Bhagavanth Kesari: వరుస అప్‌డేట్స్‌తో ఊపుమీదున్న బాలయ్య.. ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!

ABN , First Publish Date - 2023-10-05T17:57:19+05:30 IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్ర ప్రమోషన్స్‌లో మేకర్స్ జోరు పెంచారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోన్న కొద్దీ.. సినిమాపై భారీగా అంచనాలు క్రియేట్ అయ్యేలా మంచి ప్లానింగ్‌తో మేకర్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు. అక్టోబర్ 8న ట్రైలర్ విడుదల కాబోతోంది.

Bhagavanth Kesari: వరుస అప్‌డేట్స్‌తో ఊపుమీదున్న బాలయ్య.. ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!
Balakrishna in Bhagavanth Kesari

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్ర ప్రమోషన్స్‌లో మేకర్స్ జోరు పెంచారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోన్న కొద్దీ.. సినిమాపై భారీగా అంచనాలు క్రియేట్ అయ్యేలా మంచి ప్లానింగ్‌తో మేకర్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. చిత్ర టీజర్ నుంచి పాటల వరకు సినిమా ప్రమోషన్ ఎలిమెంట్స్ మ్యాసివ్ బజ్‌ని సృష్టించాయి. బుధవారం చిత్ర సెకండ్ సింగిల్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ విడుదలకి సంబంధించిన బ్లాస్టింగ్ అప్‌డేట్‌ని వదిలారు. అక్టోబర్ 8న చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. (Bhagavanth Kesari Theatrical Trailer Update)

ఈ పోస్టర్‌లో నటసింహం చేతిలో కర్రతో కుర్చీపై కూర్చున్న విజువల్ కనిపిస్తుంది. బాలకృష్ణ (Balakrishna) ఇంటెన్స్‌గా చూస్తుండగా, అతని వెనుక పోలీసు అధికారులు నిలబడి ఉన్నారు. మాస్, యాక్షన్ అంశాలతో పాటు.. సినిమాలో హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయనేది తాజాగా వచ్చిన ‘ఉయ్యాలో ఉయ్యాల’ పాటతో తెలిసిపోతోంది. రాబోయే ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కి చేరడం ఖాయం అనేలా మేకర్స్ తెలియజేస్తున్నారు.


Balayya.jpg

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపించేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాహు గారపాటి (Sahu Garapati), హరీష్ పెద్ది (Harish Peddi) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కథానాయికగా నటిస్తుండగా శ్రీలీల (Sreeleela) కీలక పాత్రలో కనిపించనుంది. జాతీయ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఎస్ఎస్ థమన్ (SS Thaman) మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*NTRNEEL: ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ మూవీ మొదలయ్యేది ఎప్పుడంటే..

**********************************

*Kiran Abbavaram: బిగ్‌ బాస్ రతికతో పెళ్లి అనగానే.. కిరణ్ అబ్బవరం రియాక్షన్ చూశారా..

*********************************

*Lethakulu: ఎస్తర్ కీలకపాత్రలో నటిస్తోన్న సినిమా టైటిల్ ఇదే..

******************************

*Yendira Ee Panchayithi: ‘ఏందిరా ఈ పంచాయితీ’కి సెన్సార్ ఏ సర్టిఫికేట్ జారీ చేసిందంటే..

******************************

*Varalaxmi Sarathkumar: డ్రగ్స్ కేసు వ్యవహారంలో నా పేరు ఎందుకు హైలెట్ అయ్యిందంటే?

***********************************

Updated Date - 2023-10-05T17:57:19+05:30 IST