Rangamarthanda: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. ఏ ఓటీటీలో అంటే?

ABN , First Publish Date - 2023-04-07T11:20:57+05:30 IST

‘రంగమార్తాండ’ సినిమాకు టాక్ పాజిటివ్‌గా వచ్చినప్పటికీ.. థియేటర్లలో ఈ సినిమాని చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి కనబరచలేదు. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్ద విజయం సాధించలేదనే చెప్పుకోవాలి. అందుకే ఇప్పుడు

Rangamarthanda: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. ఏ ఓటీటీలో అంటే?
Rangamarthanda Poster

ప్రకాశ్ రాజ్ (Prakash Raj), బ్రహ్మానందం (Brahmanandam), రమ్యకృష్ణ (Ramyakrishna) ప్రధాన తారాగణంగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). ఈ చిత్రం మార్చి 22న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందు ప్రదర్శించిన ప్రీమియర్స్‌తోనే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రంపై.. విడుదలకు ముందు, విడుదల తర్వాత ప్రశంసల వర్షం కురిసింది. నక్సలిజం, ఫ్యాక్షనిజం, దేశభక్తి.. ఇలా ఏ జానర్ ‌అయినా 100 శాతం ఎఫర్ట్ పెట్టే కృష్ణవంశీ.. ఈ సినిమాను నాటక రంగ నేపధ్యంలో.. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలాంటి భావనతో ఉన్నారనే వాస్తవికతను తెలియజేసే ప్రయత్నం చేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టేలా.. హృదయాన్ని కదిలించే సన్నివేశాలతో కృష్ణవంశీ ఈ చిత్రాన్ని మలిచారు. అయితే, టాక్ పాజిటివ్‌గా వచ్చినప్పటికీ.. థియేటర్లలో ఈ సినిమాని చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి కనబరచలేదు. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్ద విజయం సాధించలేదనే చెప్పుకోవాలి. అందుకే ఇప్పుడు ఓటీటీలోకి ఈ సినిమాని తీసుకొచ్చేశారు. (Rangamarthanda OTT Streaming Details)

Also Read- Rangamarthanda Review: కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ రివ్యూ

ఎటువంటి సమాచారం లేకుండా.. సడెన్‌గా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ‘రంగమార్తాండ’ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాని థియేటర్లలో ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇక్కడ కూడా భారీ ఆదరణ లభిస్తుందని భావిస్తున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. అయితే.. ఓటీటీ విడుదలకు సంబంధించి కాస్త ప్రచారం చేసి ఉంటే బాగుండేదనేలా.. సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం విశేషం. అదలా ఉంటే ఈ సినిమాలో బ్రహ్మానందం నటనకు.. అంతా ఫిదా అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) వంటి వారు ఆయన నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. సత్కరించారు కూడా. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి.. బ్రహ్మానందం, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్‌ల నటన గురించి ఇక సోషల్ మీడియాలో జరిగే హంగామా ఓ రేంజ్‌లో ఉండే అవకాశముంది.

‘రంగమార్తాండ’ కథ (Rangamarthanda Story) విషయానికి వస్తే.. రాఘవరావు (ప్రకాష్ రాజ్) రంగస్థల దిగ్గజ నటులలో ఒకరు. ఒకవిధంగా అతని జీవితంలో చాలా భాగం రంగస్థలమే అవుతుంది. రంగస్థల నటుడిగా అతని ప్రతిభకి మెచ్చి ‘రంగమార్తాండ’ బిరుదును ప్రదానం చేస్తారు. అదే సత్కార సభలో రాఘవరావు తాను ఇక నటించనని, భార్య బిడ్డల కోసం మిగతా కాలాన్ని వినియోగిస్తానని ప్రకటిస్తాడు. ఇంటికి వచ్చి తన ఆస్తిని పిల్లల పేర్ల మీద రాసేస్తాడు. ఇష్టపడి కట్టుకున్న ఇంటిని కోడలు గీతా రంగారావు (అనసూయ) పేరు మీద రాస్తాడు. కూతురు శ్రీ (శివాత్మికా రాజశేఖర్)కు తన బ్యాంకులో డిపాజిట్ల రూపంలో వున్న డబ్బు ఇస్తాడు. అలాగే ఆమె ప్రేమించిన అబ్బాయి రాహుల్ (రాహుల్ సిప్లిగంజ్)కు ఇచ్చి పెళ్లి చేస్తాడు. భార్య పేరుమీద కానీ, తన పేరు మీద కానీ ఏమీ వుంచుకోడు. భార్యకి తాను ఉన్నానని చెప్తాడు. ఇలా అన్నీ ఇచ్చేసి తన శేషజీవితాన్ని తన స్నేహితుడు చక్రపాణి (బ్రహ్మానందం), భార్య (రమ్యకృష్ణ)తో సంతోషంగా గడుపుదామని నిశ్చయించుకుంటాడు. కానీ రాఘవరావు అనుకొన్నది ఒకటి అయితే, ఆ ఇంట్లో ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. కోడలు చేసే పనులు కొన్ని రాఘవరావుకి నచ్చకపోవటం, అలాగే మామగారు చాలా చాదస్తపు మనిషి అని కోడలు అనటం ఇలా ఆ ఇంట్లో అభిప్రాయ భేదాలు వస్తాయి. ఆ అభిప్రాయ భేదాలు ఎంత వరకు దారితీశాయి. చివరికి రాఘవరావు, చక్రపాణి, రాఘవరావు భార్య ఏమయ్యారు? వారిని ఎవరు చూశారు? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. (Rangamarthanda Streaming in Amazon Prime Video)

ఇవి కూడా చదవండి:

*********************************

*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?

*NBK SRH: పాపం మన SRH క్రికెటర్లు.. బాలయ్య డైలాగ్స్ చెప్పలేక ఎన్ని తిప్పలు పడ్డారో..!

*Dasara Nani: అందరికీ చెప్పేది ఒకటే.. చాలా మంది చాలా చెప్తారు.. ఎవ్వరి మాటలు వినకండి

*Ustaad Bhagat Singh: ఫ్రంట్ ఏంటి? బ్యాక్ ఏంటి?.. కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలదా..

*Hanuman Jayanti Special: ‘ఆదిపురుష్’ నుంచి హనుమాన్ పోస్టర్.. ఎలా ఉందంటే?

*Upasana Baby Shower Party: వీడియోతో సర్‌ప్రైజ్ చేసిన ఉపాసన.. చరణ్ లుక్ అదుర్స్!

Updated Date - 2023-04-07T11:20:58+05:30 IST