PS2: కలెక్షన్ల ఊచకోత మొదలైంది..

ABN , First Publish Date - 2023-05-01T20:39:51+05:30 IST

ఏప్రిల్‌ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి భాగంతో పోల్చుకుంటే నిరాశ పరిచిందనే టాక్‌ (మిశ్రమ స్పందన) వచ్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా మాత్రం

PS2: కలెక్షన్ల ఊచకోత మొదలైంది..
PS 2 Poster

మణిరత్నం (Mani Ratnam) కలల ప్రాజెక్టుగా తెరకెక్కిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan) రెండో భాగం శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్టు చిత్ర నిర్మాణ సంస్థలైన లైకా ప్రొడక్షన్స్‌ (Lyca Productions), మద్రాస్‌ టాకీస్ (Madras Talkies) సంస్థలు ఆదివారం అధికారికంగా వెల్లడించాయి. ఏప్రిల్‌ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి భాగంతో పోల్చుకుంటే నిరాశ పరిచిందనే టాక్‌ (మిశ్రమ స్పందన) వచ్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్మురేపుతోంది. ఫలితంగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కలిపి వరల్డ్‌ వైడ్‌గా రూ.100 కోట్లకు పైగా రాబట్టినట్టు నిర్మాణ సంస్థలు తెలిపాయి. తొలి రోజు కలెక్షన్ల కంటే రెండో రోజైన శనివారం భారీ స్థాయిలో రావడం గమనార్హం.

‘పీఎస్-2’ను చూసిన ఐష్‌ (Aish) దంపతులు

ఇదిలావుండగా, ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటీమణుల్లో బాలీవుడ్‌ నటి ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌ (Aishwarya Rai Bachchan) ఒకరు. నందినిగా నెగెటివ్‌ రోల్‌(ఉమెన్‌ విలన్‌)తో పాటు మూగ మహిళ (మందాకిని) అనే రెండు పాత్రలను పోషించిన ఐష్‌... శనివారం ఈ చిత్రాన్ని చెన్నైలోని ప్రముఖ థియేటర్‌లో తన భర్త అభిషేక్‌ బచ్చన్‌, కుమార్తె ఆరాధ్యతో పాటు చియాన్‌ విక్రమ్‌, జయం రవి, విక్రమ్‌ ప్రభు, త్రిష తదితరులతో కలిసి సినిమాను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Aish.jpg

బాహుబలి (Bahubali), కెజియఫ్ (KGF) తరహాలోనే.. రెండో పార్ట్‌లుగా మణిరత్నం ఈ సినిమాని తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో, విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కోలీవుడ్‌లోనే కాకుండా.. విడుదలైన ఇతర భాష‌ల్లో కూడా ప్రస్తుతం మంచి కలెక్షన్స్‌ను రాబడుతుండటం విశేషం. వాస్తవానికి ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 1 కూడా ఇతర భాష‌ల ప్రేక్షకులని అలరించడంలో ఫెయిలైంది. ఒక్క తమిళ్‌లోనే ఈ చిత్రం రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. అక్కడ రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడు విడుదలైన పార్ట్ 2 కూడా ఇతర భాషల్లో మొదటి రోజు సేమ్ టాక్‌ని సొంతం చేసుకున్నా.. కలెక్షన్ల పరంగా మాత్రం పర్లేదు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Dil Raju: మేరా దిల్ ఖుష్ హువా..

*Nidhhi Agerwal: ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న నిధి.. సంచలన నిర్ణయం

*Anushka: ‘మిస్ శెట్టి’.. ప్రభాస్‌ని భలే బుక్ చేసిందిగా.. ఇక నలుగురిలో తిరగగలడా?

*Bholaa Shankar: వింటేజ్ లుక్‌లో మెగాస్టార్.. సోషల్ మీడియా షేక్

*Miss Shetty Mr Polishetty Teaser Talk: మీ టైమింగ్ ఎప్పుడూ ఇంతేనా?

*Director Teja: బాలీవుడ్ సినిమాని చంపింది.. టాలీవుడ్ సినిమాని చంపబోతోందీ అదే!

Updated Date - 2023-05-01T20:39:51+05:30 IST