NBK108: బాలయ్య బర్త్‌డే‌కి ట్రీట్ అదిరిపోనుంది

ABN , First Publish Date - 2023-06-05T21:43:39+05:30 IST

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం NBK108. ఈ నెల 10న బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని.. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌తో పాటు మరో భారీ సర్‌ప్రైజ్‌ను ప్రేక్షకులకు, అభిమానులకు ఇవ్వబోతున్నట్లుగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

NBK108: బాలయ్య బర్త్‌డే‌కి ట్రీట్ అదిరిపోనుంది
Balakrishna in NBK108 Movie

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం #NBK108. మాస్, బాలయ్య అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతిని అందించేలా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 10న నటసింహం పుట్టినరోజు (NBK Birthday) కావడంతో.. ఆయన అభిమానులకు భారీగా ట్రీట్ ఇచ్చేందుకు చిత్రయూనిట్ సిద్ధమవుతోంది. బాలయ్య అభిమానులకు ఈ పుట్టినరోజును మరింత ప్రత్యేకమైనదిగా చేసేలా.. చిత్ర బృందం ప్లాన్ చేసింది.

ఈ బర్త్‌డే‌కి చాలా ట్రీట్‌లు ఉన్నాయంటూ.. ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు మేకర్స్. బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10)కి రెండు రోజుల ముందుగా అంటే జూన్ 8వ తేదీన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ (#NBK108 Title And First Look)ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే పవర్ ఫుల్ టైటిల్ లాక్ చేసి పెట్టినట్లుగా తెలుస్తోంది. పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్ చూసేందుకు మరో మూడు రోజులు ఆగాలి. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మరో పెద్ద సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. అదేంటో తెలియాలంటే.. 10 వరకు వెయిట్ చేయక తప్పదు.

Balayya.jpg

బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun Rampal) ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఉగాది సందర్భంగా ఈ సినిమాలో బాలయ్యకు సంబంధించిన రెండు డిఫరెంట్ లుక్‌లను మేకర్స్ విడుదల చేయగా.. భారీ స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఎస్ థమన్ (S Thaman) సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని విజయదశమి (దసరా)కి థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ కోసం భారీగా.. ‘సెట్’ చేస్తున్నారు

*Akhil Agent: ‘ఏజెంట్’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?

*Actor Prabhu: నాన్నకు తొలి వీరాభిమాని ఆయనే..

*Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ విడుదల తేదీ ఫిక్సయింది

*Eega 2: రాజమౌళి ‘ఈగ’ మళ్లీ ఎగురుతుందా?

*Udhayanidhi Stalin: తల్లి, భార్య సమక్షంలో.. ఉదయనిధి సంచలన నిర్ణయం

Updated Date - 2023-06-05T21:43:39+05:30 IST