Dil Raju: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కోసం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా..

ABN , First Publish Date - 2023-09-11T20:17:06+05:30 IST

నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ దిశగా దూసుకెళుతోంది. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారని మరోసారి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో ప్రూవ్ చేశారని తెలుపుతూ.. తాజాగా నిర్మాత దిల్ రాజు చిత్రయూనిట్‌ని అభినందించారు.

Dil Raju: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కోసం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా..
Ms Shetty Mr Polishetty Press Meet

నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్క శెట్టి (Anushka Shetty) జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Ms Shetty Mr Polishetty) సినిమా రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ దిశగా దూసుకెళుతోంది. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల అప్రిషియేషన్స్‌తో పాటు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ నుంచి ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాను అభినందించారు నిర్మాత దిల్ రాజు (Dil Raju). ఇలాంటి మంచి చిత్రాలకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లోని యూవీ క్రియేషన్స్ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ..

‘‘తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారని మరోసారి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో ప్రూవ్ చేశారు. ఈ సినిమా ‘జవాన్’తో పాటు రిలీజైనా స్టడీగా నిలదొక్కుకుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చూస్తున్నప్పుడు మంచి ఫీల్ కలిగింది. నవీన్ పోలిశెట్టి తన క్యారెక్టర్‌లో నవ్విస్తూనే ఉన్నాడు. అలాగే అనుష్క యాక్టింగ్‌తో ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుంది. సినిమా ఫినిష్ అయ్యేప్పటికి ఒక మంచి సినిమా చూశాననిపించింది. వెంటనే యూవీ వంశీకి, నవీన్‌కు ఫోన్ చేశాను. మీరు మంచి సినిమా చేశారు. మౌత్ టాక్ బాగుంది.. దీన్ని ప్రజల దగ్గరకు మరింతగా తీసుకెళ్లాలి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టమని నేనే అడిగాను. గుడ్ ఫిలింస్ వచ్చినప్పుడు వాటిని మనమంతా ఎంకరేజ్ చేయాలి అనేది నా టార్గెట్. యూనిట్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని తెలుసు. పాండమిక్‌ను ఎదుర్కొన్నారు. ఆ కష్టమంతా ఈ సక్సెస్‌తో మర్చిపోతున్నారు. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేయండి. (Dil Raju About Ms Shetty Mr Polishetty)


ఇంకా సినిమా చూడని వాళ్లుంటే.. చూసేలా ప్రమోట్ చేసుకోవాలి. మీరు ఎక్కడికి రమ్మన్నా ఈ సినిమా ప్రచారం కోసం వస్తాను. నాలుగు వారాల వరకు ఈ సినిమా స్టడీగా వెళ్తుందనే నమ్మకం ఉంది. ఇవాళ మ్యాట్నీస్ కూడా ఫుల్ అయ్యాయి. మీడియా మిత్రులు కూడా మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తారు. వారికి కూడా థాంక్స్. యూఎస్ ఆడియెన్స్‌కు ఈ సినిమాలోని అడ్వాన్స్ థాట్ నచ్చుతుంది. అందుకే వాళ్లు సండేకే వన్ మిలియన్ కలెక్షన్స్ ఇచ్చేశారు. నవీన్ కెరీర్‌లో ఇది మూడో వన్ మిలియన్ డాలర్ మూవీ. ఒక కొత్త పాయింట్‌ను ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా చెప్పారు. నవీన్ తన క్యారెక్టర్ ద్వారా స్టార్టింగ్ నుంచి నవ్విస్తూ వచ్చాడు. లాస్ట్ 15 మినిట్స్ వరకు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఫిల్మ్ పూర్తయ్యేసరికి ఒక గుడ్ మూవీ చూసిన ఫీల్ కలిగించారు. ‘జవాన్’ (Jawan)ను తట్టుకుంటూ ఈ సినిమా నిలబడగలిగింది. స్ట్రాంగ్ కలెక్షన్స్‌తో ముందుకెళ్తోంది. యూనిట్ మొత్తానికి నా అభినందనలు’’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

============================

*Samyuktha Menon: క‌ళ్యాణ్ రామ్ ‘డెవిల్’‌లో సంయుక్త ఫస్ట్ లుక్ వదిలారు

***********************************

*Thalaivar171: రజనీకాంత్ 171వ చిత్రం ఎవరితోనో తెలుసా?

**********************************

*Aadikeshava: వైష్ణవ్, శ్రీలీల కెమిస్ట్రీ హైలెట్‌గా ‘సిత్తరాల సిత్రావతి’

**********************************

Updated Date - 2023-09-11T20:17:06+05:30 IST