Aadikeshava: వైష్ణవ్, శ్రీలీల కెమిస్ట్రీ హైలెట్‌గా ‘సిత్తరాల సిత్రావతి’

ABN , First Publish Date - 2023-09-09T21:55:46+05:30 IST

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తోన్న చిత్రం ‘ఆదికేశవ’. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘సిత్తరాల సిత్రావతి’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Aadikeshava: వైష్ణవ్, శ్రీలీల కెమిస్ట్రీ హైలెట్‌గా ‘సిత్తరాల సిత్రావతి’
Aadikeshava Movie Still

జాతీయ అవార్డు గెలుచుకున్న ‘ఉప్పెన’ (Uppena) చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసిన పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej).. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు పక్కింటి కుర్రాడిలా కనిపించిన వైష్ణవ్ తేజ్.. ఇప్పుడు ‘ఆదికేశవ’ (Aadikeshava) అనే యాక్షన్ చిత్రంతో తనలోని మాస్ కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. టాలీవుడ్ క్రష్ శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంతో అపర్ణా దాస్, జోజు జార్జ్ ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.


Sreeleela-3.jpg

నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి (Srikanth N Reddy) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ‘సిత్తరాల సిత్రావతి’ (Sittharala Sithravathi) అంటూ సాగే మొదటి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. హీరోహీరోయిన్ల మధ్య సాగే మెలోడీ సాంగ్ ఇది. హీరో వైష్ణవ్ తేజ్ తన చిత్ర(హీరోయిన్ శ్రీలీల)ను ‘సిత్తరాల సిత్రావతి’ అని పిలుస్తూ, ఆమె అందాన్ని పొగుడుతూ పాడే పాట ఇది. విజువల్స్ బ్యూటీఫుల్‌గా ఉన్నాయి.

Sreeleela-1.jpg

గేయ రచయిత సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి, అందమైన పదాల అమరికతో ఈ పాటకు ప్రాణం పోశారు. ఆస్కార్ అవార్డ్ గెలిచిన ‘నాటు నాటు’ పాటను ఆలపించిన రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటకి తన గాత్రంతో విభిన్నమైన జానపద రుచిని అందించగా.. గాయని రమ్య బెహరా పాటలోని అనుభూతిని తన స్వరంలో చక్కగా పలికించారు. ఈ పాట వైరల్ అవుతుందని, పార్టీలలో మారుమ్రోగి పోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం. థియేటర్లలో ప్రేక్షకులకు మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని అందించడానికి ఆదికేశవ టీమ్ కసరత్తు చేస్తోంది. ఈ చిత్రం పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్న నిర్మాతలు, ఈ దీపావళికి బాక్సాఫీస్ దగ్గర విజయ ఢంకా మోగిస్తామని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో మేకర్స్ దృష్టి పెట్టారు. (Aadikeshava First Single Out)

Sreeleela-2.jpg


ఇవి కూడా చదవండి:

============================

*Jithender Reddy: దర్శకుడు విరించి వర్మ తదుపరి చిత్రమిదే.. టైటిల్ లుక్ విడుదల

**********************************

*Anand Deverakonda: ‘బేబీ’ తర్వాత.. ఆనంద్ రూట్ మార్చాడు.. ఈసారి మాస్ బొమ్మతో..

*********************************

*Sky: ఈ ‘స్కై’కి ట్యాగ్‌లైన్ అదిరింది

*********************************

*Gopichand32: గోపీచంద్ 32వ చిత్రం ఆ దర్శకుడితోనే.. ఓపెనింగ్ కూడా పూర్తయింది

*********************************

*Jawan: లెజెండ్‌లో ఉన్న స్టఫ్ ఇది.. ‘జవాన్‌’పై మహేష్ బాబు రివ్యూ.. ఎంత బాగుందో

*********************************

Updated Date - 2023-09-09T21:55:46+05:30 IST