800: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. ఇండియా హక్కులు ఎవరికంటే..

ABN , First Publish Date - 2023-08-22T22:50:15+05:30 IST

లెజెండరీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, మైదానంలో బంతితో మాయాజాలం సృష్టించిన శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘800’. ఈ మూవీని ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర ఆల్ ఇండియా రైట్స్‌ని శ్రీదేవి మూవీస్ సంస్థ సొంతం చేసుకుంది.

800: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. ఇండియా హక్కులు ఎవరికంటే..
800

లెజెండరీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, మైదానంలో బంతితో మాయాజాలం సృష్టించిన శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralidharan) జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘800’. ఈ మూవీని ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మురళీధరన్ భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటిస్తున్నారు. ఎంఎస్ శ్రీపతి దర్శకులు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు.


‘800’ ఆలిండియా పంపిణీ హక్కులను (All India Theatrical Rights) ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ (Sridevi Movies) అధినేత శివలెంక కృష్ణప్రసాద్ (Sivalenka ​krishna Prasad) సొంతం చేసుకున్నారు. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు. ఏడాదిన్నర పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రాన్ని శ్రీలంక, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, చెన్నై, కొచ్చిన్, చండీగఢ్‌లో చిత్రీకరణ చేశారు. భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకున్న నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ..

Sridevi.jpg

‘‘ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నిజ జీవితంలో ఆయన ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలు, ఎత్తుపల్లాలు భావోద్వేగభరితంగా ఉంటాయి. అటువంటి పరిస్థితులను అధిగమిస్తూ... 800 వికెట్లు తీసి వరల్డ్ రికార్డ్ సాధించిన ఘనత మురళీధరన్ సొంతం. బాల్యం నుంచి ఆయన పడిన స్ట్రగుల్స్, ఆయన జర్నీ అంతా ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఇటువంటి చిత్రాన్ని ఆలిండియాలో పంపిణీ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గత ఏడాది మా ‘యశోద’ను ఆలిండియాలో విడుదల చేసి నిర్మాతగా సక్సెస్ అందుకున్నాను. ఇప్పుడు ‘800’ను జాతీయ స్థాయిలో పంపిణి చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. రీ రికార్డింగ్, గ్రాఫిక్ వర్క్స్ తుది దశలో ఉన్నాయి. సెప్టెంబర్‌లో ట్రైలర్, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Varun Tej: కమర్షియల్ సినిమాలు చేయమని సలహాలు ఇస్తున్నారు.. కానీ?

***************************************

*Jawan: ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. 6గురు యాక్షన్ డైరెక్టర్స్.. ‘జవాన్’ రేంజ్ ఇది

***************************************

*Pawan Kalyan: అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు

***************************************

*GOAT: మాస్ రగ్డ్ లుక్‌లో సుడిగాలి సుధీర్.. బీజీఎమ్ అదిరింది

***************************************

Updated Date - 2023-08-22T22:50:15+05:30 IST