. దీనికి ప్రేక్ష‌కుల నుంచి ఎలాంటి స‌పోర్ట్ రానుందోన‌ని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*VJ Sunny: బ్రేకింగ్.. రాజకీయాల్లోకి విజె సన్నీ.. కొత్త పార్టీ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?


**************************************

*Venu Udugula: ఎవరొచ్చిరి ఏమిచ్చిరి.. ఏ మాటలు ఎక్కడెక్కడ గుచ్చిరి?


**************************************

*Rashmika Mandanna: నెటిజన్ షేర్ చేసిన వీడియో చూసి రష్మిక ఫుల్ ఖుష్.. అందులో ఏముందంటే?


**************************************

*NTR: ఎన్టీఆర్ ‘శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం’ మూవీ గురించి ఈ విషయాలు తెలుసా?

**************************************

Updated Date - 2023-06-27T19:45:50+05:30 IST