Samyuktha Menon: క‌ళ్యాణ్ రామ్ ‘డెవిల్’‌లో సంయుక్త ఫస్ట్ లుక్ వదిలారు

ABN , First Publish Date - 2023-09-11T18:04:32+05:30 IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ మూవీలో క‌ళ్యాణ్ రామ్ జోడీగా సంయుక్తా మీనన్ నటిస్తోంది. సోమవారం సంయుక్తా మీనన్ పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్.. చిత్రంలోని ఆమె పేరును, ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

Samyuktha Menon: క‌ళ్యాణ్ రామ్ ‘డెవిల్’‌లో సంయుక్త ఫస్ట్ లుక్ వదిలారు
Samyuktha Menon in Devil Movie

మొదటి నుంచి వైవిధ్య‌మైన సినిమాల‌ ప్రాధాన్యతను ఇస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ (Nandamuri Kalyan Ram). ఆయన హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ మూవీలో క‌ళ్యాణ్ రామ్ జోడీగా సంయుక్తా మీనన్ (Samyuktha Menon) నటిస్తోంది. ఇంతకు ముందు ఈ జంట హిట్ బొమ్మ ‘బింబిసార’(Bimbisara)లో కలిసి నటించిన విషయం తెలిసిందే. సోమవారం (సెప్టెంబ‌ర్ 11) సంయుక్తా మీనన్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ‘డెవిల్’ (Devil) చిత్రంలో ఆమె పోషించిన పాత్ర పేరు, ఆమె ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో నైష‌ధ అనే పాత్రలో ఆమె కనిపించనుంది.

ఇక విడుదల చేసిన పోస్ట‌ర్‌ను గమనిస్తే.. కొబ్బ‌రికాయ‌, పువ్వులు అన్నింటినీ తీసుకుని గుడిలో పూజకు వెళుతున్న అమ్మాయిగా ప్లెజంట్‌ లుక్‌లో సంయుక్త కనిపిస్తోంది. ఈ లుక్ చూస్తుంటే ఆమె పాత్రకు ఇందులో చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లుగా అర్థమవుతోంది. పాన్ ఇండియా లెవల్లో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమాను న‌వంబ‌ర్ 24న ప్ర‌పంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ‘డెవిల్’ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఆక‌ట్టుకోబోతున్నారు. (HBD Samyuktha Menon)


Samyuktha-Menon.jpg

గ‌త ఏడాది తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో వ‌న్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన ‘బింబిసార’తో మెప్పించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది ‘డెవిల్’తో మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. దేవాన్ష్ నామా స‌మ‌ర్ప‌కుడిగా.. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా దర్శక‌నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందిస్తుండగా.. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. (#HBDSamyuktha)


ఇవి కూడా చదవండి:

============================

*Thalaivar171: రజనీకాంత్ 171వ చిత్రం ఎవరితోనో తెలుసా?

**********************************

*Aadikeshava: వైష్ణవ్, శ్రీలీల కెమిస్ట్రీ హైలెట్‌గా ‘సిత్తరాల సిత్రావతి’

**********************************

*Jithender Reddy: దర్శకుడు విరించి వర్మ తదుపరి చిత్రమిదే.. టైటిల్ లుక్ విడుదల

**********************************

*Anand Deverakonda: ‘బేబీ’ తర్వాత.. ఆనంద్ రూట్ మార్చాడు.. ఈసారి మాస్ బొమ్మతో..

*********************************

Updated Date - 2023-09-11T19:45:10+05:30 IST