OG: పవర్ ‌స్టార్ బర్త్‌డేకి హీట్ వేవ్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధమా..

ABN , First Publish Date - 2023-08-10T13:23:23+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు చేస్తున్నా.. అందరి కళ్లు ‘OG’పైనే ఉన్నాయంటే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి పాజిటివ్ వైబ్స్ అలా ఉన్నాయి మరి. తాజాగా ఈ సినిమా నుంచి సెప్టెంబర్ 2వ తేదీన ఓ హీట్ వేవ్‌ని వదలబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

OG: పవర్ ‌స్టార్ బర్త్‌డేకి హీట్ వేవ్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధమా..
OG Poster

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ఎన్ని సినిమాలు చేస్తున్నా.. అందరి కళ్లు ‘OG’పైనే ఉన్నాయంటే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి పాజిటివ్ వైబ్స్ అలా ఉన్నాయి మరి. ఆస్కార్ విజేత అయిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (DVV Entertainment) పతాకంపై డీవీవీ దానయ్య (DVV Danayya) నిర్మాణంలో ఈ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ‘సాహో’ దర్శకుడు, పవర్‌స్టార్ వీరాభిమాని అయిన సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) కథానాయికగా నటిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా 50 శాతానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ‘ఫైర్ స్ట్రోమ్’ అప్‌డేట్‌ని మేకర్స్ ప్రకటించారు.


OG-Teaser.jpg

‘హీట్ వేవ్ వస్తోంది.. ఫేస్ చేయడానికి సిద్ధం కండి.. సెప్టెంబర్ 2న ఫైర్ స్ట్రోమ్ రాబోతోంది..’ అంటూ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ట్విట్టర్ వేదికగా.. పవర్ స్టార్ పుట్టినరోజు ఫ్యాన్స్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లుగా వెల్లడించింది. ఈ విషయం తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్‌‌తో ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోతోంది. ఎందుకంటే.. ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టార్‌గా ఓ గ్యాంగ్‌లో వెళుతున్న షాడో లుక్‌ని విడుదల చేశారు. దీంతో సుజిత్ సంభవం మొదలవ్వబోతోంది అంటూ ఫ్యాన్స్.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (OG Treat on Pawan Kalyan Birthday)

ఇటీవల ‘OG’ రష్‌ చూసిన అర్జున్ దాస్ (Arjun Das).. సినిమా విజువల్స్ మరియు పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఫిదా అయ్యాయని, ఇది నిజమైన ‘అగ్ని తుఫాను’ అని పేర్కొన్నారు. అలాగే శ్రియా రెడ్డి (Sriya Reddy) మరియు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) ఇద్దరూ కూడా తాము ఓజీ కథని ఎంతలా ఇష్టపడ్డారో ఇప్పటికే చెప్పారు. పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్‌ జోడిని తెరపై చూడాలని సినీ ప్రియులు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎస్ థమన్ (S Thaman) సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ అప్‌డేట్‌తో పాటు వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2న ‘OG’ టీజర్‌ని విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

***************************************

*Bholaa Shankar: భారీ కటౌట్, ర్యాలీ.. సినిమా ప్రచారానికి కాదు బాబాయ్..!

***************************************

*Jailer Twitter Review: టాక్ బాగానే ఉంది కానీ.. విజయ్ ఫ్యాన్సే!

***************************************

*Jailer: ‘జైలర్‌’ సందడి మొదలైంది.. ఒక్కో టిక్కెట్‌ ధర ఎంతో తెలుసా?

***************************************

*Vijay Deverakonda: పెళ్లి మీద ఇష్టం పెరిగింది.. త్వరలోనే ఆ ఛాప్టర్‌లోకి..

***************************************

Updated Date - 2023-08-10T13:23:23+05:30 IST