Raiza Wilson: వీధి పిల్లి దాడిలో హీరోయిన్‌కు గాయాలు

ABN , First Publish Date - 2023-08-10T15:12:58+05:30 IST

బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో పాల్గొని ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన యువ నటి రైజా విల్సన్‌... వీధి పిల్లి దాడిలో గాయపడ్డారు. ఈ దాడిలో ఆమె చేతికి గాట్లు పడ్డాయి. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె షేర్‌ చేస్తూ, వీధి పిల్లి దాడిలో చేతికి గాయాలయ్యాయని తెలిపారు.

Raiza Wilson: వీధి పిల్లి దాడిలో హీరోయిన్‌కు గాయాలు
Raiza Wilson

బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో పాల్గొని ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన యువ నటి రైజా విల్సన్‌ (Raiza Wilson)... వీధి పిల్లి దాడిలో గాయపడ్డారు. ఈ దాడిలో ఆమె చేతికి గాట్లు పడ్డాయి. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె షేర్‌ చేస్తూ, వీధి పిల్లి (Street Cat) దాడిలో చేతికి గాయాలయ్యాయి అని కామెంట్స్‌ చేశారు. వాటిని చూసిన ఆమె అభిమానులు తగిన జాగ్రత్తలు తీసుకుని త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. కాగా, బిగ్‌బాస్‌ తర్వాత రైజా విల్సన్‌.. ‘ప్యార్‌ ప్రేమ కాదల్‌’ చిత్రం ద్వారా వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘వర్మ’, ‘కాఫీ విత్‌ కాదల్‌’ వంటి చిత్రాల్లో నటించిన ఆమె.. ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు.


Raiza.jpg

ఇంతకు ముందు ఆమె పేరు ఇలాంటి విషయంలోనే వైరల్ అయింది. ఫేషియల్ చేయించుకునేందుకు వెళ్లిన బ్యూటీ పార్లర్‌లో.. జరిగిన సంఘటనతో ఆమె ఫేస్ అంతా వాచిపోయి, కమిలిపోయినట్లుగా అయిపోయింది. ఆ టైమ్‌లో సోషల్ మీడియా అంతా ఆమె గురించే వార్తలు వినిపించాయి. ఇప్పుడేమో వీధి పిల్లి విషయంలో ఆమె పేరు వినిపిస్తుండటంతో.. ఎలాగైనా వార్తలలో ఉండాలని కావాలనే రైజా ఇలా చేస్తుందేమో.. అని కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తుండటం విశేషం.

Raiza-2.jpg

ఇక బ్యూటీ పార్లర్, వీధి పిల్లి సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాను మాత్రం తన గ్లామర్‌తో రైజా విల్సన్ రఫ్ ఆడిస్తుంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ.. నెటిజన్లకు ట్రీట్ ఇస్తుంటుంది. ఇన్‌స్టాలో ఆమె షేర్ చేసే ఫొటోలకు విపరీతంగా లైక్స్ వచ్చిపడుతుంటాయి. ఆ విధంగా సోషల్ మీడియా పరంగా ఆమె ఓ పెద్ద సెలబ్రిటీ కిందే లెక్క.


ఇవి కూడా చదవండి:

***************************************

*OG: పవర్ ‌స్టార్ బర్త్‌డేకి హీట్ వేవ్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధమా..

***************************************

*Bholaa Shankar: భారీ కటౌట్, ర్యాలీ.. సినిమా ప్రచారానికి కాదు బాబాయ్..!

***************************************

*Jailer Twitter Review: టాక్ బాగానే ఉంది కానీ.. విజయ్ ఫ్యాన్సే!

***************************************

*Jailer: ‘జైలర్‌’ సందడి మొదలైంది.. ఒక్కో టిక్కెట్‌ ధర ఎంతో తెలుసా?

***************************************

Updated Date - 2023-08-10T15:13:11+05:30 IST