Upasana: ‘క్లీంకార’ పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగ్‌లు పెట్టొద్దు.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2023-07-20T17:21:43+05:30 IST

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల జీవితంలో జూన్ 20 ఎంతో కీల‌కం. ఎందుకంటే ఆరోజున క్లీంకార పుట్టుక‌తో వారు త‌ల్లిదండ్రులుగా జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభించారు. గురువారంతో పాప పుట్టి నెల రోజులు అవుతుంది. గురువారం రోజునే ఉపాస‌న పుట్టిన‌రోజు కావ‌టం విశేషం. క్లీంకార వన్ మంత్ సెలబ్రేషన్స్ వీడియోను తాజాగా మెగా ఫ్యామిలీ విడుదల చేసింది.

Upasana: ‘క్లీంకార’ పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగ్‌లు పెట్టొద్దు.. ఎందుకంటే?
Mega Power Star Ram Charan Family

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ (Mega Power Star Ram Charan), ఉపాస‌న (Upasana) దంప‌తుల జీవితంలో జూన్ 20 ఎంతో కీల‌కం. ఎందుకంటే ఆరోజున క్లీంకార (Klin Kaara Konidela) పుట్టుక‌తో వారు త‌ల్లిదండ్రులుగా జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభించారు. దీనిపై మెగాభిమానులు, కుటుంబ స‌భ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. కాగా గురువారం (జూలై 20) రోజున‌ వీరు క్లీంకార ఆగ‌మ‌నానికి సంబంధించిన హృద‌యానికి హ‌త్తుకునే అంద‌మైన వీడియోను విడుద‌ల చేశారు. యాదృచ్చికంగానే జ‌రిగిన‌ప్ప‌టికీ గురువారంతో పాప పుట్టి నెల రోజులు అవుతుంది. గురువారం రోజునే ఉపాస‌న పుట్టిన‌రోజు కావ‌టం విశేషం. అలాగే క్లీంకార జన్మించి వన్ మంత్ పూర్తి కావడంతో.. ఈ వేడుకను పురస్కరించుకుని ఓ వీడియోను టాలెంటెడ్ ఫిల్మ్ మేక‌ర్‌ జోసెఫ్ ప్ర‌త‌నిక్ డైరెక్ట్ చేసి నిర్మించారు.


ఈ వీడియోలో లెజెండ్రీ యాక్ట‌ర్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), ఆయ‌న సతీమ‌ణి సురేఖా కొణిదెల (Surekha Konidela)తో పాటు ఉపాస‌న త‌ల్లిదండ్రులు శోభా కామినేని, అనీల్ కామినేని కూడా ఉన్నారు. కుటుంబ స‌భ్యులంద‌రూ ఉన్నారు. అంద‌రిలోనూ ఎగ్జ‌యిట్‌మెంట్‌, ఆనందం ఉండ‌టాన్నిమ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. క్లీంకార పుట్టిన త‌ర్వాత కుటుంబ స‌భ్యులు, అభిమానులు అంద‌రూ పండుగ చేసుకున్నారు. వాట‌న్నింటినీ ఈ వీడియోలో అందంగా చూపించారు.

Chiru.jpg

ఈ భావోద్వేగం గురించి మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. ‘‘క్లీంకార పుట్టే స‌మ‌యంలో మా అంద‌రిలోనూ తెలియ‌ని టెన్ష‌న్‌. అంతా స‌రిగ్గా జ‌ర‌గాల‌ని మేం అంద‌రం ప్రార్థించాం. అందుకు త‌గిన‌ట్టే అన్నీ అనుకూలంగా మారి స‌రైన స‌మ‌యం కుద‌ర‌టంతో పాప ఈ లోకంలోకి అడుగు పెట్టింద‌ని భావిస్తున్నాను. పాప పుట్టిన ఆ క్ష‌ణం మ‌న‌సుకి ఆహ్లదంగా, చాలా సంతోషంగా అనిపించింది. పాప పుట్ట‌డానికి ప‌ట్టిన 9 నెల‌ల స‌మ‌యం, అప్పుడు జ‌రిగిన ప్రాసెస్ అంతా త‌లుచుకుని హ్యాపీగా ఫీల‌య్యాం’’ అన్నారు.


క్లీంకార రాకకు దారి తీసిన ఆ మ‌ర‌పురాని క్ష‌ణాల‌తో పాటు, పాప‌కు ఆ పేరు పెట్ట‌టానికి కార‌ణ‌మైన అస‌లు క‌థ‌ను కూడా వీడియోలో మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. భార‌త‌దేశంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ఒడిస్సా ప్రాంతాల్లో నివ‌సిస్తున్న చెంచు జాతి నుంచి స్ఫూర్తిని పొందారు. స‌ద‌రు చెంచు జాతి ద్రావిడ సంస్కృతిలో భాగం. వారి సంస్కృతిలోని గొప్ప‌త‌నం, విలువ‌లే పాపకు ఆ పేరు పెట్ట‌టానికి కార‌ణ‌మ‌య్యాయి. (Klin Kaara Konidela’s Arrival into the World)

Klin-Kaara.jpg

ఈ సంద‌ర్భంగా ఉపాస‌న కొణిదెల మాట్లాడుతూ.. ‘‘మా పాప ద్రావిడ సంస్కృతిలో భాగం కావాల‌ని నేను కోరుకున్నాను. ఆమె పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగుల‌ను ఇవ్వ‌కండి. అలాంటి వాటిని వారే స్వ‌యంగా సాధించుకోవాల‌ని నా అభిప్రాయం. పిల్ల‌ల పెంప‌కంలో ఇవెంతో ముఖ్య‌మైన‌వి. జీవితంలో ప్ర‌తీ క్ష‌ణాన్ని ఆస్వాదించాలి. మ‌నం అంద‌రితో క‌లిసి సంతోషంగా ఉన్న స‌మ‌యానికి విలువ ఇవ్వాల‌ని నేను భావిస్తాను’’ అన్నారు. అభిమానులు, స్నేహితులు, స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యులు చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాల‌పై చ‌ర‌ణ్, ఉపాస‌న కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Hiranyakashyap: దేవుడనేవాడు ఉన్నాడు.. చూసుకుంటాడు.. రానాపై గుణశేఖర్ గుర్రు

**************************************

*Rules Ranjann: శ్రేయ ఘోషల్ వాయిస్‌లో ‘సమ్మోహనుడా’.. రొమాంటిక్ సాంగ్ ఎలా ఉందంటే..

**************************************

*Sitara Ghattamaneni: గుర్తు పెట్టుకోండి.. త్వరలో ఈ పేరొక ప్రభంజనం కాబోతోంది

**************************************

*Leo: మైత్రీ మూవీ మేకర్స్ బాటలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ఫస్ట్ సినిమా ‘లియో’నే!

**************************************

*Bro: షాకింగ్ నిర్ణయం తీసుకున్న నిర్మాతలు.. ఫ్యాన్స్‌కు నిరాశే ‘బ్రో’!

*************************************

Updated Date - 2023-07-21T01:26:06+05:30 IST