Karate Kalyani: ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌రణకు అభ్యంతరం.. కరాటే కళ్యాణికి షోకాజ్ నోటీసులు

ABN , First Publish Date - 2023-05-17T16:38:00+05:30 IST

ఈ నెల 28న నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో జరగనున్న విగ్ర‌హావిష్క‌రణకు నటి కరాటే కళ్యాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆమెకు ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు షోకాజ్ నోటీసులు పంపించారు. అసలు విషయంలోకి వస్తే..

Karate Kalyani: ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌రణకు అభ్యంతరం.. కరాటే కళ్యాణికి షోకాజ్ నోటీసులు
Karate Kalyani

మాజీ ముఖ్యమంత్రి, తెలుగు సినీ పరిశ్రమ, ప్రజల ఆరాధ్య దైవం అయిన నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) శత జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో లకారం (Lakaram lake) ట్యాంక్‌బండ్‌పై 54 అడుగుల పొడవైన విగ్రహాన్ని (54-ft-tall statue) ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay Kumar) ప్రకటించడమే కాకుండా.. ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు కూడా పంపించారు. ఈ నెల 28న నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో జరగబోతోంది. అయితే ఈ విగ్ర‌హావిష్క‌రణకు నటి కరాటే కళ్యాణి (Karate Kalyani) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆమెకు ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు (Maa President Manchu Vishnu) షోకాజ్ నోటీసులు పంపించారు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హైలెట్ అవుతోంది.

విషయం ఏమిటంటే..

నందమూరి తారక రామారావు శత జయంతిని (100th Birth Anniversary of NTR) పురస్కరించుకుని ఖమ్మంలో ఏర్పాటు చేస్తున్న విగ్రహం.. శ్రీకృష్ణుడి (Lord Krishna) రూపంలో ఉండటమే ఈ వివాదానికి కారణం. దీనిపై కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ (NTR)గారంటే నాకెంతో గౌర‌వం, భ‌క్తి ఉన్నాయి. ఆయ‌న విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తే నాకు ఎటువంటి స‌మ‌స్య లేదు.. చాలా సంతోషం కూడా. కాకపోతే ఆ విగ్రహం శ్రీకృష్ణుడి అవతారంలో (NTR's statue in Krishna Avatar) ఉండటంపైనే మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము. ఆత్మవిమర్శ చేసుకుని ఈ పోరాటం చేస్తున్నాను. బానిస బతుకు బతకడం లేదు.. వ్యక్తి పూజ చేయడం లేదు. నేను భక్తితో చేస్తున్న ఈ పోరాటం సరైనదేనని భావిస్తున్నాను. నా ఇష్ట దైవం, కుల దైవం, కుల సంఘంలో ఉన్న నాయకురాలి (అఖిల భారత యాదవ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు)గా ఈ ఈ ఫైట్ చేస్తున్నానని.. శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌రణకు ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ‘మా’ నుంచి తనకు బెదిరింపులు కాదు కానీ.. క్రమశిక్షణా సంఘం చర్యలు ఉంటాయనేలా కాల్స్ వచ్చినట్లుగా ఆమె తెలిపారు.

Maa.jpg

‘‘నాకు మా అసోసియేష‌న్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే అదేం బెదిరింపు కాల్ మాత్రం కాదు. ఈ విషయంపై మాట్లాడేందుకు మా అసోసియేషన్ నుంచి పిలుపు వచ్చింది. సినిమా పరిశ్రమకి ఎన్టీఆర్‌ దేవుడులాంటి వ్య‌క్తి. ఆయ‌న విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు అడ్డుప‌డ‌టం క‌రెక్ట్ కాద‌ని చెబుతూ.. నా స్టాండ్ మార్చుకోమన్నారు. నేనేం తప్పు చేయడం లేదని చెప్పాను. షోకాజ్ నోటిసులు (Showcause Notice) పంపుతామని అన్నారు. నోటీసులు వచ్చిన తర్వాత క్రమశిక్షణా సంఘం ముందు హాజరు కావాలని చెప్పారు. నాతో పాటు కొన్ని కుల సంఘాలు, హిందూ సంఘాలు కూడా దేవుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను వ్యతిరేకిస్తున్నాయి. వారితో కలిసి నేను కూడా ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటాను’’ అని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది.

NTR-Statue.jpg

కాగా.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చెప్పినట్లుగానే ఆమెకు నోటీసులు పంపించారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై కొన్ని మాధ్యమాలలో కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని తెలుపుతూ.. వాటిపై మూడో రోజులలో వివరణ ఇవ్వాలని ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు (Manchu Vishnu) ఆమెకు పంపిన నోటీసులో ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Vijay Antony: ‘పిచ్చైక్కారన్‌’.. నాకు ఆయన వేసిన భిక్ష

*Niharika Konidela: నన్ను నమ్మినందుకు థ్యాంక్స్

*PKSDT: టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

*Kavya Thapar: మరణం అంచుల వరకు వెళ్ళి వచ్చా

*Major: ‘మేజర్’ హీరో అడివి శేష్‌‌ను.. మాజీ రాష్ట్రపతి ఇంటికి పిలిచి మరీ..!

Updated Date - 2023-05-17T16:38:00+05:30 IST