సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rajinikanth: గొప్ప మనసు చాటుకున్న సూపర్‌స్టార్.. ఆర్థిక సమస్యల్లో ఉన్న నిర్మాతకి సాయం

ABN, First Publish Date - 2023-03-10T11:21:49+05:30

సినీ ఇండస్ట్రీలో సాయం అవసరమైన వారిని ఆదుకోడానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే.

Rajinikanth
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ ఇండస్ట్రీలో సాయం అవసరమైన వారిని ఆదుకోడానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. అలా ఇప్పటికే చాలామందికి రజనీ సాయం చేసి వార్తల్లో నిలిచారు. ఆయన తాజాగా మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారు.

గత కొన్నేళ్లక్రితం రజనీకాంత్ ‘బాబా’ (Baba) అనే సినిమా చేసిన సంగతి విదితమే. ఆ సినిమాకి వీఏ దురై (VA Durai) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. ఆ సినిమాకి గానూ దురై రూ.51 లక్షల వరకూ పారితోషికం అందుకున్నారు. అంతేకాకుండా.. ‘ఎన్నమ కన్ను’, ‘లూటు2, ‘పితామగన్’, ‘గజేంద్రన్’, ‘నాయికుట్టి’ వంటి అనేక చిత్రాలకి సైతం నిర్మాతగా వ్యవహరించారు.

అయితే.. దురై ప్రస్తుతం దీన స్థితిలో ఉన్నారు. చాలా దారుణమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో అనారోగ్యానికి చికిత్స తీసుకోడానికి కూడా ఆయన దగ్గర డబ్బు లేదు. దీంతో తమిళ సినీ పరిశ్రమలోని ప్రముఖుల సహాయాన్ని కోరారు. ఈ విషయం తెలిసిన రజనీకాంత్ వెంటనే ఆయన్ని ఫోన్‌లో సంప్రదించి సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అలాగే.. ‘జైలర్’ సినిమాతో బిజీగా ఉండడం వల్ల షూటింగ్ పూర్తి కాగానే ఆయన్ని కలుస్తానని రజనీకాంత్ చెప్పిన్నట్లు సమాచారం. అంతేకాకుండా.. తన టీం ద్వారా కొంత డబ్బుని పంపించినట్లు తెలుస్తోంది. కాగా.. సూర్య (Suriya) ఇప్పటికే ఆయనకి సహాయంగా రూ.2 లక్షలు విరాళం ఇచ్చారు. సూర్య గతంలో నటించిన ‘పితామగన్’కి దురైనే నిర్మాతగా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి:

Writer Padmabhushan OTT Streaming: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Updated Date - 2023-03-10T11:21:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!