Thalaivar171: రజనీకాంత్ 171వ చిత్రం ఎవరితోనో తెలుసా?

ABN , First Publish Date - 2023-09-11T16:20:40+05:30 IST

‘జైలర్’తో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టామినా ఏంటో మరోసారి బాక్సాఫీస్‌కి తెలిసివచ్చింది. ఇదే ఊపులో తలైవా.. ఇప్పుడు మరింత హుషారుగా వర్క్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఆయన మరో సినిమాకు సైన్ చేశారు. తలైవర్171 చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకోనుంది.

Thalaivar171: రజనీకాంత్ 171వ చిత్రం ఎవరితోనో తెలుసా?
Super Star Rajinikanth

‘జైలర్’ (Jailer)తో సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) స్టామినా ఏంటో మరోసారి బాక్సాఫీస్‌కి తెలిసివచ్చింది. ఇదే ఊపులో తలైవా.. ఇప్పుడు మరింత హుషారుగా వర్క్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఆయన మరో సినిమాకు సైన్ చేశారు. ఈ సినిమాను కూడా ‘జైలర్’ చిత్రాన్ని నిర్మించిన సన్‌పిక్చర్స్ వారే నిర్మించబోతుండటం విశేషం. తాజాగా సన్‌పిక్చర్స్ (Sun Pictures) సంస్థ రజనీకాంత్ 171వ చిత్రానికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ‘తలైవర్171’ (Thalaivar171) ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఈ చిత్రానికి దర్శకుడు ఎవరో తెలుసా?


‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ చిత్రాలతో తిరుగులేని దర్శకుడిగా పేరొందిన లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj). అసలు ఎవరూ ఊహించి కూడా ఉండరీ కాంబినేషన్‌ని. యూనివర్సల్ స్టార్ కమల్ ‌హాసన్‌తో ‘విక్రమ్’ చేసిన లోకేష్ కనగరాజ్‌కు.. వెంటనే సూపర్ స్టార్ రజనీకాంత్‌ని డైరెక్ట్ చేసే అవకాశం రావడం అంటే.. మాములు విషయం కాదు. ప్రస్తుతం విజయ్‌తో లోకేష్ చేసిన ‘లియో’ సినిమా దసరాకి విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల అనంతరం లోకేష్.. తలైవర్ సినిమాకు రెడీ అవుతారని తెలుస్తుంది. ఈలోపు రజనీకాంత్ కీ రోల్ చేస్తున్న ‘లాల్ సలామ్’ (Lal Salam) సినిమా కూడా ఓ కొలిక్కి వచ్చేస్తుంది. వెంటనే ఇద్దరూ ‘తలైవర్171’కు సిద్ధమవుతారని తెలుస్తోంది. రజనీకాంత్‌తో సినిమా చేయడంపై లోకేష్ కనగరాజ్ తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు. తలైవాతో సినిమా చేయబోతున్నందుకు ఎంతో ఎగ్జయిట్ అవుతున్నట్లుగా లోకేష్ చెప్పుకొచ్చారు.

Lokesh-Kangaraj.jpg

మరో విశేషం ఏమిటంటే.. ఈ సినిమాకు కూడా అనిరుధ్ రవిచందరే (Anirudh Ravichander) మ్యూజిక్ అందించబోతున్నారు. రీసెంట్‌గా వచ్చిన రజనీకాంత్ ‘జైలర్’ సక్సెస్‌లో అనిరుధ్ కూడా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. రజనీకాంత్ అంటే అనిరుధ్‌కి ఎంత ఇష్టమో.. ఇటీవల ఓ స్టేజ్‌పై ఆయన మాట్లాడిన మాటలే చెబుతాయి. అలాంటిది ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ అవకాశం అంటే.. ఈసారి అనిరుధ్‌ని అసలు పట్టుకోలేరేమో. అలాగే, లోకేష్ ప్రతి సినిమాకు మరో పార్ట్ ఉన్నట్లుగా.. ఇప్పుడు రజనీతో చేసే సినిమా కూడా అతని సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమవుతుందా? అనేది తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

============================

*Aadikeshava: వైష్ణవ్, శ్రీలీల కెమిస్ట్రీ హైలెట్‌గా ‘సిత్తరాల సిత్రావతి’

**********************************

*Jithender Reddy: దర్శకుడు విరించి వర్మ తదుపరి చిత్రమిదే.. టైటిల్ లుక్ విడుదల

**********************************

*Anand Deverakonda: ‘బేబీ’ తర్వాత.. ఆనంద్ రూట్ మార్చాడు.. ఈసారి మాస్ బొమ్మతో..

*********************************

*Sky: ఈ ‘స్కై’కి ట్యాగ్‌లైన్ అదిరింది

*********************************

Updated Date - 2023-09-11T19:45:57+05:30 IST