సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Hero Vishal: హీరో విశాల్‌కు మద్రాస్‌ హైకోర్టు షాక్‌

ABN, First Publish Date - 2023-04-07T12:07:21+05:30

విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీపై నిర్మించే చిత్రాలు (Vishal Film Factory Films) థియేటర్‌ లేదా ఓటీటీలో విడుదల చేయడానికి వీల్లేదని ధర్మాసనం ఆదేశించింది ఎందుకంటే..

Hero Vishal
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్ హీరో విశాల్‌ (Vishal)కు మద్రాస్‌ హైకోర్టు గట్టి షాకిచ్చింది. రూ.15 కోట్లను శాశ్వత ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా మూడు వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. అలా చేయని పక్షంలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ (Vishal Film Factory) పై తెరకెక్కించే చిత్రాలను థియేటర్‌ లేదా ఓటీటీల్లో విడుదల చేయకుండా నిషేధం విధించింది. ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్‌ అన్బుచెళియన్‌ (Anbu Chezhiyan) నుంచి విశాల్‌ తన సొంత నిర్మాణ సంస్థ విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ కోసం రూ.21.29 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ రుణాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ (Lyca Productions).. ఫైనాన్షియర్‌కు తిరిగి చెల్లించింది. అయితే, తమకు రుణం చెల్లించేంత వరకు విశాల్‌ నటించే చిత్రాల పంపిణీ హక్కులన్నీ తమకే ఇచ్చేలా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ - లైకా ప్రొడక్షన్స్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘించారు.

Also Read-Rangamarthanda: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. ఏ ఓటీటీలో అంటే?

రీసెంట్‌గా విశాల్ ఈ ఒప్పందం మీరి.. తన చిత్రం ‘వీరమే వాగై సూడుం’ (Veeramae Vaagai Soodum) చిత్రాన్ని రిలీజ్‌ చేశారు. దీంతో లైకా సంస్థ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి స్పెషల్‌ కోర్టు... హైకోర్టు రిజిస్ట్రార్‌ పేరుతో రూ.15 కోట్లను మూడు వారాల్లో శాశ్వత డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ సమయంలో విశాల్‌ నేరుగా కోర్టుకు హాజరై.. లైకా సంస్థ కోర్టును ఆశ్రయించడం వల్లే రుణం చెల్లించలేకపోయాయని, పైగా తనకు ఒకే రోజున రూ.18 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో విశాల్‌ ఆస్తుల వివరాలను ప్రమాణ పత్రంలో సమర్పించాలని ఆదేశించింది. (Madras High Court gives Shock to Hero Vishal)

ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ విశాల్‌ హైకోర్టులో అప్పీల్‌ చేయగా, దీనిపై ప్రధాన న్యాయమూర్తి (ఇన్‌ఛార్జ్‌) జస్టిస్‌ రాజా, జస్టిస్‌ భరత చక్రవర్తిల సారథ్యంలో ధర్మాసనం విచారణ జరిపి.. గతంలో రూ.15 కోట్లను విశాల్‌ చెల్లించాలంటూ సింగిల్‌ స్పెషల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. పైగా ప్రత్యేక జడ్జి తుది తీర్పును వెలువరించేంత వరకు విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీపై నిర్మించే చిత్రాలు (Vishal Film Factory Films) థియేటర్‌ లేదా ఓటీటీలో విడుదల చేయడానికి వీల్లేదని ధర్మాసనం ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

*********************************

*Ravanasura Twitter Review: రవితేజ ‘రావణాసుర’ ట్విట్టర్ టాక్ ఏంటంటే..

*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?

*NBK SRH: పాపం మన SRH క్రికెటర్లు.. బాలయ్య డైలాగ్స్ చెప్పలేక ఎన్ని తిప్పలు పడ్డారో..!

*Ustaad Bhagat Singh: ఫ్రంట్ ఏంటి? బ్యాక్ ఏంటి?.. కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలదా..

*Hanuman Jayanti Special: ‘ఆదిపురుష్’ నుంచి హనుమాన్ పోస్టర్.. ఎలా ఉందంటే?

*Upasana Baby Shower Party: వీడియోతో సర్‌ప్రైజ్ చేసిన ఉపాసన.. చరణ్ లుక్ అదుర్స్!

Updated Date - 2023-04-07T12:09:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!