Jayadevi: ప్రముఖ సినీనటి, దర్శకురాలు మృతి

ABN , First Publish Date - 2023-10-05T22:19:34+05:30 IST

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి, నిర్మాత, కథారచయిత్రి, దర్శకురాలు జయదేవి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఆమె పోరూరుకు సమీపంలోని కారపాక్కం, సమయపురం నగర్‌, మూడో వీధిలోని తన స్వగృహంలోనే బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు.

Jayadevi: ప్రముఖ సినీనటి, దర్శకురాలు మృతి
Jayadevi

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి, నిర్మాత, కథారచయిత్రి, దర్శకురాలు జయదేవి (Jayadevi) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఆమె పోరూరుకు సమీపంలోని కారపాక్కం, సమయపురం నగర్‌, మూడో వీధిలోని తన స్వగృహంలోనే బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆమె మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె అంత్యక్రియలు బుధవారం సాయంత్రం పూర్తి చేశారు. (Actress and Director Jayadevi No More)

1980, 90 దశకాల్లో సినీ రంగంలో ప్రముఖురాలిగా ఉన్న ఆమె... 1976లో వచ్చిన ‘ఇదయ మలర్‌’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘వాళ నినైత్తాల్‌ వాళలాం’, ‘సరియాన జోడి’, రజనీకాంత్‌తో ‘గాయత్రి’ వంటి అనేక చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ‘మట్రవై నేరిల్‌’ అనే చిత్రానికి 1980లో దర్శకత్వం వహించారు. ప్రముఖ కెమెరామెన్‌ పీసీ శ్రీరామ్‌ను సినిమాటోగ్రాఫర్‌గా ‘వా ఇంద పక్కం’ అనే చిత్రంలో పరిచయం చేసిన ఘనత ఆమెకే దక్కింది.


Jayadevi-Pic.jpg

‘విలంగు మీన్‌’, ‘విలంగు పాసం ఒరు వేషం’, ‘నలం నలమరియ ఆవల్‌’, ‘పురట్చికారన్‌’, ‘పెణ్గలిన్‌ శక్తి’ వంటి చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. అలాగే నిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించారు. తమిళనాడు సినీ నిర్మాతల సంఘం కార్యవర్గ సభ్యురాలిగా కూడా పనిచేశారు. ప్రముఖ దర్శకుడు వేలు ప్రభాకరన్‌తో కలిసి కొంతకాలం జీవించిన జయదేవి.. ఆయనతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడిపోయారు.


ఇవి కూడా చదవండి:

============================

*Unstoppable with NBK Season 3: మరో దరువుకి సిద్ధమైన బాలయ్య.. ఎప్పటి నుంచి అంటే..

********************************

*Allu Arjun: ‘మేడమ్ టుస్సాడ్స్’లో మైనపు విగ్రహాం.. తొలి తెలుగు నటుడిగా రికార్డ్.. అదెలా?

********************************

*Gopichand32: గోపీచంద్, శ్రీను వైట్ల సినిమా షూటింగ్ మొదలైంది.. భారీగానే ప్లాన్ చేశారు

*********************************

*Bhagavanth Kesari: వరుస అప్‌డేట్స్‌తో ఊపుమీదున్న బాలయ్య.. ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!

*********************************

*NTRNEEL: ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ మూవీ మొదలయ్యేది ఎప్పుడంటే..

**********************************

*Kiran Abbavaram: బిగ్‌ బాస్ రతికతో పెళ్లి అనగానే.. కిరణ్ అబ్బవరం రియాక్షన్ చూశారా..

*********************************

Updated Date - 2023-10-05T22:19:37+05:30 IST