Kushi: తొలిరోజు బాక్సాఫీస్ కొల్లగొట్టిన ‘ఖుషి’.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే..

ABN , First Publish Date - 2023-09-02T18:48:21+05:30 IST

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా.. టాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ‌గా దూసుకెళుతోంది. ‘ఖుషి’ డే వన్ వసూళ్లు అందరినీ సర్‌ప్రైజ్ చేస్తున్నాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరినీ ఆకట్టుకుంటూ.. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 30.1 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా మేకర్స్ తెలిపారు.

Kushi: తొలిరోజు బాక్సాఫీస్ కొల్లగొట్టిన ‘ఖుషి’.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే..
Kushi Movie Poster

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన ‘ఖుషి’ (Kushi) సినిమా.. టాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ‌గా దూసుకెళుతోంది. ‘ఖుషి’ డే వన్ వసూళ్లు అందరినీ సర్‌ప్రైజ్ చేస్తున్నాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా వసూళ్లు కూడా షో బై షో పెరుగుతూ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 30.1 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఈ విషయం తెలియజేస్తూ.. మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో తొలి రోజు ఇంత భారీ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. (Kushi First Day Collections)


మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) రూపొందించిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఇలాంటి క్లీన్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ఇటీవల కాలంలో రాలేదనే ప్రశంసలను కూడా అందుకుంటోంది. పాజిటివ్ టాక్ రావడంతో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకు ఎగబడుతున్నారు. ఉదయం నుంచి షోస్ గమనిస్తే.. ఫస్ట్ షో‌కు ఫ్యామిలీస్ తో ప్రతి చోటా హౌస్ ఫుల్స్ కనిపించాయి. నైజాం ఏరియాతో పాటు ఏపీలోని ముఖ్య పట్టణాలలో ఈ సినిమా సూపర్బ్ ఓపెనింగ్స్ రాబట్టుకుంది.

Kushi.jpg

తెలుగు రాష్ట్రాల్లోనూ కాకుండా.. యూఎస్ బాక్సాఫీస్ (US Box Office) వద్ద కూడా ఖుషి జోరు కనిపిస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద 8 లక్షల డాలర్స్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. వన్ మిలియన్ మార్క్‌ను చేరుకునేందుకు వేగంగా పరుగులు పెడుతోంది. ఈ సినిమాకు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే.. మరిన్ని సర్ ప్రైజింగ్ బాక్సాఫీస్ నెంబర్స్ ఈ సినిమా సాధించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.


ఇవి కూడా చదవండి:

============================

*Hari Hara Veera Mallu: పవర్‌ఫుల్ పోస్టర్‌తో ఫ్యాన్స్‌కి ట్రీట్..

*************************************

*Thrigun: పెళ్లిపీటలు ఎక్కుతోన్న మరో టాలీవుడ్ యంగ్ హీరో..

*************************************

*Pawan Kalyan: ఈ రోజుల్లో ఎవడున్నాడ్రా.. ఇలాంటోడు!

*************************************

*Bhagavanth Kesari: హైలీ ఎనర్జిటిక్ గణేష్ సాంగ్‌లో బాలయ్య, శ్రీలీల.. అరుపులే!!

**************************************

*Miss Shetty Mr Polishetty: సెన్సార్ పూర్తి.. ఇక తెరపై చూసుకుందాం

*************************************

Updated Date - 2023-09-02T18:48:21+05:30 IST