Vijay: విజయ్, వెంకట్ ప్రభు కాంబోలో చిత్రం.. నేపథ్యమిదే..

ABN , First Publish Date - 2023-09-02T22:35:06+05:30 IST

హీరో విజయ్‌ - దర్శకుడు వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో టైమ్‌ ట్రావెల్ స్టోరీ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏజీఎస్‌ బ్యానరుపై నిర్మించే ఈ చిత్రంలో విజయ్‌ తండ్రీ కొడుకులుగా.. ఇతర పాత్రల్లో ప్రభుదేవా, జై, అపర్ణ దాస్‌ తదితరులు నటించనున్నట్టు సమాచారం.

Vijay: విజయ్, వెంకట్ ప్రభు కాంబోలో చిత్రం.. నేపథ్యమిదే..
Hero Vijay

హీరో విజయ్‌ (Vijay) - దర్శకుడు వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్‌లో టైమ్‌ ట్రావెల్ స్టోరీ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏజీఎస్‌ బ్యానరుపై నిర్మించే ఈ చిత్రంలో విజయ్‌ తండ్రీ కొడుకులుగా.. ఇతర పాత్రల్లో ప్రభుదేవా, జై, అపర్ణ దాస్‌ తదితరులు నటించనున్నట్టు సమాచారం. గతంలో వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన ‘మానాడు’ చిత్రం తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నట్టు వినికిడి. విజయ్ 68వ (Thalapathy 68) చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.


‘50 యేళ్ళ తర్వాత తన కుమారుడికి పొంచివున్న ప్రమాదాన్ని తండ్రి విజయ్‌ ముందుగానే పసిగట్టి టైమ్‌ ట్రావెల్‌ (Time Travel)లో ప్రయాణించి ఏ విధంగా రక్షించారన్నదే’ చిత్ర కథగా చెబుతున్నారు. ఇదిలావుంటే, ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో భాగంగా దర్శకుడు వెంకట్‌ ప్రభు, హీరో విజయ్‌, నిర్మాత అర్చన కల్పాతి తదితరులు అమెరికాలోని సౌత్‌ కాలిఫోర్నియాలో ఉన్న క్రియేటివ్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థలో చిత్ర నిర్మాణ పనులను పర్యవేక్షించారు. దీనిపై దర్శకుడు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో శుక్రవారం ఉదయం ఒక ట్వీట్‌ చేశారు. ‘భవిష్యత్‌కు ఆహ్వానం’ అంటూ పేర్కొంటూ, క్రియేటివ్‌ టెక్నాలజీ కార్యాలయంలో హీరో విజయ్‌ దిగిన ఫోటోలను కూడా షేర్‌ చేశారు. ప్రస్తుతం విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘లియో’ (Leo) సినిమా విడుదలకు ముస్తాబవుతోన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Hi Nanna: ‘హాయ్ నాన్న’ మ్యూజికల్ ఫెస్ట్ మొదలవ్వబోతోంది.. మ్యూజిక్ ఎవరో తెలుసుగా..

************************************

*RS Shivaji: ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ నటుడు ‘మాలోకం’ ఇక లేరు

************************************

*Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రీట్ కూడా వచ్చేసింది.. ఇక్కడా కత్తే..

*************************************

*Kushi: తొలిరోజు బాక్సాఫీస్ కొల్లగొట్టిన ‘ఖుషి’.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే..

************************************

*Hari Hara Veera Mallu: పవర్‌ఫుల్ పోస్టర్‌తో ఫ్యాన్స్‌కి ట్రీట్..

*************************************

*Thrigun: పెళ్లిపీటలు ఎక్కుతోన్న మరో టాలీవుడ్ యంగ్ హీరో..

*************************************

Updated Date - 2023-09-02T23:42:32+05:30 IST