Gopichand32: గోపీచంద్, శ్రీను వైట్ల సినిమా షూటింగ్ మొదలైంది.. భారీగానే ప్లాన్ చేశారు

ABN , First Publish Date - 2023-10-05T20:26:14+05:30 IST

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నెం.1‌గా తెరకెక్కనున్న చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర షూటింగ్ మిలాన్‌లో మొదలైనట్లుగా తెలుపుతూ, దర్శకుడు శ్రీను వైట్ల ఓ వీడియోని షేర్ చేశారు.

Gopichand32: గోపీచంద్, శ్రీను వైట్ల సినిమా షూటింగ్ మొదలైంది.. భారీగానే ప్లాన్ చేశారు
Director Sreenu Vaitla

మాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Sreenu Vaitla) దర్శకత్వంలో చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నెం.1‌గా తెరకెక్కనున్న చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే. మాస్, ఫ్యామిలీస్‌ని మెప్పించే యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రాయడంలో, తీయడంలో సిద్ధహస్తుడైన శ్రీను వైట్ల.. కాస్త గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. హీరో గోపీచంద్‌కు కూడా ఇప్పుడు మంచి హిట్ కావాలి. గోపీచంద్‌‌ను ఇంతకు ముందు చేయని పూర్తి భిన్నమైన పాత్రలో చూపించడానికి శ్రీను వైట్ల.. ఓ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ అప్‌డేట్‌ని వదిలారు.

భారీ బడ్జెట్‌తో లావిష్‌గా తెరకెక్కబోతోన్న ఈ చిత్ర షూటింగ్ తాజాగా ఇటలీలో ప్రారంభమైనట్లుగా మేకర్స్ తెలిపారు. దర్శకుడు శ్రీను వైట్ల కూడా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇటలీ, మిలాన్‌లోని కొన్ని అద్భుతమైన లోకేషన్స్‌లో హీరో గోపీచంద్‌తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. సినిమాలో చాలా భాగం విదేశాల్లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. (Gopichand32 Film Update)


Gopichand.jpg

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అయిన వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. గతంలో శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. కెవి గుహన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇతర టెక్నికల్ టీమ్‌ను, ఇందులో నటించే నటీనటుల వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Bhagavanth Kesari: వరుస అప్‌డేట్స్‌తో ఊపుమీదున్న బాలయ్య.. ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!

*********************************

*NTRNEEL: ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ మూవీ మొదలయ్యేది ఎప్పుడంటే..

**********************************

*Kiran Abbavaram: బిగ్‌ బాస్ రతికతో పెళ్లి అనగానే.. కిరణ్ అబ్బవరం రియాక్షన్ చూశారా..

*********************************

*Lethakulu: ఎస్తర్ కీలకపాత్రలో నటిస్తోన్న సినిమా టైటిల్ ఇదే..

******************************

*Yendira Ee Panchayithi: ‘ఏందిరా ఈ పంచాయితీ’కి సెన్సార్ ఏ సర్టిఫికేట్ జారీ చేసిందంటే..

******************************

Updated Date - 2023-10-05T20:26:14+05:30 IST