A R Rahman: రెహ్మాన్‌కు మద్దతు

ABN , First Publish Date - 2023-09-13T17:05:06+05:30 IST

మ్యూజిక్‌ లైవ్‌ కాన్సర్ట్‌ నిర్వాహకులు చేసిన తప్పుల కారణంగా వివాదంలో చిక్కుకున్న సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహ్మాన్‌కు కోలీవుడ్‌ హీరో కార్తీ, సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజాతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు అండగా నిలిచారు.

A R Rahman: రెహ్మాన్‌కు మద్దతు
AR Rahaman

మ్యూజిక్‌ లైవ్‌ కాన్సర్ట్‌ (Music Live Concert) నిర్వాహకులు చేసిన తప్పుల కారణంగా వివాదంలో చిక్కుకున్న సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహ్మాన్‌ (AR Rahman)కు కోలీవుడ్‌ హీరో కార్తీ (Karthi), సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా (Yuvan Shankar Raja)తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు అండగా నిలిచారు. కచ్చేరి కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో ఏం జరిగిందో తెలియదని.. కానీ, ఇలా జరగడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు.

ఇదే విషయంపై హీరో కార్తీ ట్వీట్‌ చేస్తూ... రెహ్మాన్‌ మూడు దశాబ్దాలుగా ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయనను ప్రేమిస్తున్నాం. అభిమానిస్తున్నాం. మ్యూజిక్‌ కాన్సర్ట్‌ సమయంలో జరిగిన సంఘటనలు దురదృష్టకరం. ఏదిఏమైనా దీనివల్ల రెహ్మాన్‌కు చెడ్డ పేరు వచ్చింది. ఈ కచేరి జరిగిన ప్రాంగణంలో మా కుటుంబం కూడా ఉంది. ప్రతి ఒక్కరిపట్ల ప్రేమను చూపించే రెహ్మాన్‌కు ఇలాంటి తరుణంలో అండగా ఉందాం. ద్వేషం కంటే ప్రేమను ఎక్కువగా పంచుదాం’ అని పేర్కొన్నారు. (Karthi Supports AR Rahman)


AR-Rahman.jpg

సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా స్పందిస్తూ... సహ కళాకారుడిగా రెహ్మాన్‌కు అండగా ఉంటా. కచేరి సమయంలో జరిగిన అపశ్రుతులకు, ఏర్పాట్లు, నిర్వహణ లోపాలకు నిర్వాహకులదే నైతిక బాధ్యత’ అని పేర్కొన్నారు. కాగా, నగర శివారు ప్రాంతమైన పనైయూరులో ఆదివారం రాత్రి ‘మరక్కుమా నెంజమే’ అనే పేరుతో ఏఆర్‌ రెహ్మాన్‌ ఆధ్వర్యంలో ఆదివారం మ్యూజిక్‌ లైవ్‌ కాన్సర్ట్‌లో జరిగింది. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయలేదు. ఈ కారణంగా స్వల్ప తొక్కిసలాట, ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు డీజీపీ ఆదేశించిన విషయం తెల్సిందే.


ఇవి కూడా చదవండి:

============================

*Dil Raju: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కోసం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా..

************************************

*Samyuktha Menon: క‌ళ్యాణ్ రామ్ ‘డెవిల్’‌లో సంయుక్త ఫస్ట్ లుక్ వదిలారు

***********************************

*Thalaivar171: రజనీకాంత్ 171వ చిత్రం ఎవరితోనో తెలుసా?

**********************************

*Aadikeshava: వైష్ణవ్, శ్రీలీల కెమిస్ట్రీ హైలెట్‌గా ‘సిత్తరాల సిత్రావతి’

**********************************

Updated Date - 2023-09-13T17:05:06+05:30 IST