Tamannaah: ‘లస్ట్ స్టోరీస్ 2’ చూడడానికి భయపడవద్దు.. ఎంజాయ్ చేయండి

ABN , First Publish Date - 2023-06-27T22:08:34+05:30 IST

లస్ట్ స్టోరీస్2 సిరీస్ చూస్తున్నపుడు ఎవరైనా గదిలోకి ప్రవేశిస్తే, భయపడి ఫాజ్ చేయాల్సిన అవసరం లేదంటోంది మిల్కీబ్యూటీ తమన్నా భాటియా. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన లస్ట్ స్టోరీస్2 సిరీస్ ఈ నెల 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా తమన్నా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని విడుదల చేసి.. అందులో ఈ సిరీస్‌లో ఏమేం ఉన్నాయో తెలియజేసింది.

Tamannaah: ‘లస్ట్ స్టోరీస్ 2’ చూడడానికి భయపడవద్దు.. ఎంజాయ్ చేయండి
Tamannaah Bhatia

‘లస్ట్ స్టోరీస్’ ఆంథాలజీ సిరీస్ అప్పట్లో ఎలా సంచలనం అయిందో తెలిసిందే. ఇప్పుడా సిరీస్‌కు కొనసాగింపుగా రాబోతోన్న ‘లస్ట్ స్టోరీస్ 2’ ట్రైలర్ రీసెంట్‌గానే విడుదలైంది. సీనియర్ హీరోయిన్ కాజోల్, తమన్నా వంటి వారు ఈసారి ఈ సిరీస్‌లో భాగమయ్యారు. టైటిల్‌తోనే యమా క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ సిరీస్.. రీసెంట్‌గా వచ్చిన టీజర్, ట్రైలర్‌‌లలో ఉన్న కంటెంట్‌తో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ముఖ్యంగా ఈ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి తమన్నా (Tamannaah Bhatia) సోషల్ మీడియాని షేకాడిస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మతో కలిసి ఆమె చేసిన శృంగార సీన్ల ‌గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇంకాస్త క్రేజ్ పెంచేలా.. హాట్ హాట్ సీన్లతో ప్రోమోలను కూడా వదలడం స్టార్ట్ చేశారు. మొత్తంగా ఈ సిరీస్‌పై భారీగా క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌ని ఓ వర్గపు ప్రేక్షకులే కాకుండా అందరూ చూడాలి అంటూ తమన్నా పిలుపునిచ్చింది.

తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో ఈ ‘లస్ట్ స్టోరీస్ 2’ (Lust Stories2) సిరీస్‌ని ఎలా చూడాలో వివరణ ఇచ్చింది. ముఖ్యంగా ఈ పేరు వినగానే ఇందులో శృంగారమే ఎక్కువగా ఉంటుందని అంతా అనుకుంటారేమో.. దానికి మించిన ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. (Tamannaah about Lust Stories2)

Tam.jpg

స్టార్టింగే తమన్నా, విజయ్‌‌ వర్మల మధ్య ఓ రొమాంటిక్ సీన్‌‌ని చూపించి.. వెంటనే పాజ్ చేశారు. ఆ తర్వాత వచ్చిన తమన్నా.. ‘‘ఈ లస్ట్ స్టోరీస్2 సిరీస్ చూస్తున్నపుడు ఎవరైనా గదిలోకి ప్రవేశిస్తే, భయపడి ఫాజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో కేవలం రొమాన్స్ మాత్రమే కాదు.. డ్రామా, యాక్షన్‌ కలగలిసి.. అమ్మ ప్రేమ, అమ్మమ్మ ప్రేమతో పాటు మాజీ లవర్‌, పని మనిషిపై ప్రేమ, అన్న ప్రేమ.. ఇలా అన్నీ ఉంటాయి. అందుకే ఈ సిరీస్ పేరు చూసి మోసపోకుండా అందరికీ చూపించండి. అయినా ఇది చూస్తే.. తుఫాన్ ఏమైనా వస్తుందా? ఆకాశం విరిగి పడుతుందా? వైఫై షట్ డౌన్ అవుతుందా? అలాంటిదేం జరగదు కాబట్టి.. జూన్ 29న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ కాబోతోన్న ఈ సిరీస్ చూసి ఎంజాయ్ చేయండి’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ఈ ‘లస్ట్ స్టోరీస్ 2’ ఆంథాలజీ సిరీస్‌.. ఆర్ బాల్కీ, కొంకణా సేన్ శర్మ, అమిత్ రవీందర్‌నాథ్ శర్మ, సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన నాలుగు భాగాలుగా ఉండబోతోంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Priyanka Tumpala: 16 ఏళ్ల కెరీర్.. 150కి పైగా చిత్రాలు.. షేకాడిస్తోన్న డబ్బింగ్ ఆర్టిస్ట్

********************

*OTT: ఓటీటీలో అమ్మకానికి మాయాబజార్.. ఎప్పుడంటే?


**************************************

*VJ Sunny: బ్రేకింగ్.. రాజకీయాల్లోకి విజె సన్నీ.. కొత్త పార్టీ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?


**************************************

*Venu Udugula: ఎవరొచ్చిరి ఏమిచ్చిరి.. ఏ మాటలు ఎక్కడెక్కడ గుచ్చిరి?


**************************************

*Rashmika Mandanna: నెటిజన్ షేర్ చేసిన వీడియో చూసి రష్మిక ఫుల్ ఖుష్.. అందులో ఏముందంటే?


**************************************

*NTR: ఎన్టీఆర్ ‘శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం’ మూవీ గురించి ఈ విషయాలు తెలుసా?

**************************************

Updated Date - 2023-06-27T22:08:34+05:30 IST